Niharika Konidela
Niharika Konidela: మెగా డాటర్ నిహారిక నటిగా, నిర్మాతగా బిజీ. కమిటీ కుర్రోళ్ళు మూవీతో హిట్ కొట్టింది. తక్కువ బడ్జెట్ తో నిర్మించిన కమిటీ కుర్రోళ్ళు హిట్ కావడంతో నిహారికకు లాభాలు దక్కాయి. హైదరాబాద్ లో ఆఫీస్ ఓపెన్ చేసిన నిహారిక కొత్త దర్శకులు, నటులతో కంటెంట్ ఉన్న చిత్రాలు చేసేందుకు ప్రయత్నాలు చేస్తుంది. స్మాల్ బడ్జెట్ చిత్రాలను మార్కెట్ చేయడం ఈజీ అని ఆమె భావన. మరోవైపు నటిగా కూడా రాణిస్తుంది.
నిహారిక తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలు ఆసక్తికర విషయాలు వెల్లడించింది. నిహారిక విడాకులపై కూడా ఓపెన్ అయ్యారు. ఏ అమ్మాయి విడాకులను దృష్టిలో పెట్టుకుని వివాహం చేసుకోదు. కానీ కొన్ని పరిస్థితులు అదుపు తప్పినప్పుడు కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తుంది. విడాకులు బాధాకర విషయం. మానసిక వేదన కలిగిస్తాయి.. అని అన్నారు. అనంతరం మెగా ఫ్యామిలీకి చెందిన ఇద్దరు హీరోలపై తన అభిప్రాయం తెలియజేసింది.
మెగా హీరోల్లో క్రేజీ ఎవరని అడగ్గా… అల్లు అర్జున్ అని సమాధానం చెప్పింది. ఆయన హైపర్ యాక్టివ్. వేరే లెవెల్ ఎనర్జీ కలిగి ఉంటాడు , అని అల్లు అర్జున్ ని ఉద్దేశించి నిహారిక అన్నారు. ఇక ఎవరిని ఈజీగా బుట్టలో పడేయవచ్చని అడగ్గా… వైష్ణవ్ తేజ్ పేరు చెప్పింది. వైష్ణవ్ ని ఈజీగా పడేయవచ్చు. ఏం చెప్పినా ఊరికే నమ్మేస్తాడు. వాడు నాకు టెడ్డి బేర్ లాంటోడు.. అని నిహారిక అన్నారు. వైష్ణవ్ తో తనకు ఎంత చనువు ఉందో నిహారిక కామెంట్స్ తెలియజేస్తున్నాయి. ఆ మధ్య వైష్ణవ్ ని నిహారిక రెండో వివాహం చేసుకోనుందని వార్తలు వచ్చాయి. ఈ పుకార్లను నిహారిక ఖండించింది.
నిహారిక 2020లో వెంకట నాగ చైతన్య అనే వ్యక్తిని వివాహం చేసుకుంది. ఆయనతో మనస్పర్థలు తలెత్తడంతో విడాకులు తీసుకుంది. ప్రస్తుతం తన దృష్టి పూర్తిగా కెరీర్ పై పెట్టింది. మెగా ఫ్యామిలీ నుండి హీరోయిన్ అయిన ఒకే ఒక అమ్మాయి నిహారిక. ఒక మనసు, హ్యాపీ వెడ్డింగ్, సూర్యకాంతం చిత్రాల్లో ఆమె నటించారు. సైరా నరసింహారెడ్డి లో గెస్ట్ రోల్ చేసింది.
Also Read: ఫైనల్ లో రోహిత్ పరిణతి… హాఫ్ సెంచరీతో జట్టుకు ఊపిరి