‘చలో అంతర్వేది’ భగ్నం.. బీజేపీ, జనసేన నేతల నిర్బంధం

ఏపీలో హిందుత్వం మీద వరుసగా జరుగుతున్న దాడులపై బీజేపీ-జనసేన భగ్గుమన్నాయి. బుధవారం ‘చలో అంతర్వేది’ చేపట్టాయి.  అంతర్వేది ఆలయ రథం దగ్ధం కావడంపై  ఆందోళనకు శ్రీకారం చుట్టాయి.  బీజేపీ, జనసేనతోపాటు హిందుత్వ సంఘాలు కూడా అంతర్వేదికి చేరుకోవడంతో అక్కడ  ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. దీంతో   పోలీసులు రంగ ప్రవేశం చేశారు. అంతర్వేది ఇప్పుడు పలు హిందూ సంస్థల ఆందోళనతో అట్టుడుకుతోంది. Also Read: అంతర్వేది ఎపిసోడ్‌: వైసీపీ వ్యూహాత్మక చర్యలు ఇక అంతర్వేదిపై బీజేపీ, జనసేన […]

Written By: NARESH, Updated On : September 9, 2020 4:46 pm
Follow us on


ఏపీలో హిందుత్వం మీద వరుసగా జరుగుతున్న దాడులపై బీజేపీ-జనసేన భగ్గుమన్నాయి. బుధవారం ‘చలో అంతర్వేది’ చేపట్టాయి.  అంతర్వేది ఆలయ రథం దగ్ధం కావడంపై  ఆందోళనకు శ్రీకారం చుట్టాయి.  బీజేపీ, జనసేనతోపాటు హిందుత్వ సంఘాలు కూడా అంతర్వేదికి చేరుకోవడంతో అక్కడ  ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. దీంతో   పోలీసులు రంగ ప్రవేశం చేశారు. అంతర్వేది ఇప్పుడు పలు హిందూ సంస్థల ఆందోళనతో అట్టుడుకుతోంది.

Also Read: అంతర్వేది ఎపిసోడ్‌: వైసీపీ వ్యూహాత్మక చర్యలు

ఇక అంతర్వేదిపై బీజేపీ, జనసేన పోరుబాట పట్టడంతో ఏపీ సర్కార్ అలెర్ట్ అయ్యింది. భారీగా పోలీస్ బలగాలను మోహరించింది. అంతేకాదు.. వివాదాన్ని సమసిపోయేలా చేసేందుకు ఏపీ దేవాదాయశాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ తోపాటు మంత్రులు వేణు, పినిపె విశ్వరూప్ అంతర్వేది ఆలయం వద్దకు వచ్చారు. కానీ వారిని  చూసి మరింత రెచ్చిపోయిన ఆందోళనకారులు మంత్రులను నిలదీశారు. మంత్రి వెల్లంపల్లి కారుపై రాళ్లు రువ్వడంతో ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. దీంతో పోలీసులు వెంటనే మంత్రులను ఆలయం లోపలికి తీసుకెళ్లి పోలీసులు భద్రత కల్పించారు.

అంతర్వేది రథం దగ్గం నేపథ్యంలో బీజేపీ, జనసేనలు కలిసి  ఆందోళనకు పిలుపునిచ్చాయి. దీంతో పోలీసులు ముందస్తు చర్యలు చేపట్టారు. ఇప్పటికే పలువురు బీజేపీ నేతలను అదుపులోకి తీసుకున్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజుతోపాటు ఆయన అనుచరులను అదుపులోకి తీసుకున్నారు. ముందస్తు చర్యల్లో భాగంగా ఆయనను గృహ నిర్బంధం చేశారు. ఇక మాజీ ఎమ్మెల్యే, అమలాపురం నియోజకవర్గం అధ్యక్షుడు అయ్యాజీ సహా పలువురు బీజేపీ నేతలను హౌస్ అరెస్ట్ చేశారు.

ఈ అగ్నిప్రమాద ఘటనపై రాజకీయ కుట్ర కోణం కూడా దాగి ఉండొచ్చనేది ప్రస్తుతం సోషల్‌ మీడియాలో నడుస్తున్న టాక్‌. ఘటన జరిగిన రోజున పిచ్చివాడి చర్యగాను.. నిప్పుల కుంపటి అని.. విద్యుత్‌ షార్ట్‌ సర్క్యూట్‌ అని ప్రచారం చేసిన పోలీసు యంత్రాంగం.. చివరకు శోధించి శోధించి ‘తేనెతుట్ట’ కారణంగానే జరిగి ఉండవచ్చుననే అనుమానాలు వ్యక్తం చేశారు. దీంతో బీజేపీ, జనసేన మండిపడ్డాయి. కేసును నీరుగారుస్తున్నారని ఆందోళన బాటపట్టాయి.

Also Read: ఇంగ్లీష్ మీడియంపై జగన్‌ మార్క్‌ ఆలోచన..

రాజకీయ కుట్రకోణాల వైపు వెళ్లకుండానే ‘తేనెతుట్ట’తోనే కేసు విచారణ ముగించేస్తారా అంటూ బీజేపీ శ్రేణులు ప్రశ్నిస్తున్నాయి. ప్రభుత్వ అధికారిక మీడియాలో అంతర్వేది రథం దగ్ధం వెనుక ‘తేనె సేకరణకు ప్రయత్నించే ముఠా కారణం’ అని నిర్ధారించడంతో  రాజకీయంగా పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తం అయ్యాయి.అయితే..  ప్రతిపక్షాల విమర్శలను ఖాతరు చేయని ప్రభుత్వం కూడా దిద్దుబాటు చర్యలకు దిగింది. విమర్శల్ని పట్టించుకోకుండా ముందుకెళ్లడమే మంచిదని భావించింది. రథం దగ్ధం విషయంలో ఏ మాత్రం నిర్లక్ష్యం చేసినా మంచిది కాదన్న ఆలోచనలో ప్రభుత్వం ఉంది.  దీనిపై  కమిటీ వేసి విచారణ జరుపుతున్నారు.