Varun Tej: ఆంధ్రప్రదేశ్ లో త్వరలో ఎన్నికలు జరగబోతున్నాయి. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో పలు ఆసక్తికర విషయాలు తెరపైకి వస్తున్నాయి. ఈ నేపథ్యంలో మెగా డాటర్ నిహారిక కొణిదెల పొలిటికల్ ఎంట్రీ ఇవ్వనుందని కథనాలు వెలువడుతున్నాయి. ఆమె 2024 అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయనుందని ప్రచారం జరుగుతుంది. జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి గా మెగా బ్రదర్ నాగబాబు ఉన్నారు.కాపు సామాజిక వర్గం ఓటర్లు అధికంగా ఉన్న తిరుపతి నుంచి ఆమె బరిలో దిగనుంది అంటూ న్యూస్ వైరల్ అవుతుంది.
నిహారిక పొలిటికల్ ఎంట్రీ పై వరుణ్ తేజ్ స్పందించారు. ఆయన ఈ వార్తల్లో నిజం లేదని క్లారిటీ ఇచ్చారు. వరుణ్ తేజ్ లేటెస్ట్ మూవీ ఆపరేషన్ వాలెంటైన్ విడుదలకు సిద్ధం అవుతుంది. ఈ చిత్ర ప్రమోషన్స్ లో భాగంగా వరుణ్ గురువారం రాజమండ్రి లో పర్యటించారు. నిహారిక పొలిటికల్ ఎంట్రీ పై వస్తున్న కథనాల్లో వాస్తవం లేదని వెల్లడించారు. ఇదంతా కేవలం ప్రచారం మాత్రమే ఇది ఫేక్ న్యూస్ అని కొట్టిపారేశాడు.
పైగా తమ కుటుంబంలో ఏదైనా పెద్దలదే నిర్ణయం అని చెప్పాడు. పెద్ద నాన్న, నాన్న, బాబాయ్ ఏం చెప్తే అది పాటిస్తాం .. అవసరమైతే వచ్చే ఎన్నికల్లో ప్రచారం చేయమంటే చేస్తాం. ఈ విషయంలో పెద్ద వాళ్ళు ఎలా చెబితే అలా నడుచుకుంటాం అని మెగా ప్రిన్స్ వరుణ్ వెల్లడించాడు. దీంతో మెగా ఫ్యాన్స్ నిరుత్సాహం చెందుతున్నారు. నిహారిక ప్రస్తుతం భర్తతో విడిపోయి సింగిల్ గా ఉంటుంది. 2020లో చైతన్య జొన్నలగడ్డ ను వివాహమాడింది. పరస్పర అవగాహనతో విడిపోయారు. విడాకులు అధికారికంగా ప్రకటించారు.
నిహారిక సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసింది. నటిగా మరలా బిజీ అవుతుంది. నిహారిక మోడ్రన్ కారన్ అనే చిత్రంలో నటిస్తుంది. ఇటీవల ఈ మూవీ షూటింగ్ పూజ కార్యక్రమాలు కూడా జరిగాయి. అలాగే నిర్మాతగా రాణించాలి అనుకుంటుంది. ఆమె చాలా కాలంగా పింక్ ఎలిఫెంట్ ఎంటర్టైన్మెంట్స్ పేరుతో ఒక బ్యానర్ నడుపుతుంది. ఈ బ్యానర్ పై బడ్జెట్ చిత్రాలు, సిరీస్లు చేయాలని ప్లాన్స్ వేస్తున్నారు.
Web Title: Nebulous political entry varun tej gave clarity
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com