Mantha Cyclone Effect: ఏపీవ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. మొంథా తుఫాను ప్రభావంతో సోమవారం ఉదయం నుంచి వర్షాలు ప్రారంభమయ్యాయి. అయితే కాకినాడ వద్ద తీరం దాటనున్న నేపథ్యంలో సోషల్ మీడియాలో అనేక రకాలుగా ప్రచారం నడిచింది. అయితే కాకినాడలో సోమవారం ఉదయం ఎండ కాయడంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. అయితే మధ్యాహ్నం నుంచి చిరుజల్లులు ప్రారంభం అయ్యాయి. కానీ ఉత్తర ఆంధ్ర ప్రాంతంలో ఎడతెరిపి లేకుండా వానలు పడుతూనే ఉన్నాయి. విశాఖ రూరల్ లో అత్యధికంగా 94 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయింది. మూడు రోజులపాటు ఉత్తరకొస్తాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడతాయని ఇప్పటికే వాతావరణ శాఖ హెచ్చరించింది. అందుకు తగ్గట్టుగానే పరిస్థితి ఉంది.
Also Read: ప్రమాదపుటంచున ఏపీ.. దూసుకొస్తున్న ‘మొంథా’!
* కోస్తాలో అత్యంత భారీ వర్షాలు..
ప్రధానంగా కోస్తా జిల్లాలకు మంగళవారం భారీ వర్ష సూచన ఉంది. ప్రధానంగా శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, విజయనగరం, విశాఖపట్నం,అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి, కాకినాడ, తూర్పుగోదావరి, డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ, పశ్చిమగోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్,గుంటూరు, పల్నాడు, ప్రకాశం, బాపట్ల జిల్లాల్లో భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉంది.
* బుధవారం నాడు శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, విజయనగరం, పశ్చిమగోదావరి, ఏలూరు, ఎన్టీఆర్, కృష్ణ, గుంటూరు జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు పడతాయి. విశాఖపట్నం, అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి, కాకినాడ,డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ, తూర్పుగోదావరి, పల్నాడు, బాపట్ల, ప్రకాశం జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు.. నెల్లూరు, వైయస్సార్ కడప, కర్నూలు,నంద్యాల, జిల్లాలో భారీ వర్షాలు కురుస్తాయి.
* గురువారం శ్రీకాకుళం,మన్యం, విజయనగరం జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.