RRR Janani Song: అత్యంత భారీ మల్టీస్టారర్ ‘ఆర్ఆర్ఆర్’ నుంచి మూడో పాటగా వచ్చిన జననీ సాంగ్ అద్భుతంగా ఆకట్టుకుంది. ఈ సాంగ్ లో ఎన్టీఆర్ – రామ్ చరణ్ లతో పాటు అజయ్ దేవగన్, అలియా, శ్రీయాలు కూడా బాగా హైలైట్ అయ్యారు. ముఖ్యంగా ఎన్టీఆర్ ఎక్స్ ప్రెషన్స్, ఎన్టీఆర్ తన కళ్ళల్లో చూపించిన ఎమోషన్స్ అద్భుతంగా పేలాయి. దాంతో సోషల్ మీడియాలో ఈ సాంగ్ పై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. మరి ఆ ప్రశంసల కామెంట్లు ఏమిటో చూద్దాం.
‘ఈ పాట వింటున్నప్పుడు జాతీయగీతం గుర్తుకొస్తుంది, భారతీయులందరూ గర్వించ తగ్గ విధంగా ఉంది ఈ పాట, ఈ పాటను మాకు అందించినందుకు ఎం ఎం కీరవాణి గారికి హృదయపూర్వక ధన్యవాదాలు. జై ఎన్టీఆర్, జై రామ్ చరణ్, జై రాజమౌళి’ అంటూ ఓ నెటిజన్ ఎమోషనల్ కామెంట్ చేయగా.. మరో నెటిజన్ ఈ కింది విధంగా పోస్ట్ చేశాడు.
‘కారే ప్రతి కన్నీటి చుక్కను, మరిగే ప్రతి రక్తపు బొట్టును తిలకంగా పెట్టి నా దేశాన్ని గొప్ప దేశంగా మలిచి, శత్రువుకు కూడా అన్నం పెట్టే గొప్ప సంస్కృతిని నా దేశ పౌరులకు బహుమతులుగా ఇచ్చిన భారత భూమాత బిడ్డలకు ఈ గొప్ప గీతం అంకితం జై జవాన్, జై కిసాన్, జై హింద్’ అంటూ మరో నెటిజన్ పోస్ట్ చేశాడు.
అలాగే ఇంకొకరు పోస్ట్ చేస్తూ.. ‘దేశాన్ని తన ప్రాణంతో రక్షించే సైనికులు…. మన కోసం అలుపెరుగని పోరాటం చేసిన యోధులు… శత్రువుల ధాటికి వెన్ను చూపని వీరులు… మా కోసం ప్రాణాలు అర్పించిన భరతమాత ముద్దుబిడ్డలు… ఏమిచ్చి తీర్చుకోగలం మీ రుణం…. మీ నుదుటిన వీర తిలకం దిద్దిన తల్లిదండ్రులకు యావత్ భారతం చేస్తుంది సలాం…. జైహింద్’ అంటూ అద్భుతమైన మెసేజ్ పోస్ట్ చేశాడు.
అలాగే సాంగ్ లో నటీనటుల నటన చూసి ఓ నెటిజన్ ఫీల్ తో ఒక పోస్ట్ పెట్టాడు. ‘రక్తంలో తడిసిన సీతారామరాజును చూస్తుంటే కంటి నుండి నీరు కారుతున్నాయి. ఆవేదనతో చూస్తున్న కొమరం భీం కళ్ళను చూస్తుంటే గుండె భారమై పోతుంది’ అని ఒక మెసేజ్ చేశాడు. ఏది ఏమైనా జననీ పాట ఎందరో హృదయాలను కదిలించింది. మరి పాట సాహిత్యం ఒకసారి చూద్దాం.
జననీ…
ప్రియ భారత జననీ
జననీ…
నీ పాద ధూళి తిలకంతో
ఫాలం ప్రకాశమవనీ
నీ నిష్కలంక చరితం
నా సుప్రభాతమవనీ
జననీ….
ఆ నీలి నీలి గగనం
శత విస్ఫులింగ మయమై
ఆ హవ మృదంగ ధ్వనులే
అరి నాశ గర్జనములై
ఆ నిస్వనాలు నా సేదతీర్చు
నీ లాలిజోలలవనీ….
జననీ…………..
చివరగా కీరవాణి గారి రచనకి కూర్చిన సంగీతానికి శతకోటి నమస్సులు.