టీడిపి కి ఆ ప్రాంతం నేతలంతా గుడ్ బై..? అదే జరిగితే బాబు వెన్ను విరిగినట్టే..!

ఇప్పటి వరకు తమకు గడ్డు పరిస్థితుల్లో కూడా చేదోడువాదోడుగా ఉన్న తెలుగుదేశం పార్టీకి అతి త్వరలో సూపర్ షాక్ తగలబోతోందట. ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ విషయాన్ని అడ్డంపెట్టుకుని కొందరు టిడిపి నేతలు పార్టీలోకి చేరేందుకు రంగం సిద్ధం చేసుకోవడమే ఇక్కడ షాకింగ్ న్యూస్. వైయస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం విశాఖను రాజధానిగా చేయాలనుకుంటున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ అంశం కోర్టు పరిధిలో ఉండగా.. వారు మాత్రం ‘స్టేటస్ కో’ ను వారాల తరబడి పెంచుకుంటూపోతున్నారు. ఇక ఇప్పట్లో […]

Written By: Navya, Updated On : August 31, 2020 11:44 am
Follow us on

ఇప్పటి వరకు తమకు గడ్డు పరిస్థితుల్లో కూడా చేదోడువాదోడుగా ఉన్న తెలుగుదేశం పార్టీకి అతి త్వరలో సూపర్ షాక్ తగలబోతోందట. ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ విషయాన్ని అడ్డంపెట్టుకుని కొందరు టిడిపి నేతలు పార్టీలోకి చేరేందుకు రంగం సిద్ధం చేసుకోవడమే ఇక్కడ షాకింగ్ న్యూస్. వైయస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం విశాఖను రాజధానిగా చేయాలనుకుంటున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ అంశం కోర్టు పరిధిలో ఉండగా.. వారు మాత్రం ‘స్టేటస్ కో’ ను వారాల తరబడి పెంచుకుంటూపోతున్నారు. ఇక ఇప్పట్లో అయితే విశాఖను ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ చేసే అవకాశమే లేదు.

ఇక వైసీపీ ప్రధాన ఆరోపణ ఏమిటంటే విశాఖ పరిపాలనా రాజాధాని కాకుండా టీడీపీ కుట్రపన్నుతోంది అని. ఈ ఆరోపణల నేపథ్యంలో ఉత్తరాంధ్రాలో టిడిపి నేతలు ఒకింత ఇబ్బందిగా కదులుతున్నారు. దాంతో ఈ గడ్డు పరిస్థితి నుండి తప్పించుకునేందుకు చాలామంది నేతలు తమదైన దారులు వెతుక్కుంటున్నారు. కొందరైతే వైసిపి పంచన చేరగా మరికొందరు బిజెపి వైపు చూస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఏపి బిజెపి అధ్యక్షుడు సోము వీర్రాజు ఈ మధ్య వరుసబెట్టి టిడిపి నేతలపై విమర్శలు గుప్పిస్తున్నారు. అతని సామర్థ్యానికి ముగ్ధులయ్యరో ఏమో తెలియదు కానీ బీజేపీలో మకాం వేసేందుకు టీడీపీ నేతలు ఆలోచిస్తున్నట్లు సమాచారం.

ఢిల్లీ స్థాయిలో బీజేపీ నేతలు శ్రీకాకుళం ఎంపీ కింజరాపు రామ్మోహన్ నాయుడు కి గాలం వేస్తున్నట్లు తెలుస్తోంది. రామ్మోహన్ నాయుడు గనుక సానుకూలంగా స్పందిస్తే అదే వరుసలో అచ్చెన్నాయుడు కూడా బిజెపి వైపు వెళ్ళచ్చు. ఇక ఈఎస్ఐ విషయమై బెయిల్ కోసం అచ్చెన్నాయుడు పడిన కష్టాలు అన్నీఇన్నీ కావు. మరోపక్క టీడీపీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవాని కూడా బిజెపిలోకి వెళ్తారనే ప్రచారం ఎప్పటినుండో జరుగుతూనే ఉంది. ఇక సోము వీర్రాజు మాత్రం బీజేపీలోకి రావాలంటే టీడీపీ భావజాలాన్ని వదిలించుకోవాలి అని బహిరంగంగానే ప్రకటించేశాడు.

అచ్చెన్నాయుడు కూడా ఇప్పుడిప్పుడే బీజేపీ వైపు అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. తనను అరెస్టు చేస్తే టిడిపి వారు బయట నానా రచ్చ చేశారే తప్ప వచ్చి అతనిని జైలు నుండి బయటకు రప్పించేందుకు ప్రయత్నాలు పెద్దగా చేయలేదు అని చెప్పాలి. ఇక ఇలాంటి సమయంలో అచ్చెన్నాయుడు విషయంలో ఛాన్స్ తీసుకోకూడదని భావిస్తోన్న టీడీపీ అధినేత చంద్రబాబు, లోకేష్‌ని అచ్చెన్న వద్దకు పంపి, ‘పార్టీ మారడం’పై వాకబు చేయాలని ఆదేశించారట. ఏది ఏమైనా ఇప్పుడున్న పరిస్థితుల్లో టిడిపిని నమ్ముకోవడం చాలా కష్టమనే భావన తెలుగు తమ్ముళ్లలో ఉంది కాబట్టి రానున్న రోజుల్లో రాష్ట్రంలో పెను మార్పులు చోటుచేసుకోబోతున్నట్లే.