https://oktelugu.com/

ఇస్మార్ట్ గా రామ్.. త్రివిక్రమ్ ను లైన్లో పెడుతాడా?

‘ఇస్మార్ట్ శంకర్’ సినిమాతో హీరో రామ్ ఇండస్ట్రీ హిట్టు అందుకున్నాడు. ఈ మూవీ తర్వాత ఇస్మార్ట్ గా సినిమాలను సెట్ చేస్తూ ముందుకెళుతున్నాడు. ప్రస్తుతం రామ్ నటించిన ‘రెడ్’ మూవీ విడుదలకు సిద్ధంగా ఉంది. ‘ఇస్మార్ట్ శంకర్’ విజయంతో ‘రెడ్’ మూవీకి భారీ బిజినెస్ జరిగింది. సినిమాకు పెట్టిన డబ్బులు ఇప్పటికే నిర్మాతలకు రావడంతో మూవీని థియేటర్లలోనే విడుదల చేయాలని చిత్రబృందం భావిస్తోంది. మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్ ‘రెడ్’ త్వరలోనే ప్రేక్షకుల ముందుకు […]

Written By:
  • NARESH
  • , Updated On : October 31, 2020 / 01:40 PM IST
    Follow us on

    ‘ఇస్మార్ట్ శంకర్’ సినిమాతో హీరో రామ్ ఇండస్ట్రీ హిట్టు అందుకున్నాడు. ఈ మూవీ తర్వాత ఇస్మార్ట్ గా సినిమాలను సెట్ చేస్తూ ముందుకెళుతున్నాడు. ప్రస్తుతం రామ్ నటించిన ‘రెడ్’ మూవీ విడుదలకు సిద్ధంగా ఉంది. ‘ఇస్మార్ట్ శంకర్’ విజయంతో ‘రెడ్’ మూవీకి భారీ బిజినెస్ జరిగింది. సినిమాకు పెట్టిన డబ్బులు ఇప్పటికే నిర్మాతలకు రావడంతో మూవీని థియేటర్లలోనే విడుదల చేయాలని చిత్రబృందం భావిస్తోంది.

    మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్

    ‘రెడ్’ త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుండగా ‘ఇస్మార్ట్ శంకర్’ సీక్వెల్ త్వరలోనే పట్టాలెక్కనుంది. అయితే తాజాగా రామ్ దర్శకుడు త్రివిక్రమ్ తో ‘జులాయి’ తరహా మూవీని ప్లాన్ చేస్తున్నాడు. త్రివిక్రమ్-ఎన్టీఆర్ కాంబోలో త్వరలోనే ఓ మూవీ రాబోతున్నట్లు గతంలోనే ఒక ప్రకటన వచ్చింది. ఈ మూవీకి ‘అయినను హస్తినకు పోయిరావలే’ అనే టైటిల్ పరిశీలనలో ఉంది.

    Also Read: రోజా ఫొటో షేర్ చేసి ట్విస్ట్ ఇచ్చిన బండ్ల గణేష్

    ఎన్టీఆర్-త్రివిక్రమ్ కాంబో ఆలస్యం అవుతుండటంతో రామ్ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని భావిస్తున్నాడు. ‘జులాయి’.. ‘అఆ’ తరహా ఫ్యామిలీ సినిమా చేయాలని ఉందని రామ్ ఇప్పటికే త్రివిక్రమ్ దృష్టికి తీసుకెళ్లినట్లు సమాచారం. త్రివిక్రమ్ కు స్రవంతి రవి కిషోర్ తో ఉన్నఅనుబంధం కారణంగా రామ్ తో సినిమాలు చేసేందుకు వెనుకడటం లేదని తెలుస్తోంది. అయితే త్రివిక్రమ్ వరుసగా అగ్రహీరోల సినిమాలను చేయడంతో ఈ కాంబినేషన్ సెట్ కాలేదు.

    Also Read: ఆర్ఆర్ఆర్: ఎన్టీఆర్.. చరణ్ లకు అలియా ట్వీస్ట్ ఇవ్వనుందా?

    40 కోట్ల మినిమం బడ్జెట్ తో రామ్-త్రివిక్రమ్ సినిమా ఉండబోతుందని సమాచారం. ‘ఇస్మార్ట్ శంకర్’ విజయంతో మంచి జోష్ లో ఉన్న రామ్ కు త్రివిక్రమ్ మూవీ సెట్ అయితే మరింత మైలేజ్ రావడం ఖాయంగా టాక్ విన్పిస్తోంది. ‘ఆర్ఆర్ఆర్’ నుంచి ఎన్టీఆర్ బయటపడితే మాత్రం ఈ సినిమా అటకెక్కనుందట. అయితే రామ్ మాత్రం త్రివిక్రమ్ ను లైన్లో పెట్టేందుకు గట్టి ప్రయత్నాలు చేస్తున్నాడు. మరీ ఈ కాంబో సెట్ అవుతుందో? లేదో వేచిచూడాల్సిందే..!