spot_img
Homeఎంటర్టైన్మెంట్NBK 109 Glimpse: NBK 109 గ్లింప్స్ రివ్యూ: నాది యుద్ధం కాదు...

NBK 109 Glimpse: NBK 109 గ్లింప్స్ రివ్యూ: నాది యుద్ధం కాదు వేట, సింహంలా విజృంభించిన బాలకృష్ణ

NBK 109 Glimpse: బాలకృష్ణ తన 109వ చిత్రం బాబీ కొల్లి దర్శకత్వంలో చేస్తున్నాడు. NBK 109 వర్కింగ్ టైటిల్ గా ఉంది. నేను మహా శివరాత్రిని పురస్కరించుకుని ఫస్ట్ గ్లింప్స్ విడుదల చేశారు. ఒకటిన్నర నిమిషాల నిడివి కలిగిన ప్రోమో గూస్ బంప్స్ లేపింది. ఫస్ట్ ఇంప్రెషన్ ఈజ్ బెస్ట్ ఇంప్రెషన్ అన్నట్లు… అంచనాలు పెంచేసింది. బాలయ్యను పరిచయం చేసిన తీరు, ఆయన డైలాగ్, యాక్షన్ మూమెంట్స్ ఫ్యాన్స్ మైండ్ బ్లాక్ చేస్తాయి. మంటలు చెలరేగుతున్న అడవిలో బాలయ్య శత్రువులను వెతుక్కుంటూ వచ్చాడు.

వాళ్ళ అంతు చూశాడు. ఈ సినిమా ప్రకటన నాటి నుండి ఓ వింటేజ్ బాక్స్ చూపిస్తున్నారు. అందులో ఆయుధాలతో పాటు బాలయ్య బ్రాండ్ గా పేరుగాంచిన మ్యాన్షన్ హౌస్ బాటిల్ ఉంది. కారులో ఆ బాక్స్ తో వచ్చిన బాలయ్య ఓపెన్ చేసి మద్యం తాగాడు. గొడ్డళ్లు తీసుకుని వారి మీదకు విజృంభించాడు. ఓ పవర్ ఫుల్ డైలాగ్ కూడా ఈ ప్రోమోలో ఉంది. ‘ఏంట్రా వార్ డిక్లేర్ చేస్తున్నావా’ అని విలన్ అంటాడు.

‘సింహం నక్కల మీదకు వస్తే దాన్ని వార్ అనరురా లఫుట్…. ఇట్స్ కాల్డ్ హంటింగ్’ అని బాలయ్య గంభీర స్వరంతో చెప్పాడు. అలాగే బాలకృష్ణ లుక్ చాలా బాగుంది. ఆయన యంగ్ గా కనిపిస్తున్నారు. మొత్తంగా దర్శకుడు బాబీ గట్టిగానే ప్లాన్ చేస్తున్నాడని తెలుస్తుంది. ఈ ఫస్ట్ గ్లింప్స్ లో చెప్పుకోవాల్సిన మరొక అంశం థమన్ మ్యూజిక్. బాలయ్య అంటే ఆయనకు పూనకాలు వస్తాయేమో కానీ మరోసారి చంపేశాడు.

NBK 109 చిత్రాన్ని సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నారు. బాలయ్యకు మరో హిట్ ఖాయమని అర్థం అవుతుంది. కాగా బాలకృష్ణ అఖండ మూవీతో ఫుల్ ఫార్మ్ లోకి వచ్చాడు. ఆయన గత మూడు చిత్రాలు అఖండ, వీరసింహారెడ్డి, భగవంత్ కేసరి హిట్ టాక్ తెచ్చుకున్న విషయం తెలిసిందే. ఇక బాబీ గత చిత్రం వాల్తేరు వీరయ్య బ్లాక్ బస్టర్. చిరంజీవి హీరోగా నటించిన ఆ చిత్రం రెండు వందల కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది.

 

RELATED ARTICLES

Most Popular