https://oktelugu.com/

Nayanthara- Vignesh Shivan Wedding: పెళ్లికి బాజా మోగింది… విగ్నేష్ కంటే నయనతార వయసులో ఎంత పెద్దదో తెలుసా!

Nayanthara- Vignesh Shivan Wedding: దాదాపు ఏడేళ్లుగా ప్రేమించుకుంటున్న కోలీవుడ్ లవ్ బర్డ్స్ నయనతార-విగ్నేష్ శివన్ నేడు వివాహం చేసుకుంటున్నారు. మహాబలిపురంలో వీరి వివాహ వేడుక జరగనుంది. బంధు మిత్రులతో పాటు చిత్ర ప్రముఖులు పాల్గొననున్నారు. మొదట తిరుపతిలో పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. కొన్ని అనివార్య కారణాల వలన వేదిక మార్చారు. 2015లో విగ్నేష్ శివన్ దర్శకత్వంలో నానున్ రౌడీదాన్ మూవీ విడుదలైంది. ఈ మూవీలో విజయ్ సేతుపతి-నయనతార హీరో హీరోయిన్స్ గా నటించారు. ఆ చిత్ర […]

Written By:
  • Shiva
  • , Updated On : June 9, 2022 / 11:10 AM IST
    Follow us on

    Nayanthara- Vignesh Shivan Wedding: దాదాపు ఏడేళ్లుగా ప్రేమించుకుంటున్న కోలీవుడ్ లవ్ బర్డ్స్ నయనతార-విగ్నేష్ శివన్ నేడు వివాహం చేసుకుంటున్నారు. మహాబలిపురంలో వీరి వివాహ వేడుక జరగనుంది. బంధు మిత్రులతో పాటు చిత్ర ప్రముఖులు పాల్గొననున్నారు. మొదట తిరుపతిలో పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. కొన్ని అనివార్య కారణాల వలన వేదిక మార్చారు. 2015లో విగ్నేష్ శివన్ దర్శకత్వంలో నానున్ రౌడీదాన్ మూవీ విడుదలైంది. ఈ మూవీలో విజయ్ సేతుపతి-నయనతార హీరో హీరోయిన్స్ గా నటించారు. ఆ చిత్ర షూటింగ్ సమయంలో ఇద్దరూ ప్రేమలో పడ్డారు.

    Nayanthara- Vignesh Shivan

    అప్పటి నుండి వీళ్ళ ప్రేమ ప్రయాణం మొదలైంది. పేరుకు ప్రేమికులే అయినా భార్యాభర్తలుగా మెలిగారు. పండుగలు, పుట్టినరోజులు కలిసి జరుపుకునేవారు. ప్రత్యేక సందర్భాల్లో బహుమతులు ఇచ్చుకోవడం చేసేవారు. ఇద్దరిలో ఎవరి బర్త్ డే అయినా విహారానికి చెక్కేసేవారు. అలాగే ఇరు కుటుంబాలు వీరి ప్రేమను అంగీకరించాయి. కొత్త అల్లుడి మాదిరి కేరళలోని నయనతార ఇంటికి పండుగలు, పబ్బాలకు విగ్నేష్ వెళతాడు. అలాగే నయనతార విగ్నేష్ ఇంటికి తరచూ వస్తూ ఉండేవారు.

    Also Read: Sarayu Roy: బెడ్ పై బోర్లా పడుకొని ఎద అందాలు చూపిస్తూ బిగ్ బాస్ సరయు బోల్డ్ ట్రీట్!

    ఇక గత రెండేళ్లుగా నయనతార-విగ్నేష్ పెళ్లి వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. పలుమార్లు మీడియా ఈ విషయంపై స్పష్టత కోరింది. ఓ సందర్భంలో విగ్నేష్ శివన్ మాట్లాడుతూ… ప్రస్తుతం మేము డేటింగ్ ఎంజాయ్ చేస్తున్నాం. అది బోర్ కొట్టాక పెళ్లి చేసుకుంటాం అని చెప్పాడు. ఆయన కామెంట్స్ నేపథ్యంలో అసలు వీళ్లకు పెళ్లి చేసుకునే ఆలోచన ఉందా లేదా అనే సందేహాలు కలిగాయి.

    Nayanthara- Vignesh Shivan

    సదరు అనుమానాలకు తెరదించుతూ నేడు పెళ్లి బంధంతో ఒక్కటవుతున్నారు. ఇక వీరి బంధంలో మరొక భిన్నమైన విషయం చోటు చేసుకుంది. నయనతార భర్త విగ్నేష్ కంటే వయసులో పెద్దది. 18 సెప్టెంబర్ 1985 విగ్నేష్ పుట్టిన రోజు కాగా, 18 నవంబర్ 1984లో నయనతార జన్మించారు. అంటే దాదాపు ఓ ఏడాది నయనతార విగ్నేష్ కంటే పెద్దది. కాగా ప్రియాంక చోప్రా తనకంటే 10 ఏళ్ళు చిన్నవాడిని చేసుకున్న నేపథ్యంలో ఏడాది వ్యత్యాసం ఏముందిలే అంటున్నారు కొందరు.

    Also Read:Ram Charan- Vikram Sequel: ఇది కదా మెగా ఫ్యాన్స్ కి కావలసింది… విక్రమ్ సీక్వెల్ లో చరణ్, కమల్ కి మనవడిగా పవర్ఫుల్ రోల్?

    Tags