https://oktelugu.com/

పవన్ కల్యాణ్ సినిమాకు కొత్త సమస్య..!

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చాక వరుసగా నాలుగైదు సినిమాలను ప్రకటించేశాడు. వీటిలో వకీల్ సాబ్’ మాత్రమే పట్టాలెక్కింది. చివరిదశకు చేరిన ఈ మూవీ కరోనా కారణంగా వాయిదా పడగా ఇటీవలే తిరిగి ప్రారంభమైంది. ఈ మూవీని వీలైనంత త్వరగా పూర్తి చేయాలని పవన్ భావిస్తుండటంతో  ఈనెలఖారు వరకు గుమ్మడికాయ కొట్టడం ఖాయంగా కన్పిస్తోంది. మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్ ‘వకీల్ సాబ్’ తర్వాత పవన్ చేసే మూవీల లిస్టు […]

Written By: , Updated On : October 31, 2020 / 02:47 PM IST
Follow us on

Pawan Remuneration for Ayyappanum Koshiyum

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చాక వరుసగా నాలుగైదు సినిమాలను ప్రకటించేశాడు. వీటిలో వకీల్ సాబ్’ మాత్రమే పట్టాలెక్కింది. చివరిదశకు చేరిన ఈ మూవీ కరోనా కారణంగా వాయిదా పడగా ఇటీవలే తిరిగి ప్రారంభమైంది. ఈ మూవీని వీలైనంత త్వరగా పూర్తి చేయాలని పవన్ భావిస్తుండటంతో  ఈనెలఖారు వరకు గుమ్మడికాయ కొట్టడం ఖాయంగా కన్పిస్తోంది.

మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్

‘వకీల్ సాబ్’ తర్వాత పవన్ చేసే మూవీల లిస్టు పెద్దగానే ఉంది. డైరెక్టర్ క్రిష్ తో ఓ చారిత్రక మూవీ.. హరీష్ శంకర్ తో రోమాంటిక్ మూవీ.. సురేందర్ రెడ్డిలతో మాస్ ఎంటటైనర్ చేయనున్నాడు. అయితే అనుహ్యంగా ‘అయ్యప్పనుమ్ కోశియుమ్’ రీమేక్ తెరపైకి వచ్చింది. వకీల్ సాబ్ పూర్తయిన వెంటనే ‘అయ్యప్పనుమ్‍ కోశియుమ్‍’ పట్టాలెక్కనుందని సమాచారం.

Also Read: ఇస్మార్ట్ గా రామ్.. త్రివిక్రమ్ ను లైన్లో పెడుతాడా?

ఇద్దరు ఇగోస్టుల మధ్య నడిచే కథ ‘అయ్యప్పనుమ్‍ కోశియుమ్‍’.హీరోల పాత్రలే ఈ సినిమాకు హైలెట్ గా నిలువనుంది. పవన్ సినిమాలో మరో హీరోగా దగ్గుపాటి రానా.. యంగ్ హీరో నితిన్ పేర్లు తెరపైకి వచ్చాయి. అయితే వీరిద్దరిలో ఎవరు నటిస్తారనేది మాత్రం ఖరారు కాలేదు. అయితే తాజాగా ఈ మూవీలో హీరోయిన్ సమస్య వచ్చిపడినట్లు తెలుస్తోంది.

ఈ మూవీలో హీరోయిన్ కు పెద్దగా ప్రాధాన్యత లేదని తెలుస్తోంది. దీంతో ఈ మూవీ ఒరిజినల్ వర్షన్లో హీరోయిన్ల పాత్రలను క్యారెక్టర్ ఆర్టిస్టులతో కానిచ్చేశారు. అయితే పవన్ కల్యాణ్ సినిమాలో ఇలా చేస్తే సినిమాకు మైనస్ గా మారనుంది. పట్టుమని వారం రోజులు కూడా కాల్షీట్స్ అవసరం లేని హీరోయిన్ పాత్ర కోసం ఎవరు ముందుకొస్తారనేది నిర్మాతలకు సమస్యగా మారింది. ఈ మూవీలో సాయి పల్లవి పేరు తెరపైకి వచ్చిన ఆమె నటించే అవకాశాలు తక్కువే అని తెలుస్తోంది.

Also Read: రోజా ఫొటో షేర్ చేసి ట్విస్ట్ ఇచ్చిన బండ్ల గణేష్

‘వేదాళమ్’ రీమేక్ లో సాయిపల్లవికి చిరంజీవి చెల్లి క్యారెక్టర్ వస్తేనే చేయలేదని తెలుస్తోంది. దీంతో కీర్తి సురేష్ ఆ పాత్రలో నటించనుందని తెలుస్తోంది. అలాంటిది సాయి పల్లవి ఈ సినిమా నటిస్తుందా? అన్న అనుమానాలు కలుగుతున్నాయి. దీంతో ఈ సినిమాలో పవన్ కు జోడీగా ఎవరు నటిస్తారనేది ఆసక్తిని రేపుతోంది.