ఏడుపులు తగలెయ్యా.. ట్రోల్స్ దెబ్బకు.. వామ్మో అంటున్న ‘బిగ్ బాస్’

నిన్న.. మొన్నటి వరకు టిక్ టాక్.. నెపోటిజం పేరుతో బాలీవుడ్ ఇండస్ట్రీని ఏకిపారేసిన ట్రోల్స్.. తాజాగా ‘బిగ్ బాస్’పై పడ్డారు. తెలుగు రియల్టీ షోలలో నెంబర్ వన్ గా ‘బిగ్ బాస్’ షో కొనసాగుతోంది. ఆ పరంపరంను కొనసాగించేందుకు బిగ్ బాస్ నిర్వాహకులు ‘బిగ్ బాస్-4’ కిందటి ఆదివారం నుంచి ప్రారంభించారు. ప్రారంభ ఎపిసోడ్ నుంచే ఈ షో  మిక్స్ డ్ టాక్ తెచ్చుకోగా విపరీతంగా ట్రోల్స్ బారినపడింది. Also Read: పూజా హెగ్డేతో ప్రభాస్ కూడా […]

Written By: NARESH, Updated On : September 10, 2020 10:08 am

Netizens troll to bigg boss-4

Follow us on


నిన్న.. మొన్నటి వరకు టిక్ టాక్.. నెపోటిజం పేరుతో బాలీవుడ్ ఇండస్ట్రీని ఏకిపారేసిన ట్రోల్స్.. తాజాగా ‘బిగ్ బాస్’పై పడ్డారు. తెలుగు రియల్టీ షోలలో నెంబర్ వన్ గా ‘బిగ్ బాస్’ షో కొనసాగుతోంది. ఆ పరంపరంను కొనసాగించేందుకు బిగ్ బాస్ నిర్వాహకులు ‘బిగ్ బాస్-4’ కిందటి ఆదివారం నుంచి ప్రారంభించారు. ప్రారంభ ఎపిసోడ్ నుంచే ఈ షో  మిక్స్ డ్ టాక్ తెచ్చుకోగా విపరీతంగా ట్రోల్స్ బారినపడింది.

Also Read: పూజా హెగ్డేతో ప్రభాస్ కూడా సిద్ధం.. !

ప్రస్తుతం సోషల్ మీడియాలో ఎక్కడ చూసిన ‘బిగ్ బాస్’పైనే చర్చ జరుగుతోంది. బిగ్ బాస్ కంటెస్టులు, హోస్టు, బిగ్ బాస్ నిర్వాహకులు ట్రోలర్స్ ఏమాత్రం విడిచిపెట్టకుండా ఏకిపారేస్తున్నారు. బిగ్ బాస్ ప్రారంభ ఎపిసోడ్లో నాగార్జున క‌నిపించిన వృద్ధ గెట‌ప్ ను నెటిజన్లు టార్గెట్ చేస్తూ కామెంట్లు పెడుతున్నారు. ఆయన పార్టిసిపెంట్స్ తో మ‌రీ వెట‌కారం ఆడుతున్నారంటూ మీమ్స్ తో ఆడేసుకుంటున్నారు.

ప్రస్తుత సీజన్లో చాలామంది అనామకులు ఉన్నారని.. పెద్దగా ఫాలోయింగ్ లేనివారిని బిగ్ బాస్ కంటెస్టెంటులుగా తీసుకొని తన స్థాయిని తానే తగ్గించుకుంటున్నాడని ట్రోల్స్ చేస్తున్నారు. ఈ సీజన్ కంటే పాత సీజన్లే నయమంటూ కామెంట్స్ చేస్తుండటం గమనార్హం. కంటెస్టులను చూసి వీళ్లా సెలెబ్రిటీలు అంటూ నోళ్లెల్ల‌బెట్టే మీమ్స్ ప్రస్తుతం నెట్టింట్లో వైర‌ల్ గా అవుతోన్నాయి. సీజన్ ముగిసే నాటికే వాళ్లే సెల‌బ్రిటీలు అవుతారంటూ పంచ్ లు పేలుతున్నాయి.

Also Read: శివసేన ప్రతీకారం: కంగన ముంబై ఆఫీస్ కూల్చివేత

టిక్ టాక్.. బాలీవుడ్ నెపోటిజం ట్రోల్స్ తర్వాత వారికి పెద్దగా పని లేకుండా పోయింది. ఈ సమయంలో బిగ్ బాస్ వచ్చి వారికి పెద్ద పని కల్పించారు. ఈ షోలో అనామకులను తీసుకొచ్చి సెలబ్రెటీల్లా చూపించడాన్నే ట్రోలర్స్ ఆయుధంగా చేసుకొని రెచ్చిపోతున్నారు. తమకు కలిసిచ్చిన అవకాశాన్ని ఈ అవకాశాన్ని ట్రోలర్స్ సద్వినియోగం చేసుకుంటున్నారు. బిగ్ బాస్ ను ట్రోల్స్ తో ఏకిపారిస్తే తమ ఫాలోయింగ్ ను మరింత పెంచుకుంటుండం విశేషం. ట్రోల్స్ దెబ్బకు ‘బిగ్ బాస్’ నిర్వాహకులు హడలిపోతున్నట్లు సమాచారం.