Vishwambhara Negative Comments: ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొని ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి వచ్చిన ప్రతి అవకాశాన్ని వాడుకుంటూ ఇండస్ట్రీలో హీరోగా నిలదొక్కుకున్న స్టార్ హీరో మెగాస్టార్ చిరంజీవి… గత 50 సంవత్సరాల నుంచి తెలుగు సినిమా ఇండస్ట్రీలో నెంబర్ వన్ హీరోగా కొనసాగుతున్నాడు. ఇప్పటికీ అతని ప్లేస్ ను రీప్లేస్ చేసే హీరోలు లేరని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు. చిరంజీవి లాంటి స్టార్ హీరో 70 సంవత్సరాల వయసులో కూడా ఇండస్ట్రీలో చాలా యాక్టివ్ గా ఉంటూ సినిమాలను చేస్తున్నాడు. తన అభిమానులను ఆనంద పరచడానికి ఆయన చాలా కసరత్తులను చేస్తూ సినిమాలను చేస్తుండటం విశేషం… ప్రస్తుతం అనిల్ రావిపూడి దర్శకత్వంలో చేస్తున్న ‘మన శంకర వరప్రసాద్’ సినిమాను 2026 సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నారు.
Also Read: మాస్ జాతర’ ఫస్ట్ రివ్యూ…సెకండాఫ్ ఏంటి అలా ఉంది..?
ఇక ఈ సినిమా పూర్తయిన వెంటనే ఆయన బాబు డైరెక్షన్ లో మరో సినిమా చేయడానికి సన్నాహాలు చేసుకుంటున్నాడు. వశిష్ట డైరెక్షన్లో చిరంజీవి హీరోగా చేస్తున్న విశ్వంభర సినిమాలో గ్రాఫిక్స్ ఎక్కువగా ఉంది. దానిని చాలా క్వాలిటీ గా ప్రజెంట్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. కాంప్రమైజ్ అవ్వకుండా విజువల్ గా దానిని చాలా బాగా చూపించే ప్రయత్నం చేస్తున్నారు.
ఇక అందులో భాగంగానే ఈ సినిమా లేటవుతోంది. ఇప్పుడు ఈ సినిమా మీద కొన్ని నెగెటివ్ కామెంట్లు వస్తున్నాయి. విశ్వంభర సినిమాలో పెద్దగా కథ ఏమీ లేదని కేవలం దానిని కార్టూన్ బొమ్మల్లాగా చిత్రీకరించారని గ్రాఫిక్స్ సినిమాకి పెద్దగా హైలైట్ అవ్వదని కొంతమంది కొన్ని కామెంట్లు చేస్తున్నారు. ఇక కామెంట్స్ చేసే వారు ఎవరు అంటే మొదటి నుంచి కూడా చిరంజీవికి యాంటీ ఫ్యాన్స్ ఎక్కువగానే ఉన్నారు.
అలా కామెంట్స్ చేసి చిరంజీవిని డామినేట్ చేయాలని చాలామంది చూస్తున్నప్పటికి ఎప్పటికప్పుడు చిరంజీవి తనను తాను ప్రూవ్ చేసుకుంటూ వస్తున్నాడు. ఇక ఇలాంటి క్రమంలోనే ఇప్పుడు కూడా విశ్వంభర సినిమాతో సూపర్ సక్సెస్ ని సాధిస్తారని అతని అభిమానులు అలాగే సినిమా యూనిట్ కూడా చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నారు. ఇక ఈ సినిమాను 2026 సమ్మర్ లో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది…