Homeఎంటర్టైన్మెంట్Nidhhi Agerwal as Panchami : 'పవన్' పంచమి లుక్ అదిరింది !

Nidhhi Agerwal as Panchami : ‘పవన్’ పంచమి లుక్ అదిరింది !

Nidhhi Agerwalడిజాస్టర్ హీరోయిన్ గా ముద్రపడిన బోల్డ్ భామ ‘నిధి అగర్వాల్'(Nidhhi Agerwal)కి కాలం కలిసి వచ్చింది. ప్రస్తుతం తన లుక్ తో సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయింది. ఈ భామ ప్రస్తుతం పవర్‌ స్టార్ పవన్‌ కళ్యాణ్(Pawan Kalyan) సరసన ‘హరిహర వీరమల్లు’లో హీరోయిన్ గా నటిస్తున్న సంగతి తెలిసిందే. అయితే, తాజాగా ఈ సినిమాలోని నిధి అగర్వాల్ ఫస్ట్‌ లుక్‌ ను రిలీజ్ చేసింది చిత్రబృందం.

‘పంచమి’ అనే పాత్రలో ఆమె ఈ సినిమాలో నటిస్తోంది. అయితే ఈ సందర్భంగా చిత్రబృందం పెట్టిన ఒక మెసేజ్ బాగా ఆకట్టుకుంది. ‘చందమామతో సమానమైన అందం ఉన్న మా అందాల పంచమికి పుట్టినరోజు శుభాకాంక్షలు’ అంటూ నిధి అగర్వాల్ కి మర్చిపోలేని పుట్టినరోజు బహుమతిని అందించింది ‘హరిహర వీరమల్లు’ టీమ్.

పోస్టర్ లో సంప్రదాయ లుక్ లో నిధి అగర్వాల్ నాట్యం చేస్తూ కనిపించింది. ఆమె ఈ సినిమాలో యువరాణి పాత్రలో కనిపించబోతుందని టాక్. నిజానికి నిధికి ఈ మధ్య తెలుగు సినిమాల్లో అవకాశాలు ఇవ్వడానికి మేకర్స్ ఆలోచిస్తున్నారు. కానీ, ఇప్పుడు ఈ పోస్టర్ తో ఆమెకు క్రేజ్ పెరగడం ఖాయం.

ఎలాగూ పవన్ కళ్యాణ్ సరసన హీరోయిన్ గా నటిస్తోంది కాబట్టి, మిగిలిన స్టార్ హీరోలు కూడా ఆమెను తమకు జోడీగా పెట్టుకోవడానికి అభ్యంతరం పెట్టకపోవచ్చు. అయినా, మరోపక్క నిధి కూడా బాలీవుడ్ వైపు చూస్తోంది. వాస్తవానికి నిధి అగర్వాల్ బాలీవుడ్ సినిమాతోనే హీరోయిన్ గా వెండితెర పైకి ఎంట్రీ ఇచ్చింది.

కాకపోతే, అక్కడ సక్సెస్ రాలేదు, దాంతో హిందీ తెరకు గ్యాప్ ఇచ్చి.. తెలుగు సినిమాల్లో సెకండ్ హీరోయిన్ గా రాణించడానికి చాలా కష్టపడింది. ఈ క్రమంలో ఎక్స్ పోజింగ్ విషయంలో కూడా నిధి తన పరిధి దాటింది. అయితే, ఆమె కష్టానికి దొరికిన అవకాశం ‘హరి హర వీరమల్లు.

మరి క్రియేటివ్ డైరెక్టర్ క్రిష్ దర్శకత్వంలో రాబోతున్న ఈ సినిమాతోనైనా నిధి అగర్వాల్ కెరీర్ ఫామ్ లోకి వస్తోందేమో చూడాలి. ఐతే, నిధి అగర్వాల్ జీవితంలో ఇదే పెద్ద సినిమా కావడం విశేషం.

admin
adminhttps://oktelugu.com/
Editor, He is Working from Past 3 Years in this Organization, He is the incharge of News content and Looks after the overall Content Management.
Exit mobile version