Aditya 369
Aditya 369 : తెలుగు సినిమా ఇండస్ట్రీ లో సరికొత్త ప్రయోగం ‘ఆదిత్య 369′(Aditya 369). అప్పటి వరకు యాక్షన్, మాస్ సినిమాలు చేస్తూ వచ్చిన బాలయ్య(Nandamuri Balakrishna) నుండి ఇలాంటి సినిమాని అభిమానులు సైతం అసలు ఊహించలేదు. సింగీతం శ్రీనివాసరావు(Singeetam Srinivasa Rao) దర్శకత్వం లో తెరకెక్కిన ఈ సినిమా అప్పటికీ ఇప్పటికీ ఎప్పటికీ ఎవర్ గ్రీన్ చిత్రం అనడంలో ఎలాంటి సందేహం. ఆరోజుల్లో ఆయనకు టైం మెషిన్ కాన్సెప్ట్ మీద సినిమా చేయాలనే ఆలోచన ఎలా వచ్చిందో, ఆ ఆలోచనకే పెద్ద సెల్యూట్ చేయొచ్చు. ఎందుకంటే అప్పట్లో హాలీవుడ్ లో కూడా ఈ కాన్సెప్ట్ మీద సినిమాలు చాలా తక్కువగానే వచ్చాయి. ఆరోజుల్లో పెద్ద బడ్జెట్ తో కూడుకున్న పని కావడంతో ఎవ్వరూ ఇలాంటి ఆలోచనలతో సినిమాలు చేయడానికి సాహసించేవారు కాదు. ఈ చిత్రానికి నిర్మాత మరెవరో కాదు, మన గాన గంధర్వుడు SP బాలసుబ్రమణ్యం గారే. ఆయనతో పాటు అనిత కృష్ణన్, రామ కృష్ణన్ సహా నిర్మాతలుగా వ్యవహరించారు.
Also Read : ‘ఆదిత్య 369′ సీక్వెల్ కి ఆసక్తికరమైన టైటిల్ పెట్టిన బాలకృష్ణ..మోక్షజ్ఞ హీరో..బాలయ్య డైరెక్టర్..ముహూర్తం ఎప్పుడంటే!
ఆరోజుల్లో ఈ చిత్రాన్ని నిర్మించడానికి కోటి 30 లక్షల రూపాయిల ఖర్చు అయ్యింది. అప్పట్లో కోటి 30 లక్షలు అంటే ఇప్పుడు వంద కోట్ల రూపాయలతో సమానం. అలా భారీ బడ్జెట్ తో నిర్మించిన ఈ చిత్రానికి ఆరోజుల్లో 7 కోట్ల రూపాయలకు పైగా షేర్ వసూళ్లు వచ్చాయట. అంటే పెట్టిన బడ్జెట్ కి 7 రెట్లు లాభాలు అన్నమాట. అప్పట్లో పిల్లలు ఈ చిత్రాన్ని తెగ ఇష్టపడేవారు. చూసినవాళ్ళే మళ్ళీ మళ్ళీ థియేటర్స్ కి వెళ్లి చూసేవారు. ఫుట్ ఫాల్స్ లో కూడా ఈ చిత్రం ఆరోజుల్లో ఒక సంచలనం అనే చెప్పాలి. ఈ చిత్రంలో తరుణ్, రాశి వంటి వారు బాలనటులుగా నటించారు. ఇకపోతే ఈ చిత్రాన్ని వచ్చే నెల 11 వ తారీఖున గ్రాండ్ గా రీ రిలీజ్ చేయబోతున్నారు మేకర్స్.
సరికొత్త 4K టెక్నాలజీ కి మార్చి, 5.1 డాళ్బీ అట్మాస్ డీటీఎస్ సౌండ్ మిక్సింగ్ తో ఈ చిత్రాన్ని విడుదల చేయబోతున్నారు. ఈ సినిమాకు నేటి తరం యువత లో కూడా అద్భుతమైన క్రేజ్ ఉంది. టీవీ టెలికాస్ట్ ఎప్పుడు జరిగినా టీఆర్ఫీ రేటింగ్స్ బాగా వస్తుంటాయి. అలా యూత్ ఆడియన్స్ లో మంచి క్రేజ్ ని సొంతం చేసుకున్న ఈ సినిమాకు కచ్చితంగా మొదటి రిలీజ్ కంటే ఎక్కువ వసూళ్లు వస్తాయని అంటున్నారు ట్రేడ్ పండితులు. అంతే కాకుండా గ్రాండ్ గా ప్రీ రిలీజ్ ఈవెంట్ ని కూడా ఏర్పాటు చేయబోతున్నాడట బాలకృష్ణ. ఇకపోతే ఈ సినిమాకి సీక్వెల్ తీయాలి అనేది బాలయ్య కల. ఆ సీక్వెల్ కి బాలయ్య నే దర్శకత్వం వహిస్తాడట. ఇందులో ఆయన కుమారుడు మోక్షజ్ఞ తేజ హీరో గా నటించే అవకాశాలు ఉన్నాయి. ఈ చిత్రం ఎప్పుడు మొదలు అవుతుందో ఇప్పుడే చెప్పలేము కానీ, రాబోయే రెండు మూడు ఏళ్లలో మొదలయ్యే అవకాశాలు ఉన్నాయి.