Chiru- Cherry: మరోసారి ఓకే స్క్రీన్​పై చెర్రితో చిరు.. ఆ డైరెక్టర్​ సినిమాలోనే?

Chiru- Cherry: మెగా పవర్​స్టార్​ రామ్​చరణ్​ హీరోగా రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న సినిమా ఆర్​ఆర్​ఆర్​.. ఇటీవలే ఈ సినిమా షూటింగ్​ పూర్తి చేసుకున్న చెర్రీ.. తన తర్వాత సినిమాలపై దృష్టి పెట్టారు. ఈ సినిమాలో చెర్రి అల్లూరి సీతారామరాజుగా కనిపించనున్నారు. కాగా, ప్రస్తుతం దర్శకుడు శంకర్​తో కలిసి ఓ సినిమా చేస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా 1స్ట్ షెడ్యూల్​ పూర్తి చేసుకుని.. రెండో షెడ్యూల్​లో అడుగుపెట్టింది. భారీ బడ్జెట్​తో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు శంకర్​. మరోవైపు కేజీఎఫ్​ […]

Written By: Sekhar Katiki, Updated On : November 27, 2021 12:51 pm
Follow us on

Chiru- Cherry: మెగా పవర్​స్టార్​ రామ్​చరణ్​ హీరోగా రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న సినిమా ఆర్​ఆర్​ఆర్​.. ఇటీవలే ఈ సినిమా షూటింగ్​ పూర్తి చేసుకున్న చెర్రీ.. తన తర్వాత సినిమాలపై దృష్టి పెట్టారు. ఈ సినిమాలో చెర్రి అల్లూరి సీతారామరాజుగా కనిపించనున్నారు. కాగా, ప్రస్తుతం దర్శకుడు శంకర్​తో కలిసి ఓ సినిమా చేస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా 1స్ట్ షెడ్యూల్​ పూర్తి చేసుకుని.. రెండో షెడ్యూల్​లో అడుగుపెట్టింది. భారీ బడ్జెట్​తో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు శంకర్​.

Acharya Postponed

మరోవైపు కేజీఎఫ్​ దర్శకుడు ప్రశాంత్​నీల్​తో కలిసి ఓ సినిమా చేయనున్నట్లు ఇటీవలే టాక్​ వినిపించింది. అటీవలే చెర్రి, చిరంజీవితో కలిసి దిగిన ఫొటోను షేర్​ చేసి ఈ విషయంపై ప్రశాంత్ హింట్​ ఇచ్చినట్లు తెలుస్తోంది. దీంతో అభిమానులు సినిమా ఫిక్స్ అని అనుకుంటున్నారు. తాజాగా, ఈ సినిమా మల్టీస్టారర్​గా తెరకెక్కనన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

Also Read: ‘ఆర్ఆర్ఆర్’ జననీ కి శతకోటి నమస్సులు

ప్రశాంత్​నీల్​ దర్శకత్వం వహించనున్న ఈ సినిమాలో చరణ్​తో పాటు మెగాస్టార్​ కూడా నటించనున్నారట. గతంలో మగధీర, బ్రూస్​లీ చిత్రాల్లో గెస్ట్ అప్పియరెన్స్ ఇచ్చి అదరగొట్టారు మెగాస్టార్.. ఆ తర్వాత ఖైదీ నెం.150లో అమ్మడు లెట్స్​ డూ కుమ్ముడు పాటలో చరణ్​ చిరతో కలిసి స్టెప్పులేసి అదరగొట్టాడు.

ప్రస్తుతం వీరిద్దరు కలిసి ఆచార్య సినిమాలో కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈ క్రమంలోనే ప్రశాంత్​ నీల్​ దర్శకత్వంలో చరణ్​ తో పాటు మెగాస్టార్​ కూడా కీలక పాత్ర పోషించనున్​నట్లు తెలుస్తోంది. మరి ఇందులో నిజమెంతో తెలియాల్సి ఉంది. ప్రస్తుతం శంకర్​ దర్శకత్వంలో పనిచేస్తున్నారు చెర్రి. దిల్​రాజు నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ సినిమాలో కియారా అద్వాని హీరోయిన్​.

Also Read: ‘మావా.. సినిమాలో ఐటెం సాంగ్​ లేదా’.. ‘ఆర్​ఆర్​ఆర్​’ టీమ్ రిప్లై చూస్తే షాక్​?