Star producer challenges writer: తెలుగు సినిమా ఇండస్ట్రీలో చాలామంది దర్శకులు వాళ్ళకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకుంటూ ముందుకు దూసుకెళ్తున్నారు. ఇలాంటి క్రమంలోనే హీరోలు సైతం స్టార్లుగా వెలుగొందాలనే ప్రయత్నం చేస్తూ వాళ్ళని వాళ్ళు స్టార్లుగా ఎలివేట్ చేసుకుంటూ వస్తున్నారు…ఇక మెగాస్టార్ చిరంజీవి తనదైన రీతిలో సత్తా చాటుకుంటూ ముందుకు దూసుకెళ్తున్నాడు. మరి ఇలాంటి సందర్భంలోనే ఆయన ఒకప్పుడు చేసిన సినిమాలు అతనికి గొప్ప గుర్తింపును తీసుకొచ్చి పెట్టడమే కాకుండా మెగాస్టార్ గా తన పరిధిని సైతం విస్తరింపజేశాయి. ఇక ఇలాంటి క్రమంలోనే ఒకప్పుడు ఆయన చేసిన రాక్షసుడు (Rakshasudu) సినిమా మంచి విజయాన్ని సాధించింది. అయితే ఈ సినిమాలో ఒక సాంగ్ రాయడం కోసం వేటూరి సుందరామ్ముర్తి గారికి కే ఎస్ రామారావు గారు ఒక ఛాలెంజ్ అయితే ఇచ్చారట. అయితే సెట్లో కో డైరెక్టర్ అసిస్టెంట్ డైరెక్టర్ కి మధ్య ఏదో డిస్కషన్ లో ఇద్దరు లుచ్చా, బచ్చా అంటూ తిట్టుకుంటుంటే అది విన్న కే ఎస్ రామారావు గారు వేటూరి గారి దగ్గరికి వచ్చి మీరు రాయబోయే పాటను చ కారం మీద రాయండి అందులో ఎన్ని చ లు ఉంటే అన్ని వేలు ఇస్తానని చెప్పారట. అప్పట్లో ఒక సాంగ్ కి 1000 లేదా 2000 మాత్రమే ఇచ్చేవారు… కానీ వేటూరి అచ్చా అచ్చా బచ్చా బచ్చా అనే సాంగ్ ని రాసి చ కారాన్ని ఎక్కువగా వాడుతూ ఆ సాంగ్ ని హైలైట్ గా నిలిపారు. మొత్తానికైతే సాంగ్ సూపర్ సక్సెస్ అవ్వడమే కాకుండా అందులో దాదాపు 50 నుంచి 60 వరకు చ కారలను రాయడం తో కేఎస్ రామారావు అతనికి 60 వేల వరకు ఇచ్చాడు అంటూ నటుడు సత్యసాయి శ్రీనివాస్ రీసెంట్ గా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో తెలియజేయడం విశేషం…
ఇక ఇలాంటి చమత్కారాలు చాలానే జరిగాయని వేటూరి వాటన్నింటినీ సక్సెస్ ఫుల్ గా డీల్ చేస్తూ వచ్చాడని చెప్పడం విశేషం. కేవలం ఐదు నుంచి పది నిమిషాల్లోనే వేటూరి గారు ఆ సాంగ్ రాసారని చెప్పాడు. మరి ఏది ఏమైనా కూడా అప్పట్లో చాలా క్వాలిటీగా సాంగ్స్ అయితే వచ్చేవి లిరిక్ రైటర్లు సైతం చాలా మంచిగా లిరిక్స్ అందించేవారు.
Also Read: హీరో విజయ్ ని చూసి మన తెలుగు హీరోలు చాలా నేర్చుకోవాలి అంటూ దిల్ రాజు వివాదాస్పద వ్యాఖ్యలు!
కానీ ఇప్పుడు మాత్రం మ్యూజిక్ ఒకటే వినిపిస్తూ ఉంటుంది. పాట కూడా ఎక్కువగా వినిపించదు… ఏది ఏమైనా కూడా అప్పటి రైటర్లని స్ఫూర్తిగా తీసుకొని ఇప్పుడున్న లిరిక్ రైటర్లు మంచి పాటలను రాయాలని ప్రేక్షకులు సైతం కోరుకుంటున్నారు.
మంచి పాటలు రాసినప్పటికి మ్యూజిక్ డైరెక్టర్లు వాటి మీనింగ్ తెలియకుండా ఆ లిరిక్స్ ఏంటో బయటికి వినిపించకుండా డ్రమ్స్ తో మ్యూజిక్ ని కొట్టడం వల్ల వాటి భావమంతా చెడిపోతుంది. అలా కాకుండా లిరిక్స్ వినిపించేటట్టుగా మ్యూజిక్ చేస్తే బాగుంటుందంటూ కొంతమంది సినిమా మేధావులు సైతం ఇప్పుడున్న మ్యూజిక్ డైరెక్టర్లకు సలహాలు ఇస్తున్నారు…