https://oktelugu.com/

ఆసక్తికరమైన బ్యాక్‌ డ్రాప్‌ తో మహేశ్‌ – రాజమౌళి మూవీ !

నేషనల్ స్టార్ డైరెక్టర్ ఎస్.ఎస్.రాజమౌళి తన తర్వాత సినిమాని సూపర్ స్టార్ మహేష్ బాబుతో చేయబోతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమా పై అనేక ఊహాగానాలు హల్ చల్ చేస్తూనే ఉన్నాయి. ఈ సినిమా పై ఆ మధ్యే జక్కన్న క్లారిటీ ఇచ్చినా ఇంకా సిల్లీ కథనాలు వైరల్ అవుతూనే ఉన్నాయి. ఇప్పుడు మరో రూమర్ ఒకటి బాగా వినిపిస్తోంది. అదేంటంటే.. ఓ డిఫరెంట్‌ లైన్‌ను బేస్‌ చేసుకుని రాజమౌళి, విజయేంద్ర ప్రసాద్‌ ఈ సినిమా […]

Written By:
  • admin
  • , Updated On : February 10, 2021 / 04:53 PM IST
    Follow us on


    నేషనల్ స్టార్ డైరెక్టర్ ఎస్.ఎస్.రాజమౌళి తన తర్వాత సినిమాని సూపర్ స్టార్ మహేష్ బాబుతో చేయబోతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమా పై అనేక ఊహాగానాలు హల్ చల్ చేస్తూనే ఉన్నాయి. ఈ సినిమా పై ఆ మధ్యే జక్కన్న క్లారిటీ ఇచ్చినా ఇంకా సిల్లీ కథనాలు వైరల్ అవుతూనే ఉన్నాయి. ఇప్పుడు మరో రూమర్ ఒకటి బాగా వినిపిస్తోంది. అదేంటంటే.. ఓ డిఫరెంట్‌ లైన్‌ను బేస్‌ చేసుకుని రాజమౌళి, విజయేంద్ర ప్రసాద్‌ ఈ సినిమా కథను రాశారని తెలుస్తోంది. ముఖ్యంగా సినిమా కథ నేపథ్యం మొత్తం ఆఫ్రికన్‌ ఫారెస్ట్‌లో జరుగుతుందట.

    Also Read: సెన్సిబుల్ డైరెక్టర్ కి సెన్స్ లేదు.. నిర్మాతలు ఫైర్ !

    అంటే, ఫారెస్ట్‌ లో జరిగే యాక్షన్‌ ఎడ్వెంచరెస్‌ మూవీగా ఈ సినిమాని రాజమౌళి తెరకెక్కిస్తారట. ఇక ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన రీసెర్చ్‌ వర్క్ ‌ను కూడా పూర్తి చేశారట. నిజానికి ఈ సినిమా ఛత్రపతి శివాజీ చరిత్ర ఆధారంగా రాబోతోందని, మహేష్ బాబు ఈ సినిమాలో ఛత్రపతి శివాజీగా నటిస్తున్నాడని వార్తలు వచ్చాయి. ఏది ఏమైనా ఈ సినిమా పై రూమర్స్ మాత్రం ఆగడం లేదు. ఇక ప్రసుతం మహేష్ పరుశురామ్ దర్శకత్వంలో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ ఏడాది సగానికి ఈ సినిమా పూర్తయిపోతుంది.

    Also Read: తారక్ సిస్టర్ ను ఎప్పుడైనా చూశారా..? ఈమె అని మీకు తెలుసా?

    ఆ తరువాత రాజమౌళి సినిమా కోసం మహేష్ బాబు డేట్స్ కేటాయిస్తాడట. ఒకటి అయితే మాత్రం క్లారిటీ ఉంది. మహేష్ సినిమాకి సంబంధించి రచయిత విజయేంద్ర ప్రసాద్ కథను కూడా పూర్తి చేసారు. మరి ఈ ప్రాజెక్ట్ ఎప్పుడు సెట్స్ పైకి వెళ్తుందో ఇంకా క్లారిటీ లేదు. ఎప్పటిలాగే రాజమౌళి ఈ సినిమాని కూడా మల్టీస్టారర్ గానే చేస్తున్నాడట. మహేష్ తో పాటు మరో స్టార్ హీరో కూడా ఈ సినిమాలో ఉంటే మాత్రం ఈ సినిమా పై కూడా నేషనల్ వైడ్ గా భారీ అంచనాలు ఉంటాయి.

    మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్