Homeఎంటర్టైన్మెంట్Niharika Konidela: అది బాధాకరం.. విడాకులపై నిహారిక ఓపెన్ కామెంట్స్!

Niharika Konidela: అది బాధాకరం.. విడాకులపై నిహారిక ఓపెన్ కామెంట్స్!

Niharika Konidela: మెగా ఫ్యామిలీ నుండి హీరోయిన్ అయిన ఏకైక అమ్మాయి నిహారిక కొణిదెల. ఆమె ఎంట్రీని మెగా అభిమానులు వ్యతిరేకించారు. అయినప్పటికీ నటి కావాలన్న తన కోరికను నిహారిక నెరవేర్చుకుంది. ఒక మనసు చిత్రంతో సిల్వర్ స్క్రీన్ కి పరిచయమైంది. అనంతరం హ్యాపీ వెడ్డింగ్, సూర్యకాంతం వంటి రొమాంటిక్ లవ్ ఎంటర్టైనర్స్ చేసింది. ఒకటి రెండు తమిళ చిత్రాల్లో సైతం నటించింది. చిరంజీవి నటించిన భారీ పీరియాడిక్ చిత్రం సైరా నరసింహారెడ్డిలో నిహారిక గెస్ట్ రోల్ చేయడం విశేషం.

Also Read: దేవర 2 ఉందా లేదా? ఇదిగో క్లారిటీ!

మరి భవిష్యత్ లో నిహారిక మరొక వివాహం చేసుకుంటారా? లేదా? అనేది చూడాలి. ప్రస్తుతం ఆమె కొత్త చిత్రాల నిర్మాణంలో బిజీగా ఉంది. నటిగా, నిర్మాతగా ఎదగాలని నిహారిక కోరుకుంటుంది. సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉండే నిహారిక అభిమానులతో అన్ని విషయాలు పంచుకుంటుంది.

హీరోయిన్ గా నిహారికకు బ్రేక్ రాలేదు. దాంతో పెద్దలు కుదిర్చిన పెళ్లి చేసుకుంది. ప్రభాకర్ అనే పోలీస్ అధికారి మెగా ఫ్యామిలీకి సన్నిహితుడని సమాచారం. ఆయన కుమారుడు వెంకట చైతన్య జొన్నలగడ్డతో 2020 డిసెంబర్ లో నిహారికకు వివాహమైంది. రాజస్థాన్ లోని ఉదయ్ పూర్ ప్యాలెస్ లో ఐదు రోజులు ఘనంగా నిహారిక-వెంకట చైతన్యల వివాహం నిర్వహించారు. ఈ వేడుకకు మెగా ఫ్యామిలీ అంతా హాజరయ్యారు.

దాదాపు రెండేళ్ల వైవాహిక జీవితం అనంతరం మనస్పర్థలు తలెత్తాయి. పరస్పర అంగీకారంతో విడాకులు తీసుకున్నారు. విడాకుల అనంతరం నిహారిక కెరీర్ పై దృష్టి పెట్టింది. నటన కొనసాగిస్తూనే చిత్రాలు నిర్మించాలని ఆమె భావిస్తున్నారు. హైదరాబాద్ లో ఆఫీస్ ఓపెన్ చేసి నిర్మాణం చేపట్టింది. నిహారిక నిర్మాతగా తెరకెక్కిన కమిటీ కుర్రోళ్ళు మంచి విజయం అందుకుంది. నిహారిక నిర్మాతగా సక్సెస్ కొట్టింది. మరోవైపు ఆమె కొన్ని చిత్రాల్లో నటిస్తుంది.

కాగా తాజా ఇంటర్వ్యూలో నిహారిక విడాకులపై స్పందించారు. ఆమె ఒకింత ఆవేదన వ్యక్తం చేశారు. సెలెబ్రిటీ, సామాన్యులు అనే తేడా ఉండదు. విడాకులు చాలా బాధించే విషయం. ఎవరో విడాకులు దృష్టిలో పెట్టుకుని పెళ్లి చేసుకోరు. విడిపోవాలని కోరుకోరు. కానీ పరిస్థితులు అదుపు తప్పుతాయి. కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది. సవాళ్ల నుండి మనం చాలా విషయాలు నేర్చుకునే అవకాశం ఉంటుంది.. అన్నారు. నిహారిక కామెంట్స్ ని గమనిస్తే.. విడాకులు ఆమెను మానసిక వేదనకు గురి చేశాయని తెలుస్తుంది. అలాగే తప్పని సరి పరిస్థితుల్లో విడాకుల నిర్ణయం తీసుకున్నారని అర్థం అవుతుంది.

 

Also Read: బిగ్ బాస్ యష్మి పెళ్లి , వరుడు ఎవరు?… వైరల్ గా వేడుకల ఫోటోలు!

Exit mobile version