Mass jathara First Review: ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీ కొత్త పుంతలు తొక్కుతోంది. భారీ సినిమాలను చేస్తూ పాన్ ఇండియాలో గొప్ప విజయాలను సాధించడమే లక్ష్యంగా పెట్టుకొని బరిలోకి దిగుతున్నారు. ప్రస్తుతం మన హీరోలందరు క్వాలిటీ సినిమాలను చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు. రవితేజ లాంటి నటుడు సైతం క్వాలిటీ తో పాటు కమర్షియల్ ఎంటర్ టైనర్ ను ప్రేక్షకులకు అందించాలనే ప్రయత్నం చేస్తుండడం విశేషం…పర్ఫెక్ట్ కమర్షియల్ సినిమా వచ్చి చాలా సంవత్సరాలు అవుతోంది. ఇలాంటి సందర్భంలో రవితేజ మరోసారి ‘మాస్ జాతర’ సినిమాతో ప్రేక్షకులకు వినోదాన్ని అందించే ప్రయత్నం చేస్తున్నాడు. స్టార్ హీరోలందరు పాన్ ఇండియాలో గొప్ప విజయాలను సాధిస్తుంటే రవితేజ మాత్రం తెలుగు సినిమా ఇండస్ట్రీకే పరిమితమయ్యాడు. కారణం ఏదైనా కూడా ఆయన వరుస సినిమాలను చేస్తూ ముందుకు సాగుతూ ఉండడం విశేషం…ఇక భాను భోగావరపు దర్శకత్వంలో మాస్ జాతర సినిమాతో మరోసారి ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. రీసెంట్ గా ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ అయింది… ఇక ఈ సినిమా మొదటి రివ్యూ కూడా వచ్చేసింది. ఈ సినిమాలో రవితేజ ఒక సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ గా కనిపిస్తున్నాడు. ఇక ఇప్పటికే ఆయన చాలా సినిమాల్లో పోలీస్ ఆఫీసర్ గా నటించి మెప్పించాడు. ఈ సినిమాలో కూడా నటిస్తున్నాడు.
Also Read: ‘కాంతారా 2’ ఓటీటీ విడుదల తేదీ వచ్చేసింది..ఎందులో చూడాలంటే!
ఒక వ్యక్తి ఒక ఊరుని ఆసరాగా చేసుకొని ఇల్లీగల్ బిజినెస్ లు చేస్తున్నప్పుడు వాళ్ళను పట్టుకోడానికి వచ్చిన పోలీస్ ఆఫీసర్ ఏం చేశాడు. అక్కడ అతనికి ఎదురైన పరిస్థితులు ఏంటి? ఆ రౌడీలను ఎదుర్కోవడానికి ఆయన ఎలాంటి విపత్కర పరిస్థితులను ఎదుర్కోవాల్సి వచ్చింది అనే కథతో ఈ సినిమా తెరకెక్కింది…
రవితేజ సినిమా అంటే మాస్ కమర్షియల్ ఎలిమెంట్స్ పుష్కలంగా ఉంటాయి. భారీ డైలాగులతో పాటు యాక్షన్ ఎపిసోడ్స్ కూడా ఉంటాయి. ఇక ఈ సినిమాలో ఫస్టాఫ్ ను కామెడీ సన్నివేశాలతో నడిపించినప్పటికి సెకండాఫ్ లో మాత్రం రవితేజ తన ఫుల్ స్టామినాను చూపిస్తూ ప్రేక్షకులకు ఎంటర్ టైన్ మెంట్ అందించినట్టుగా తెలుస్తోంది. సెకండాఫ్ లో కొన్ని ఎలివేషన్ సన్నివేశాలను తెరకెక్కించినట్టుగా తెలుస్తోంది. సెకండాఫ్ లో కొన్ని ఎలివేషన్ సీన్స్ అద్భుతంగా ఉన్నాయి. క్లైమాక్స్ కూడా అందరిని సాటిస్ఫై చేసే విధంగా ఉంటుందట.
ఇక రవితేజ నుంచి కమర్షియల్ సినిమా వచ్చింది అంటే అది మినిమం గ్యారంటీ సినిమాగా ఉంటుంది అనే విషయం గతంలో ఆయన చాలా సందర్భాల్లో ప్రూవ్ చేశాడు…ఇక శ్రీ లీల యాక్టింగ్ కూడా బావుంది. అలానే ఆమె క్యారెక్టర్ ఈ సినిమాకి ప్లస్ అవుతోంది. రవితేజ ఎనర్జీ సినిమాని నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్తుంది… ఇక ఓవరాల్ గా ఈ సినిమా సగటు ప్రేక్షకుడినైతే మెప్పిస్తుందట…