https://oktelugu.com/

సింగర్‌‌ సునీత పెళ్లి డేట్‌ ఫిక్స్‌.. ఎప్పుడంటే..?

ఆమె స్వరానికి అందరూ ఫిదా అవ్వాల్సిందే. ఆమె పాట పడిందంటే ఎవరైనా తనువు మరిచి వినాల్సిందే. స్వరానికి స్వరం.. అందానికి అందం ఆమె సొంతం. ఆమె ఎవరో కాదు.. టాలీవుడ్‌ ప్లే బ్యాక్‌ సింగర్‌‌ సునీత. సునీత ఇప్పుడు రెండో పెళ్లికి రెడీ అయిపోయింది. ఇటీవలే ఈ విషయాన్ని స్వయంగా ప్రకటిస్తూ తన నిశ్చితార్థపు ఫొటోలు షేర్ చేసింది కూడా. డిజిట‌ల్ మీడియా ప‌ర్సన్ రామ్ వీర‌ప‌నేనిని వివాహం చేసుకోబోతున్నట్లు పేర్కొన్నారు. దీంతో సునీత రెండో వివాహం […]

Written By:
  • Srinivas
  • , Updated On : December 31, 2020 / 01:50 PM IST
    Follow us on


    ఆమె స్వరానికి అందరూ ఫిదా అవ్వాల్సిందే. ఆమె పాట పడిందంటే ఎవరైనా తనువు మరిచి వినాల్సిందే. స్వరానికి స్వరం.. అందానికి అందం ఆమె సొంతం. ఆమె ఎవరో కాదు.. టాలీవుడ్‌ ప్లే బ్యాక్‌ సింగర్‌‌ సునీత. సునీత ఇప్పుడు రెండో పెళ్లికి రెడీ అయిపోయింది. ఇటీవలే ఈ విషయాన్ని స్వయంగా ప్రకటిస్తూ తన నిశ్చితార్థపు ఫొటోలు షేర్ చేసింది కూడా. డిజిట‌ల్ మీడియా ప‌ర్సన్ రామ్ వీర‌ప‌నేనిని వివాహం చేసుకోబోతున్నట్లు పేర్కొన్నారు. దీంతో సునీత రెండో వివాహం తాలూకు విషయాలు నెట్టింట ట్రెండింగ్‌గా మారాయి. ఈ నేపథ్యంలోనే తన పెళ్లి డేట్ కన్ఫర్మ్ చేసిన ఆమె పెళ్లికి ముందు తిరుమల శ్రీవారిని సైతం దర్శించుకున్నారు.

    Also Read: నిహారిక పెళ్లి తర్వాత ప్లాన్.. దీంతో రద్దు !

    ‘10 నెలల అనంతరం స్వామి వారిని వైకుంఠ ద్వారం ద్వారా దర్శించుకోవడం చాలా సంతోషంగా ఉంది. జ‌న‌వ‌రి 9న మా వివాహం జ‌ర‌గ‌నుంది’ అని సునీత చెప్పారు. త‌న‌కు మంచి జీవితాన్ని అందించాల‌ని స్వామి వారిని కోరుకున్నట్లు చెప్పారు. ఇక ఇప్పటికే సునీత నిశ్చితార్థం, ప్రీ వెడ్డింగ్ పార్టీలు ఘనంగా జరిగాయి. డిసెంబర్ 26న జరిగిన ప్రీ వెడ్డింగ్ పార్టీకి పలువురు సెలబ్రిటీలు హాజరై ఆమెకు శుభాకాంక్షలు చెప్పారు. నిజానికి డిసెంబ‌ర్‌లో పెళ్లి చేసుకోవాల‌ని ఈ జంట భావించిన‌ప్పటికీ ఇద్దరి జాత‌కాల ప్రకారం స‌రైన ముహూర్తాలు లేక‌పోవ‌డంతో జ‌న‌వ‌రి 9న ముహూర్తం ఫిక్స్ చేశారు.

    Also Read: సంక్రాంతి బరిలో దిగుతున్న నాలుగు సినిమాలు..!

    19 ఏళ్ల వయసులోనే పెళ్లి చేసుకున్న సునీత.. కొన్నేళ్ల తర్వాత భర్తతో విడాకులు చేసుకున్నారు. అప్పటి నుంచి ఇద్దరు పిల్లల బాధ్యతను మోస్తూ ఒంటరిగానే ఉంటున్న ఆమె.. ఇన్నేళ్ల తర్వాత మరో కొత్త ప్రయాణం మొదలు పెడుతున్నారు. కరోనా నిబంధనలు పాటిస్తూ జరగనున్న సునీత పెళ్లి వేడుకలో కేవలం ఆమె కుటుంబసభ్యులు, అత్యంత సన్నిహితులు మాత్రమే పాల్గొనబోతున్నారని సమాచారం.

    మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్