ఏపీ ఇంటర్‌ విద్యార్థులు, తల్లిదండ్రులకు షాక్‌..!

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం తీసుకునే కొన్ని నిర్ణయాలు రాష్ట్ర ప్రజలను ఇబ్బంది పెడుతున్నాయి. ముఖ్యంగా ఇంటర్మీడియట్‌ విద్యావిధానంలో ప్రభుత్వం అవంభిస్తున్న తీరుపై విద్యార్థులు తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రంలో విద్యార్థులకు అనుగుణంగా ఇంటర్‌ కాలేజీలకు అనుమతులు ఇవ్వకపోవడంతో అందుబాటులో కళాశాలలు లేవు. దీంతో విద్యార్థులు ఇంటర్‌ విద్య కోసం రాష్ట్రాన్ని విడిచి ఇతర ప్రదేశాలకు వెళ్తున్నారు. మద్యం ధరల విషయంలోనూ ప్రభుత్వం నిక్కచ్చిగా ఉండడంతో రాష్ట్ర ఖజానాకు గండిపడుతోంది. మరిన్ని ఆంధ్ర రాజకీయ వార్తల కోసం ఏపీ […]

Written By: NARESH, Updated On : October 31, 2020 4:34 pm
Follow us on


ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం తీసుకునే కొన్ని నిర్ణయాలు రాష్ట్ర ప్రజలను ఇబ్బంది పెడుతున్నాయి. ముఖ్యంగా ఇంటర్మీడియట్‌ విద్యావిధానంలో ప్రభుత్వం అవంభిస్తున్న తీరుపై విద్యార్థులు తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రంలో విద్యార్థులకు అనుగుణంగా ఇంటర్‌ కాలేజీలకు అనుమతులు ఇవ్వకపోవడంతో అందుబాటులో కళాశాలలు లేవు. దీంతో విద్యార్థులు ఇంటర్‌ విద్య కోసం రాష్ట్రాన్ని విడిచి ఇతర ప్రదేశాలకు వెళ్తున్నారు. మద్యం ధరల విషయంలోనూ ప్రభుత్వం నిక్కచ్చిగా ఉండడంతో రాష్ట్ర ఖజానాకు గండిపడుతోంది.

మరిన్ని ఆంధ్ర రాజకీయ వార్తల కోసం ఏపీ పాలిటిక్స్

ఆంధ్రప్రదేశ్‌లో ప్రైవేట్‌ కళాశాలలను 60 శాతం మేర తగ్గించేశారు. కొన్నింటికి అనుమతులు ఇవ్వకపోవడంతో పాటు అవి వాణిజ్య భవనాల్లో కొనసాగుతున్నాయని అనుమతులు ఇవ్వడం లేదు.. దీంతో ఏడాది పాస్‌ అయిన టెన్త్‌ విద్యార్థులు అయోమయంలో పడ్డారు. కరోనా కారణంగా ప్రభుత్వం టెన్త్‌ పరీక్షలు నిర్వహించకుండానే అందరినీ పాస్‌ చేయించింది.

Also Read: ఏపీ రాజకీయం.. ‘ఫ్యాన్’ గాలికి సేదతీరుతున్న సీపీఎం..!

రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 6 లక్షల మంది ఇంటర్మీడియట్‌ చదవడానికి సిద్ధంగా ఉన్నారు. అయితే ప్రభుత్వ, ప్రైవేట్‌ కాలేజీల్లో కలిపి రెండు లక్షల సీట్ల వరకే అందుబాటులో ఉన్నాయి. దీంతో ఆన్‌లైన్‌లో తమకు నచ్చిన కాలేజీలో చేర్పిద్దామని ప్రయత్నిస్తున్న తల్లిదండ్రులకు షాక్‌ తగిలింది.

Also Read: రోజా ఫొటో షేర్ చేసి ట్విస్ట్ ఇచ్చిన బండ్ల గణేష్

మిగతా రాష్ట్రాలో ఇలాంటి నిబంధనలు లేకపోవడంతో విద్యార్థులకు అక్కడికి పయనమవుతున్నారు. బెంగుళూరు, చెన్నై, హైదరాబాద్‌ లాంటి ప్రాంతాల్లో కళాశాల విషయంలో పెద్దగా అడ్డు చెప్పకుండా అనుమతులు ఇచ్చేస్తున్నారు. కొందరు తమ పిల్లల చదువుల కోసం రాష్ట్రాన్ని విడిచి వెళ్తున్నారు. ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే ప్రభుత్వంపై వ్యతిరేకత ఏర్పడే ప్రమాదముందని కొందరు హెచ్చరిస్తున్నారు.