Pushpa collections: ‘పుష్ప’ గట్టెక్కాలంటే ఇంకెంత రావాలి?

Pushpa collections: అల్లు అర్జున్ నటించిన ‘పుష్ప’ మూవీ భారీ అంచనాల మధ్య థియేటర్లలో విడుదలైంది. డిసెంబరు 17న రిలీజైన ఈ మూవీ తొలివారం గట్టిగానే కలెక్షన్లను రాబట్టింది. మొదటి రోజే ఈ సినిమా డివైడ్ టాక్ తెచ్చుకుంది. అయినప్పటికీ తొలివారం ప్రపంచ వ్యాప్తంగా 110కోట్లను షేర్ ను ఈ మూవీ రాబట్టడం విశేషం. అయితే ఈ మూవీకి బ్రేక్ ఈవెంట్ రావాలంటే మరిన్ని రోజులు పట్టే అవకాశం కన్పిస్తోంది. సుకుమార్-అల్లు అర్జున్ కాంబోకు అభిమానుల్లో మంచి […]

Written By: NARESH, Updated On : December 25, 2021 10:28 am
Follow us on

Pushpa collections: అల్లు అర్జున్ నటించిన ‘పుష్ప’ మూవీ భారీ అంచనాల మధ్య థియేటర్లలో విడుదలైంది. డిసెంబరు 17న రిలీజైన ఈ మూవీ తొలివారం గట్టిగానే కలెక్షన్లను రాబట్టింది. మొదటి రోజే ఈ సినిమా డివైడ్ టాక్ తెచ్చుకుంది. అయినప్పటికీ తొలివారం ప్రపంచ వ్యాప్తంగా 110కోట్లను షేర్ ను ఈ మూవీ రాబట్టడం విశేషం. అయితే ఈ మూవీకి బ్రేక్ ఈవెంట్ రావాలంటే మరిన్ని రోజులు పట్టే అవకాశం కన్పిస్తోంది.

Allu Arjun Pushpa Movie in Andhra

సుకుమార్-అల్లు అర్జున్ కాంబోకు అభిమానుల్లో మంచి టాక్ ఉండటంతో రిలీజుకు ముందే ఈ సినిమా భారీ ధరకు అమ్ముడుపోయింది. అల్లు అర్జున్ అన్ని తానై ఈ మూవీ కోసం తెలుగు, హిందీ, కన్నడ, మళయాళ ఇండస్ట్రీల్లో భారీగా ప్రమోషన్స్ చేశాడు. దీంతో ఈ మూవీ థియేటికల్ హక్కులు సుమారు రూ.150కోట్లకు అమ్ముడుపోయిందని తెలుస్తోంది.

‘పుష్ప’ మూవీ శుక్రవారం విడుదలకాగా తొలిరోజు అభిమానులు థియేటర్లకు హోరెత్తడంతో వసూళ్లు బాగానే వచ్చాయి. ఆ వెంటనే  వీకెండ్స్ కలిసిరావడం ‘పుష్ప’కు బాగా కలిసి వచ్చింది. తొలి మూడురోజుల్లోనే ‘పుష్ప’ భారీగా వసూళ్లను రాబట్టి తగ్గెదెలే అన్నట్లు కన్పించింది. ఇక అన్నివర్షన్లో కలిసి తొలి వారం ఈమూవీ 110కోట్ల షేర్ ను రాబట్టగా ఇందులో మేజర్ వాటా మాత్రం తెలుగుదే.

ప్రస్తుతం రెండోవారంలోకి ‘పుష్ప’ ఎంట్రీ ఇచ్చింది. ఈనేపథ్యంతో తొలివారం కలెక్షన్లను పరిశిలించినట్లయితే.. తెలుగు రాష్ట్రాల్లో ‘పుష్ప’ ఏకం రూ.67కోట్లను రాబట్టింది. ఇందులో ఒక్క నైజాం నుంచి రూ.32కోట్ల మేర వసూళ్లు రాగా మరో నాలుగు కోట్లు రాబడితే ఇక్కడ బ్రేక్ ఈవెంట్ మార్క్ ను అందుకోనుంది. నైజాంలో ఈ మూవీ కి బ్రేక్ ఈవెంట్ దక్కడం పెద్ద కష్టమేమీ కాదు. మరో రెండుమూడ్రోజుల్లో ఈ ఫీట్ ను క్రాస్ చేసే అవకాశం కన్పిస్తుంది.

సీడడ్లో 18కోట్ల బిజినెస్ కాగా ఇప్పటిదాకా 11కోట్లు వచ్చింది. ఇక్కడ అతికష్టంగా ‘పుష్ప’ బ్రేక్ ఈవెంట్ దక్కించుకునే అవకాశాలు కన్పిస్తున్నాయి. ఆంధ్రాలో ఈమూవీ 48కోట్ల మేర బిజినెస్ చేయగా ఇప్పటివరకు రూ.24కోట్లలోపే వచ్చాయి. దీంతో ఆంధ్రాలో ‘పుష్ప’కు భారీ నష్టాలు వచ్చే అవకాశాలు కన్పిస్తున్నాయి.

తమిళంలో రూ. 6కోట్లు, మలయాళంలో రూ.4కోట్ల మేర షేర్ రాబట్టి ‘పుష్ప’ ఇప్పటికే బ్రేక్ ఈవెంట్ సాధించేసింది. హిందీలో 14కోట్ల బిజినెస్ చేసిన పుష్ప 17కోట్ల షేర్ ను రాబట్టి లాభాల్లోకి వెళ్లింది. ఓవర్సీస్ లో 13కోట్లకు అమ్ముడుపోగా 2మిలియిన్ మార్క్ ను దాటేసింది. ఓవరాల్ గా తొలి వారం ‘పుష్ప’ 110కోట్ల షేర్ ను రాబట్టగా గ్రాస్ కలెక్షన్లు రూ.200కోట్ల మార్క్ దగ్గరలో ఉన్నాయి.

ఈ మూవీ బ్రేక్ ఈవెంట్ సాధించాంటే ఇంకా 40కోట్లను రాబట్టాల్సి ఉంది. ఈ మూవీకి డివైడ్ టాక్ రావడంతో రెండోవారంలో కలెక్షన్లు భారీగా రావడం కష్టంగా మారింది. ఆంధ్రాలో టికెట్ల రేట్ల తగ్గింపు కూడా ఈ మూవీ కలెక్షన్లపై ప్రభావం చూపిందనే టాక్ విన్పిస్తోంది. మొత్తంగా కిందోమీదో పడి ఈ మూవీ బ్రేక్ ఈవెంట్ పాయింట్ సాధించే అవకాశాలు ఎక్కువగానే కన్పిస్తున్నాయి.