Mass Jathara Vs Baahubali The Epic: రవితేజ హీరోగా నటించిన చాలా సినిమాలు అతనికి గొప్ప గుర్తింపును తీసుకొచ్చాయి. మొదట్లో చిన్నచితకా పాత్రలను చేసుకుంటూ కాలాన్ని గడిపిన ఆయన ఆ తర్వాత పూరి జగన్నాథ్ తో చేసిన వరుస సినిమాలు సూపర్ సక్సెస్ లను సాధించాయి. దాంతో స్టార్ హీరోగా అవతరించాడు… ప్రస్తుతం భాను భోగవరపు అనే దర్శకుడిని పరిచయం చేస్తూ ఆయన చేస్తున్న మాస్ జాతర సినిమా ఈ నెల 31వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇక అదే రోజు ‘బాహుబలి ది ఎపిక్’ సినిమా కూడా ప్రేక్షకుల ముందుకైతే వస్తోంది.ఈ రెండు సినిమాల్లో ప్రస్తుతం బాహుబలి ది ఎపిక్ సినిమాను చూడడానికే ఎక్కువ మంది ఆసక్తి చూపిస్తున్నారు. మరి ఇలాంటి సందర్భంలో మాస్ జాతర సినిమాకి బాహుబలి నుంచి తీవ్రమైన పోటీ ఎదురుకానుంది.
Also Read: మాస్ జాతర’ ఫస్ట్ రివ్యూ…సెకండాఫ్ ఏంటి అలా ఉంది..?
ఈ పోటీలో తను ఎలా తట్టుకోని నిలబడతాడు అనేది తెలియాల్సి ఉంది. ఇక ఈ మధ్యకాలంలో ఆయన నుంచి వచ్చిన ప్రతి సినిమా ఫ్లాప్ అవుతోంది. కారణమేదైనా కూడా ఆయన ఒక మంచి సినిమా చేస్తే చూడాలని యావత్ తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్న ప్రేక్షకులంతా ఆసక్తి ఎదురుచూస్తున్నారు…
కానీ ఆయన మాత్రం వరుస సినిమాలు చేస్తున్నప్పటికి అవేవి ఆశించిన మేరకు విజయాన్ని సాధించడం లేదు. త్రినాధరావు నక్కిన దర్శకత్వంలో చేసిన ‘ధమాకా’ సినిమా మంచి విజయాన్ని సాధించింది. ఇక ఆ సినిమా తర్వాత వరుసగా ఐదారు సినిమాలు చేసినప్పటికి అవేవి అతని మార్కెట్ ను పెంచలేకపోయాయి. ఇక ఇప్పుడు ‘మాస్ జాతర’ సినిమా పరిస్థితి ఏంటి అనేది చర్చనీయాంశంగా మారింది.
ప్రస్తుతం రవితేజ అభిమానులు సైతం ఈ మూవీ సూపర్ హిట్ సాధిస్తే చూడాలనుకుంటున్నారు. ఇక రవితేజ ఇందులో పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్ లో నటిస్తున్నాడు. ఇక పోలీస్ ఆఫీసర్ గా చేసిన ప్రతి సినిమా కూడా మంచి విజయాన్ని సాధించిందనే ఒక నమ్మకంతో ప్రతి ఒక్కరు ఈ సినిమా మీద చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నారు. చూడాలి మరి ఈ సినిమాతో ఎలాంటి ఐడెంటిటి క్రియేట్ అవ్వబోతుంది అనేది…