https://oktelugu.com/

Niharika Konidela: నిహారిక అర్ధరాత్రి నుంచి అక్కడే ఉందట

Niharika Konidela: బంజారాహిల్స్‌లో నిన్న రాత్రి రాడిసన్ బ్లూ హోటల్‌ లో రేవ్ పార్టీ జరుగుతోందన్న పక్కా సమాచారం అందటం, టాస్క్‌ఫోర్స్ అధికారులు సడెన్ గా ఆ హోటల్‌ పై దాడులు నిర్వహించి సినీ ప్రముఖులను, బిగ్‌ బాస్ తెలుగు విజేత – ప్రముఖ సింగర్ రాహుల్ సిప్లిగంజ్, అలాగే కొందరు బడా బాబుల పిల్లలను అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఐతే, ఈ లిస్ట్ లో మెగా బ్రదర్ నాగబాబు కుమార్తె నిహారిక కూడా ఉండడం […]

Written By: , Updated On : April 3, 2022 / 03:25 PM IST
Follow us on

Niharika Konidela: బంజారాహిల్స్‌లో నిన్న రాత్రి రాడిసన్ బ్లూ హోటల్‌ లో రేవ్ పార్టీ జరుగుతోందన్న పక్కా సమాచారం అందటం, టాస్క్‌ఫోర్స్ అధికారులు సడెన్ గా ఆ హోటల్‌ పై దాడులు నిర్వహించి సినీ ప్రముఖులను, బిగ్‌ బాస్ తెలుగు విజేత – ప్రముఖ సింగర్ రాహుల్ సిప్లిగంజ్, అలాగే కొందరు బడా బాబుల పిల్లలను అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఐతే, ఈ లిస్ట్ లో మెగా బ్రదర్ నాగబాబు కుమార్తె నిహారిక కూడా ఉండడం సంచలనానికి దారి తీసింది.

Niharika Konidela

Niharika Konidela

పుడ్డింగ్ అండ్ మింగ్ పబ్ లో రాత్రి జరిగిన పార్టీలో నిహారిక కూడా పాల్గొంది అని తెలిసి ప్రస్తుతం మెగా ఫ్యాన్స్ షాక్ అవుతున్నారు. అయితే రాత్రే అందరితో పాటు నిహారికను కూడా పోలీస్ స్టేషన్ కు తరలించారు. అంటే.. రాత్రి నుంచి నిహారిక స్టేషన్ లోనే ఉంది. ఆ తర్వాత పేరెంట్స్ ని పిలిపించి, కౌన్సెలింగ్ ఇచ్చి కొందరిని విడుదల చేయడం జరిగింది.

Also Read: ICC Women’s World Cup Final: మ‌హిళ‌ల వ‌న్డే ప్ర‌పంచ‌క‌ప్ గెలిచిన ఆస్ట్రేలియా.. ఏడోసారి జ‌గజ్జేత‌..

ఈ క్రమంలో నిహారిక కూడా ఈ రోజు మధ్యాహ్నం పోలీస్ స్టేషన్ నుంచి ఇంటికి వెళ్ళిపోయింది. పట్టుబడిన వారిలో సినీ, రాజకీయ, పారిశ్రామికవేత్తల పిల్లలు ఉన్నారని.. వారిలో కొందరి వద్ద నుంచి కొకైన్ ను కూడా స్వాధీనం చేసుకున్నారని తెలుస్తోంది. ఇక తమను ఎందుకు అరెస్ట్ చేశారంటూ పలువురు పోలీసులతో వాగ్వాదానికి దిగారు.

నిహారిక కూడా అసహనంతో పోలీసుల పై సీరియస్ అయ్యిందట. మొత్తానికి నిహారిక ఇలా అడ్డంగా బుక్ అవ్వడంతో మెగా ఫ్యామిలీకే అవమానం. మెగాస్టార్ చిరంజీవి ఇన్ వాల్వ్ అయితేనే.. నిహారికను పోలీస్ స్టేషన్ నుంచి త్వరగా విడుదల చేశారని తెలుస్తోంది. ఏది ఏమైనా నిహారిక నుంచి ఇది మేము ఎక్స్ పెక్ట్ చేయలేదని మెగా ఫ్యాన్స్ సీరియస్ కామెంట్స్ పెడుతున్నారు.

Niharika Konidela

Niharika Konidela

అలాగే రేవ్దీ పార్టీని సమయానికి మించి పుడింగ్ మింక్ పబ్‌ నడుపుతున్నారు. దాంతో పబ్ యజమానులతో సహా 150 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ పబ్ ఒక మాజీ ఎంపీ కూతురుది అని తెలుస్తోంది. అన్నట్టు ప్రముఖ క్యారెక్టర్ ఆర్టిస్ట్ సురేఖావాణి కుమార్తె కూడా ఈ పార్టీలో ఉంది. భర్తను పోగొట్టుకున్న తర్వాత సురేఖా వాణి తన కుమార్తెతో కలిసి ఈ మధ్య సోషల్ మీడియాలో బాగా యాక్టివ్ గా ఉంటుంది.

Also Read:Young Hero Arrested Rave Party: రేవ్ పార్టీలో అరెస్ట్ అయిన యంగ్ హీరో..? క్లారిటీ ఇచ్చిన కుటుంబ స‌భ్యులు..

Tags