Director: ప్రేమలో పడే వయస్సు ఇదే అని ఒక వయసును నిర్ణయించలేం. వయసు అయిపోయిన వారు కూడా ప్రేమలో పడుతూ ఉంటారు. కాబట్టి.. ప్రేమకు వయసు లేదు అని బాల చందర్ లాంటి దిగ్గజ సినిమా దర్శకులు గుండె పగిలేలా సినిమాలు తీసి వదిలారు. దానికి తగ్గట్టుగానే ఎందరో ముదురు ప్రేమికులు తమ ప్రేమను ఎప్పటికప్పుడు చాటుకుంటూనే వస్తున్నారు.

ఎలాగూ రొటీన్ సినిమా డైలాగ్ ఉంది కదా. ‘ఈ ప్రేమ అనేది ఎప్పుడు ఎక్కడ పుడుతుందో ఎవరు మాత్రం చెప్పగలరు ?’ ఈ పాత డైలాగ్ ప్రతి ప్రేమ కథలో ఉంటుంది. అందుకే, ఇప్పుడు మరో ముదురు జంట ప్రేమలో పడింది. ఆయన తెలుగు సినిమా దర్శకుడు, ఆమె తెలుగు సినిమా క్యారెక్టర్ ఆర్టిస్ట్. ఇద్దరూ తెగ ప్రేమించుకుంటున్నారు.
ఎలాగూ ఇద్దరూ ఒంటరి వారు. అందుకే.. వాళ్ళ ప్రేమకు ఎలాంటి సమస్యలు కూడా లేవు. ఆ డైరెక్టర్ ఒంటరి, పెళ్లి చేసుకోలేదు. ఇక ఆమెకు గతంలో పెళ్లి అయింది. భర్త చనిపోయాడు. ఆమెకు ప్రస్తుతం ఒక కూతురు ఉంది. ఆమె కుమార్తె కూడా తన తల్లి పెళ్లికి ఇంట్రస్ట్ గా ఉందట. మరి ఆమె – అతను ఎప్పుడు పెళ్ళి చేసుకుంటారో చూడాలి.
Also Read: Pushpa: అయ్యో పుష్ప.. డబ్బింగ్ వెర్షన్ కి పెట్టిన డబ్బులు కూడా రానట్టేనా
ఏది ఏమైనా సినిమాల్లో అక్క అమ్మ పాత్రలతో మంచి పేరు తెచ్చుకుంది ఆమె. ఇక ఏజ్ పైబడిన ఇంకా పర్ఫెక్ట్ ఫిజిక్ ను మెయింటైన్ చేస్తోంది. ఆ ఒంటరి డైరెక్టర్ విషయానికి వస్తే.. ప్రస్తుతం ఫామ్ లో లేడు. కానీ, అతను ఖాతాలో మంచి సినిమాలు ఉన్నాయి. పైగా ఆ డైరెక్టర్ కి ఇంతవరకూ ఒక్కసారి కూడా పెళ్లి కాలేదు, పైగా ఆ దర్శకుడి క్యారెక్టర్ చాలా మంచిది.
మరి, ఆ దర్శకుడు, ఆ నటి పెళ్లితో ఎప్పుడు ఒకటవుతారో చూడాలి. వీరిద్దరి పెళ్లి జరిగితే.. భర్త లేని ఆమెకు భరోసా, అలాగే ఆ ఒంటరి డైరెక్టర్ కి ఓ తోడు దొరుకుతుంది… కాబట్టి ఈ పెళ్లి జరగాలని కోరుకుందాం.
Also Read: Samantha: సమంత పై నెగిటివ్ కామెంట్స్.. ఇక వీడియో విడుదలైతే పరిస్థితేమిటో ?