https://oktelugu.com/

మహేష్ బాబు ‘సర్కార్ వారి పాట’పై కొత్త అప్డేట్..

  సూపర్ స్టార్ మహేష్ బాబు తాజా చిత్రం ‘సర్కారువారిపాట’. సీనియర్ హీరో కృష్ణ జన్మదినం సందర్భంగా ప్రారంభమైన ‘సర్కారువారిపాట’ నేటికి రెగ్యూలర్ షూటింగ్ కు నోచుకోలేదు. దీంతో ఈ సినిమా మధ్యలోనే ఆగిపోతుందనే ప్రచారం జరిగింది. అయితే సినిమాకు సంబంధించి కొత్త అప్డేట్ తాజాగా రావడంతో మహేష ఫ్యాన్స్  ఖుషీ అవుతున్నారు. మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్ ఈ సినిమా కథ రీత్య ‘సర్కారువారిపాట’ షూటింగ్ అమెరికాలో చేయాల్సి ఉంది. ఈమేరకు దర్శకుడు […]

Written By:
  • NARESH
  • , Updated On : October 31, 2020 / 02:52 PM IST
    Follow us on

     

    సూపర్ స్టార్ మహేష్ బాబు తాజా చిత్రం ‘సర్కారువారిపాట’. సీనియర్ హీరో కృష్ణ జన్మదినం సందర్భంగా ప్రారంభమైన ‘సర్కారువారిపాట’ నేటికి రెగ్యూలర్ షూటింగ్ కు నోచుకోలేదు. దీంతో ఈ సినిమా మధ్యలోనే ఆగిపోతుందనే ప్రచారం జరిగింది. అయితే సినిమాకు సంబంధించి కొత్త అప్డేట్ తాజాగా రావడంతో మహేష ఫ్యాన్స్  ఖుషీ అవుతున్నారు.

    మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్

    ఈ సినిమా కథ రీత్య ‘సర్కారువారిపాట’ షూటింగ్ అమెరికాలో చేయాల్సి ఉంది. ఈమేరకు దర్శకుడు పర్శురాం ఈపాటికే అమెరికా వెళ్లి లోకేషన్లు ఫైనల్ చేశాడు. అమెరికా వెళ్లేందుకు చిత్రయూనిట్ ప్లాన్ చేయగా వీసాలో సమస్యలు తలెత్తడంతో రెండు నెలలు వాయిదా పడింది. దీంతో జనవరిలో ఈ సినిమా పట్టాలెక్కించేందుకు నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు.

    Also Read: రోజా ఫొటో షేర్ చేసి ట్విస్ట్ ఇచ్చిన బండ్ల గణేష్

    తాజాగా వీసాల సమస్య కూడా ఓ కొలిక్కి వచ్చిందని సమాచారం. దీంతో మహేష్ బాబు అందరికీ కంటే ముందుగానే ఫ్యామిలీతో కలిసి అమెరికా వెళ్లనున్నాడట. క్రిస్మస్.. న్యూ ఇయర్ సెలబ్రెషన్స్ అన్ని అక్కడే చేసుకోనున్నాడు. డిసెంబర్ 24న అమెరికా ఫ్లైట్ ఎక్కబోతున్నాడట. మిగతా చిత్రబృందం మాత్రం డిసెంబర్ 30న అమెరికా వెళుతుందని సమాచారం.

    Also Read: ఇస్మార్ట్ గా రామ్.. త్రివిక్రమ్ ను లైన్లో పెడుతాడా?

    జనవరి 4 నుంచి ‘సర్కారువారిపాట’ రెగ్యూలర్ షూటింగ్ ప్రారంభం కానుంది. ఈ మూవీలో మహేష్ కు జోడీగా కీర్తి సురేష్ నటిస్తోంది. ఈ సినిమాకు సంగీతాన్ని సమకూరుస్తున్న తమన్ ఇటీవలే మ్యూజిక్ సిట్టింగ్స్ మొదలైనట్లు ట్వీట్ చేశాడు.  అయితే ఈ మూవీలో విలన్ ఎవరనేది ఇంకా క్లారిటీ రాలేదు. అరవింద్ స్వామి, ఉపేంద్ర పేర్లు ప్రముఖంగా విన్పిస్తుంది. త్వరలోనే దీనిపై చిత్రబృందం అధికారిక ప్రకటన చేయనున్నట్లు తెలుస్తోంది.