https://oktelugu.com/

పూజా హెగ్డేతో ప్రభాస్ కూడా సిద్ధం.. !

టాలీవుడ్ నుండి నేషనల్ రేంజ్ లో స్టార్ డమ్ సాధించిన ప్రభాస్ కూడా షూటింగ్ కి రెడీ అవుతున్నాడు. తన ‘రాధే శ్యామ్’ కోసం ఇప్పటికే రామోజీ ఫిల్మ్ సిటీలో 5 కోట్ల రూపాయిలు పెట్టి వేసిన ఓ భారీ హాస్పిటల్ సెట్ లో ప్రభాస్ షూట్ కి రెడీ అవుతున్నాడు. ఈ సెట్ లో రెండు వారాల పాటు షూట్ చేయనున్నారని.. అయితే సెట్ లో చాలా తక్కువ సిబ్బంది ఉండేలా షూట్ ప్లాన్ చేస్తున్నారని.. […]

Written By:
  • admin
  • , Updated On : September 9, 2020 / 03:05 PM IST
    Follow us on


    టాలీవుడ్ నుండి నేషనల్ రేంజ్ లో స్టార్ డమ్ సాధించిన ప్రభాస్ కూడా షూటింగ్ కి రెడీ అవుతున్నాడు. తన ‘రాధే శ్యామ్’ కోసం ఇప్పటికే రామోజీ ఫిల్మ్ సిటీలో 5 కోట్ల రూపాయిలు పెట్టి వేసిన ఓ భారీ హాస్పిటల్ సెట్ లో ప్రభాస్ షూట్ కి రెడీ అవుతున్నాడు. ఈ సెట్ లో రెండు వారాల పాటు షూట్ చేయనున్నారని.. అయితే సెట్ లో చాలా తక్కువ సిబ్బంది ఉండేలా షూట్ ప్లాన్ చేస్తున్నారని.. ముందుగా ప్రభాస్ పై వచ్చే యాక్షన్ సీక్వెన్స్ లోని బిల్డప్ షాట్స్ తీయనున్నారని తెలుస్తోంది. వచ్చే సోమవారం నుండి మొదలుకానున్న ఈ షెడ్యూల్ లో హీరోయిన్ పూజా హెగ్డేతో పాటు మిగిలిన నటీనటులు కూడా పాల్గొంటారట. అయితే పూజా హెగ్డేతో ప్రభాస్ సీన్స్ నే ఎక్కువ రోజులు షూట్ చేస్తారట. సినిమాలో క్లైమాక్స్ కి ముందు వచ్చే ఈ సీక్వెన్స్ చాలా కీలకమైనదట.

    Also Read: స్టార్ డైరెక్టర్ తో ఎట్టకేలకు ‘అక్కినేని’ హీరో సినిమా?

    కాగా ఈ సీక్వెన్స్ తరువాత దాదాపు పది రోజుల పాటు ఇతర ఆర్టిస్ట్ ల పై కొన్ని సీన్స్ షూట్ చేయనున్నారు. ఆ తరువాత మళ్లీ ప్రభాస్ – విలన్ పై కొన్ని కీలక యాక్షన్ సీన్స్ ను షూట్ చేస్తారట. ఈ సీన్స్ కూడా షూటింగ్ పూర్తి చేసుకుంటే.. ఇక సినిమా కూడా ఆల్ మోస్ట్ పూర్తయిపోతుందని తెలుస్తోంది. ఇక ఈ సినిమాలో ప్రభాస్ పాత్ర వెరీ ఎమోషనల్ గా ఉంటుందని, అలాగే క్లైమాక్స్ కూడా చాలా భావోద్వేగంతో సాగుతూ హెవీ ఎమోషనల్ గా ఉంటూనే.. ఫుల్ యాక్షన్ తో సాగుతోందని తెలుస్తోంది. ఇక ఈ సినిమాలో ప్రభాస్ వి రెండు క్యారెక్టర్స్.. అందులో ఒక క్యారెక్టర్ చనిపోతుందట. ఆ క్యారెక్టర్ ఎండింగ్ సీన్స్ నే పూర్తి ఎమోషనల్ గా ఉంటాయట. ఇప్పుడు ఆ సీన్స్ నే తీయబోతున్నారు. ఈ సినిమా పై ప్రభాస్ చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు.

    Also Read: కల తీరకుండానే జయప్రకాశ్‌ రెడ్డి కనుమూశారు

    ఎందుకంటే ఈ సినిమాకి మొదటినుండి పెద్దగా బజ్ రావట్లేదు. హిట్ అండ్ ఫేమ్ కూడా లేని రాధాకృష్ణ కుమార్ అనే ‘జిల్’ మూవీ డైరెక్టర్ డైరెక్షన్ లో ఈ సినిమా రాబోతుండటంతో సినిమా మార్కెట్ పై ఆ ఎఫెక్ట్ బాగానే పడింది. ఇక ఈ పీరియాడిక్‌ రొమాంటిక్ ఎంటర్టైనర్ నుండి వచ్చిన ఫస్ట్ లుక్ పోస్టర్ కూడా ఫ్యాన్స్ కి అంత బాగా కనెక్ట్ కాలేదు. మరి రాధాకృష్ణ ఈ సినిమాని ఎలా తీస్తాడో.. జనం ఎంతవరకు ఆదరిస్తారో చూడాలి. పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తోన్న ఈ సినిమాని నాలుగు భాషల్లో గోపికృష్ణ మూవీస్, యువీ క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.