
దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణలో రైతు వేదికలను ఏర్పాటు చేశామని రాష్ట్ర ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు అన్నారు. శనివారం జనగామ జిల్లా కొడకండ్లలో రైతు వేదికను ప్రారంభించిన అనంతరం అక్కడి మార్కెట్ యార్డులో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. రైతు వేదికను ప్రారంభించడంతో కొడకండ్లలో మరో చరిత్రకు శ్రీకారం చుట్టామన్నారు. అమెరికా, యూరప్ దేశాల్లో కూడా రైతులు నిరసనలు వ్యక్తం చేస్తూనే ఉంటారన్నారు.