Rupert Murdoch Marriage: డబ్బుంటే చాలు ఏదైనా చేయొచ్చు. కొండమీది కోతి నైనా తీసుకురావచ్చు. మొన్నటి అంబానీ ఇంట జరిగిన వేడుక అదే కదా నిరూపించింది. అంతటి భారీ కాయుడు మామూలు కుటుంబాల్లో ఉంటే అమ్మాయిలు పెళ్లి చేసుకుంటారా? కనీసం పెళ్లిచూపులకైనా వస్తారా? అనంత్, రాధిక విషయం మర్చిపోకముందే.. మీడియా టైకూన్ రూపర్ట్ మర్డోక్ మరో సంచలనానికి నాంది పలికారు.. ప్రస్తుతం ఇది అటు మీడియా, ఇటు సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది.
92 సంవత్సరాల వయసులో
వెస్ట్రన్ మీడియాలో రూపర్ట్ మర్డోక్ అంటే తెలియని వారు ఉండరు.. మీడియా వ్యాపారంలో ఆయన చేయని ప్రయోగమంటూ లేదు. అందువల్లే ఆయన పట్టిందల్లా బంగారమైంది. రూపర్ట్ మర్డోక్ పేరు కాస్తా మీడియా టైకూన్ గా మారిపోయింది. అలాంటి అతడు ఇప్పటివరకు నాలుగు పెళ్లిళ్లు చేసుకున్నాడు. పూర్వపు పెళ్లిళ్ల ద్వారా అతడికి సంతానం ఉన్నారు. అయినప్పటికీ వెస్ట్రన్ కంట్రీస్ లో పెళ్లిళ్లు, విడాకులు సర్వసాధారణం. పైగా అక్కడివారు దానిని ఒక స్టేటస్ సింబల్ లాగా భావిస్తారు. ఇక ప్రస్తుతం రూపర్ట్ మర్డోక్ వయసు 92 సంవత్సరాలు. ఈ వయసులో ఆయన మరోసారి పెళ్లికొడుకయ్యాడు.. ఇప్పటికే నాలుగుసార్లు పెళ్లిళ్లు చేసుకున్న ఆయన.. అయితే పెళ్లికి కూడా రెడీ అయిపోయాడు.
వధువు ఎవరంటే..
92 సంవత్సరాల రూపర్ట్ మర్డోక్ కు 67 ఏళ్ల ఎలెనా జుకోవా అనే స్నేహితురాలు ఉంది. కొంతకాలం నుంచి వీరిద్దరూ డేటింగ్ లో ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి. వాటిని నిజం చేసేలాగా తాము త్వరలో పెళ్లి చేసుకోబోతున్నామని ప్రకటించారు. ఈ వివరాలను ప్రఖ్యాత న్యూయార్క్ టైమ్స్ వెల్లడించింది. గత ఏడాది వీరిద్దరికి డెంటల్ హైజీ నిస్ట్ ఆన్ లెస్లీ స్మిత్ తో రూపర్ట్ మర్డోక్ కు నిశ్చితార్థం జరిగింది. వివాహానికి నెల సమయం ఉందనగానే అతడు నిశ్చితార్ధాన్ని రద్దు చేసుకున్నాడు. ప్రస్తుతం తన స్నేహితురాలయిన ఎలెనా జుకోవా ను వివాహం చేసుకున్నాడు. ఎలెనా జుకోవా కు గతంలోని వివాహమైనప్పటికీ ఆమె విడాకులు తీసుకున్నారు. ఆమె రష్యా దేశస్థురాలయినప్పటికీ అమెరికాకు వలస వచ్చారు. ప్రస్తుతం అక్కడే ఆమె నివాసం ఉంటున్నారు. అయితే ఆమె కుటుంబం గురించి న్యూయార్క్ టైమ్స్ ఎటువంటి విషయాలూ వెల్లడించలేదు.