What Is Garuda Prasadam And Santana Prapti
Devotional: కొన్ని ప్రదేశాలలో కొన్ని కట్టుబాట్లు, ఆచారాలు, నమ్మకాలు ఉంటాయి. అయితే దక్షిణ అయోధ్యగా విరాజిల్లుతున్న భద్రాచల శ్రీ సీతారామచంద్ర స్వామి వారి ఆలయంలో ప్రతి సంవత్సరం శ్రీరామ నవమి బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. ఇక్కడ ఒక విశేషం ఉంటుంది. మరి ఆ ఆలయ విశేషాలు ఏంటో తెలుసుకుందాం.
వసంత పక్షపయుక్త తిరుకల్యాణ బ్రహ్మోత్సవాలు ప్రతి సంవత్సరం ఘనంగా జరుగుతాయి. ఇందులో భాగంగా ఈ సంవత్సరం కూడా బధ్రాచల పట్టణం మొత్తం సందడి వాతావరణంతో నిండిపోయింది. అయితే శ్రీ మహావిష్ణువుకు అత్యంత ప్రీతిపాత్రుడైన గరుత్మంతుడి పటానికి పూజలు నిర్వహించి, స్వామి వారి తిరుకళ్యాణ బ్రహ్మోత్సవాలకు సకల దేవతలకు, మానవజాతికి తెలిపేలా గరుడపట ధ్వజారోహణం ప్రతి సంవత్సరం జరుపుతారు. అంతేకాదు అష్టదిక్పాలకులు, పంచలోక పాలకులు, దేవతలకు ఆహ్వానించే భేరి పూజ కార్యక్రమాన్ని ఆచార్యులు నిర్వహిస్తారు.
గరుడ పట ధ్వజారోహణం సందర్భంగా గరుత్మంతుని పేరున గరుడ ముద్దల ప్రసాదాన్ని అర్చకులు మహిళలకు ఇస్తారు. ఈ ఆనవాయితీ ఎప్పటి నుంచో కొనసాగుతుంది. ఈ గరుడ ముద్ద ప్రసాదాన్ని స్వీకరిస్తే సంతానం లేని మహిళలకు, రుగ్మతలతో బాధ పడే వారికి ఉపశమనం కలుగుతుందని భక్తుల నమ్మకం. పిల్లలు లేని వారికి వెంటనే పిల్లలు పుడుతారనే నమ్మకంతో ఎంతో మంది మహిళలు ఇక్కడికి వస్తారు. ఈ ప్రసాదాన్ని స్వీకరించడానికి వచ్చిన మహిళలు సంతానం కలుగుతుందని నమ్ముతారు.
శ్రీరామనవమి బ్రహ్మోత్సవాలను పురస్కరించుకొని భద్రాచల ఆలయంలో ఏప్రిల్ 15న నిర్వహించేందుకు ఆలయం సన్నద్ధమవుతోంది. పిల్లలు లేని వారు, కొన్ని రుగ్మతలతో బాధ పడుతున్న వారు స్వామి వారిని దర్శించుకొని ఆ గరుడ ముద్దల ప్రసాదాన్ని సేవిస్తే కచ్చితంగా పిల్లలు పుడుతారట.