Niharika Konidela
Niharika Konidela : మెగా ఫ్యామిలీ నుండి హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చి, పెద్దగా సక్సెస్ లు చూడకపోయేసరికి పెళ్లి చేసుకొని స్థిరపడిన నిహారిక(Niharika Konidela), సినిమాల మీద ఆసక్తితో పలు వెబ్ సిరీస్ లను నిర్మిస్తూ కెరీర్ లో ముందుకు దూసుకెళ్లింది. ఒక వెబ్ సిరీస్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది కానీ, ఆ తర్వాత నిర్మించిన రెండు వెబ్ సిరీస్ లు నిహారికకు నష్టాలను మిగిలించింది. ఇక విడాకుల తర్వాత ఆమె ఫీచర్ ఫిలిమ్స్ ని నిర్మించడానికి సిద్ధమైంది. అందులో భాగంగా ఆమె నిర్మించిన ‘కమిటీ కుర్రాళ్ళు’ అనే చిత్రం కమర్షియల్ గా ఎంత పెద్ద హిట్ అయ్యిందో మన అందరికీ తెలిసిందే. ఎలాంటి అంచనాలు లేకుండా చాలా మామూలుగా విడుదలైన ఈ సినిమా కమర్షియల్ గా పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ గా నిల్చింది. కేవలం రెండు కోట్ల రూపాయిల బడ్జెట్ తో నిర్మించి 20 కోట్ల రూపాయిల లాభాలను మూటగట్టుకుంది నిహారిక.
Also Read : యంగ్ హీరోపై నిహారిక క్రేజీ కామెంట్స్.. చాలా ఈజీగా పడిపోతాడంటూ!
ఇప్పుడు ఆమె నిర్మాతగా రెండవ ఫీచర్ ఫిల్మ్ మొదలు పెట్టబోతోంది. ‘పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్'(Pink Elephant Pictures) పై ఆమె మానస శర్మ అనే అమ్మాయి దర్శకత్వం లో ఈ సినిమాని నిర్మించనుంది. మానస శర్మ గతంలో నిహారిక నిర్మించిన రెండు వెబ్ సిరీస్ లలో కియేటివ్ డైరెక్టర్ గా పని చేసింది. అందులో జీ5 యాప్ లో సూపర్ హిట్ గా నిల్చిన ‘ఒక చిన్న ఫ్యామిలీ’ అనే వెబ్ సిరీస్ ఉంది. అదే విధంగా సోనీ లైవ్ లో స్ట్రీమింగ్ అవుతున్న ‘బెంచ్ లైఫ్’ అనే సిరీస్ కూడా ఉంది. ఈమెలో క్రియేటివ్ యాంగిల్ ని గమనించిన నిహారిక, ఆమెతో కలిసి ఫీచర్ ఫిల్మ్ కి పని చేయడానికి రెడీ అయ్యింది. నిహారిక తన బ్యానర్ లో ఇలా కొత్త వాళ్లకు మాత్రమే అవకాశాలు ఇస్తూ రావడం అభినందనీయం. కమిటీ కుర్రాళ్ళు చిత్రంలో కేవలం సాయి కుమార్ తప్ప, మిగిలిన నటీనటులంతా కొత్తవాళ్లే.
ఈ సినిమాలో కూడా పూర్తిగా కొత్తవాళ్లే ఉంటారట. నిజానికి ఇది చాలా డేరింగ్ మూమెంట్ అనే చెప్పాలి. ఇలాంటి సినిమాలకు రెండు కోట్లు ఖర్చు చేసినా ఎక్కువే. ఎందుకంటే సరైన బజ్ క్రియేట్ కాకపోతే ఆ రెండు కోట్ల రూపాయిల బూడిదలో పోసిన పన్నీరే అనొచ్చు. నిహారిక తనకు ఉన్న బ్యాక్ గ్రౌండ్ సపోర్ట్ తో మంచి పేరున్న దర్శకుడితో, నటీనటులతో సినిమాలను నిర్మించగలదు. అంతెందుకు తన కుటుంబం లోనే ఎంతో మంది హీరోలు ఉన్నారు, వాళ్ళతోనే ఆమె సినిమాలు చేసుకోవచ్చు. కానీ అలాంటి వాటి జోలికి పోకుండా కేవలం కొత్తవాళ్లకు మాత్రమే అవకాశాలు ఇస్తూ తన కెరీర్ ని సరికొత్త పంథాలో నడిపిస్తుంది. నిర్మాతగా నాగబాబు పెద్ద సక్సెస్ కాలేదు. కానీ నిహారిక అభిరుచులు చూస్తుంటే ఈమె భవిష్యత్తులో ఒక సక్సెస్ ఫుల్ నిర్మాతగా మారే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి
Also Read : అది బాధాకరం.. విడాకులపై నిహారిక ఓపెన్ కామెంట్స్!