https://oktelugu.com/

ప్రియుడితో నయనతార ఫోటో..  మళ్లీ వైరల్ !

లేడీ సూపర్ స్టార్ గా సౌత్ ఇండస్ట్రీలో వెలిగిపోతున్న నయనతార  ఏమి చేసినా గొప్పగానే ఉంటుంది. ప్రియుడి బంధువులను కలవడానికి కూడా చార్టర్డ్ ఫ్లైట్ బుక్ చేసుకుని మరీ కొచ్చికి  మరో హీరోయిన్ వెళ్లగలుగుతుందా.. ఒక్క నయనతార తప్ప.  తన ప్రియుడు విఘ్నేష్ శివన్ తో కలిసి నిన్న సాయంత్రం కొచ్చిలో అడుగుపెట్టింది. అది కూడా  విఘ్నేష్ శివన్ కుటుంబ సభ్యులతో, స్నేహితులతో కలిసి  ఓనమ్ జరుపుకోవటానికి చెన్నై నుండి చార్టర్డ్ ఫ్లైట్ బుక్ చేసుకుని మరీ  నయనతార కొచ్చికి వచ్చింది. Also Read : […]

Written By: , Updated On : August 31, 2020 / 09:42 AM IST
Follow us on

nayanthara relationship with vignesh shivan

లేడీ సూపర్ స్టార్ గా సౌత్ ఇండస్ట్రీలో వెలిగిపోతున్న నయనతార  ఏమి చేసినా గొప్పగానే ఉంటుంది. ప్రియుడి బంధువులను కలవడానికి కూడా చార్టర్డ్ ఫ్లైట్ బుక్ చేసుకుని మరీ కొచ్చికి  మరో హీరోయిన్ వెళ్లగలుగుతుందా.. ఒక్క నయనతార తప్ప.  తన ప్రియుడు విఘ్నేష్ శివన్ తో కలిసి నిన్న సాయంత్రం కొచ్చిలో అడుగుపెట్టింది. అది కూడా  విఘ్నేష్ శివన్ కుటుంబ సభ్యులతో, స్నేహితులతో కలిసి  ఓనమ్ జరుపుకోవటానికి చెన్నై నుండి చార్టర్డ్ ఫ్లైట్ బుక్ చేసుకుని మరీ  నయనతార కొచ్చికి వచ్చింది.
Also Read : క్రేజీ హీరో నిర్మాణంలో రేస్ క్లబ్ సిరీస్ !
 
సోషల్ మీడియాలో ప్రస్తుతం ఈ ఫోటోలు వైరల్ అవుతున్నాయి. కాకపోతే ఫోటోలో నయనతార ఇంగ్లీష్ సినిమలోని హీరోయిన్ లా  వెరీ స్టైలిష్ లుక్ లో కనిపిస్తుంటే.. పక్కన విఘ్నేష్ శివన్ మాత్రం  నయనతార జర్కిన్ ను, బ్యాగ్ ను మోస్తూ ఆమె అసిస్టెంట్ లా కనిపిస్తున్నాడు.  ఈ ఫోటో చూసి నయనతార స్టార్ డమ్ కి ప్రియుడు అయినా తగ్గి ఉండాల్సిందే అని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.
 
ఏమైనా నయనతార వ్యక్తిగత జీవితంలోని  ప్రేమ కథల గురించి ఇప్పటికే ప్రేక్షకులతో పాటు సినిమా వాళ్ళు కూడా కథలుకథలుగా చెప్పుకుంటూ ఉంటారు. ఇప్పటికే విఘ్నేష్ శివన్ తో నయనతార పెళ్లి అయిపోయిందనే పుకార్ల పరంపర ఇంకా కొనసాగుతూనే ఉంది. దానికి తగ్గట్లు  నయనతార కూడా గత నాలుగైదు ఏళ్ల నుండి విఘ్నేష్ శివన్ ప్రేమలో మునిగితేలుతూ ఉంది. కానీ,  అతనితో పెళ్లిపీటలు మాత్రం వెక్కడం లేదు.
 
కాకపోతే ఈ రోజు కొచ్చికి వచినట్లు ఎప్పటికపుడూ అతనితో చెట్టాపట్టాలేసుకుని తిరుగుతూ జనానికి కనిపించడం, చివరకు ఇలా సోషల్ మీడియాలో వైరల్ అవ్వడం.. నయనతారకు ఆనవాయితీగా వస్తోంది. అసలు పెళ్లి చేసుకోకుండా ఎన్నాళ్ళు ప్రియుడితో  ప్రేమాయణం నడిపిస్తుందో గానీ, నయనతార ఫ్యాన్స్ మాత్రం  తరుచూ హాలీడే ట్రిప్పులకు, పార్టీలకు వెళ్తూ  మీడియా కంట పడొద్దు అని పోస్ట్ లు పెడుతున్నారు. 
Also Read : త‌న‌యుడి సినిమాలో హీరోగా స్టార్ హీరో !