Pushpa 2: పుష్ప 2 మీద కొనసాగుతున్న నెగిటివ్ ప్రచారం…కారణం ఏంటంటే..?

Pushpa 2: అల్లు అర్జున్ పవన్ కళ్యాణ్ ని కాదని నంద్యాల వైసిపి క్యాండేట్ అయిన శిల్ప రవిచంద్ర రెడ్డి కోసం ప్రచారాన్ని నిర్వహించడం పట్ల పవన్ కళ్యాణ్ అభిమానులతో పాటు ఆంధ్రప్రదేశ్ జనాలు కూడా చాలావరకు ఆయన మీద కోపంతో ఉన్నారు.

Written By: Gopi, Updated On : June 10, 2024 11:34 am

negative publicity on Pushpa 2 continues

Follow us on

Pushpa 2: సుకుమార్ డైరెక్షన్ లో అల్లు అర్జున్ హీరోగా వస్తున్న పుష్ప 2 సినిమా మీద ప్రస్తుతం ప్రేక్షకుల్లో విపరీతమైన అంచనాలైతే ఉన్నాయి. అయితే ఇంతకు ముందు పుష్ప ఎలాంటి మ్యాజిక్ అయితే క్రియేట్ చేసిందో ఈ సినిమా కూడా దానికి మించి భారీ వసూళ్లను కలెక్ట్ చేస్తూనే ఇండస్ట్రీలో వన్ ఆఫ్ ది టాప్ హిట్ గా మిగిలిపోతుంది అంటూ సినిమా యూనిట్ ఒక మంచి కాన్ఫిడెంట్ ను అయితే వ్యక్తం చేస్తున్నారు.

ఇక ఇదిలా ఉంటే అల్లు అర్జున్ పవన్ కళ్యాణ్ ని కాదని నంద్యాల వైసిపి క్యాండేట్ అయిన శిల్ప రవిచంద్ర రెడ్డి కోసం ప్రచారాన్ని నిర్వహించడం పట్ల పవన్ కళ్యాణ్ అభిమానులతో పాటు ఆంధ్రప్రదేశ్ జనాలు కూడా చాలావరకు ఆయన మీద కోపంతో ఉన్నారు. ఎందుకంటే వైసిపి వల్ల ఆంధ్రప్రదేశ్ లో చాలా ఘోరాలు జరగడమే కాకుండా అభివృద్ధి అనేది కూడా లోపించింది. అయినప్పటికీ తనకు ఏమాత్రం స్పృహ లేకుండా మళ్లీ వైసిపి క్యాండేట్ కు ఓటు వేయమని ఎలా ప్రచారాన్ని చేపట్టాడు.

Also Read: NTR: హీరోగా మరో ఎన్టీఆర్… నందమూరి వంశంలో ఎవరి కుమారుడో తెలుసా?

అని ఆంధ్ర ప్రదేశ్ జనాలు అతని మీద చాలా కోపంతో ఉన్నారు. ఇక మెగా అభిమానులు అయితే పవన్ కళ్యాణ్ జనసేన పార్టీని పెట్టి గెలుపు కోసం విపరీతంగా ప్రయత్నం చేస్తున్న సమయంలో ఇంట్లో ఉన్న వ్యక్తిని కాదని బయట వ్యక్తి కోసం ప్రచారాన్ని నిర్వహించడం అనేది చాలా తప్పు అంటూ వాళ్లు వాళ్ళ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇక దీంతో పుష్ప 2 సినిమా మీద వీళ్ళ ఇంపాక్ట్ అయితే భారీగా పడబోతుందని చాలా స్పష్టంగా తెలుస్తుంది. ఇక ఇప్పటికే పుష్ప 2 సినిమా మీద నెగిటివ్ అభిప్రాయమైతే ఏర్పడింది.

Also Read: HBD Balakrishna: యువరత్న నుంచి నట సింహం గా ఎదిగిన బాలయ్య ప్రస్థానం…

మరి ఈ సినిమా బాలీవుడ్ లో ప్రభంజనాన్ని సృష్టించిన కూడా తెలుగులో మాత్రం అంత పెద్దగా సక్సెస్ సాధించే విధంగా అయితే కనిపించట్లేదు. మరి మొత్తానికైతే ఈ సినిమాతో మరోసారి అల్లు అర్జున్ తన సత్తాను చాటుకుంటాడా లేదా ఆయన చేసిన పనికి తెలుగు ప్రేక్షకులు పుష్ప సినిమా మీద రివెంజ్ తీర్చుకుంటారా అనేది తెలియాల్సి ఉంది…