https://oktelugu.com/

Nayanthara: క్యూట్ పిల్లలతో నయనతార క్రిస్మస్ సెలబ్రేషన్స్.. ఫొటోలు వైరల్

ఎరుపు రంగు దుస్తులను ధరించి నయనతార ఫ్యామిలీ అంతా క్రిస్మస్ సెలబ్రేషన్స్ జరుపుకున్నారు. పిల్లలు ఉయిర్, ఉలాగ్ లకు శాంటా క్యాప్స్ వేయగా చిన్న చిన్న బొమ్మలతో ఆడుకుంటూ కనిపించారు.

Written By:
  • Neelambaram
  • , Updated On : December 26, 2023 / 12:50 PM IST
    Follow us on

    Nayanthara: దక్షిణాదిలో స్టార్ హీరోయిన్ అయిన నయనతార తన ఫ్యామిలీతో కలిసి క్రిస్మస్ పండుగను ఇంట్లోనే ఘనంగా సెలబ్రేట్ చేసుకున్నారు. ఈ సందర్భంగా భర్త విఘ్నేష్ శివన్, పిల్లలతో కలిసి తీసుకున్న ఫొటోలను సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నారు. ప్రస్తుతం నెట్టింట్లో ఆ ఫొటోలు తెగ హల్ చల్ చేస్తున్నాయి.

    ఎరుపు రంగు దుస్తులను ధరించి నయనతార ఫ్యామిలీ అంతా క్రిస్మస్ సెలబ్రేషన్స్ జరుపుకున్నారు. పిల్లలు ఉయిర్, ఉలాగ్ లకు శాంటా క్యాప్స్ వేయగా చిన్న చిన్న బొమ్మలతో ఆడుకుంటూ కనిపించారు. భర్త పిల్లలతో పాటు ఓ ఫొటోలో విఘ్నేష్ తల్లితో పాటు కూర్చుని నవ్వుతున్న దృశ్యాలు ఉన్నాయి. క్రిస్మస్ పండుగను పురస్కరించుకుని కుటుంబంతో పాటు దిగిన ఇన్ స్టాగ్రామ్ వేదికగా పంచుకున్న నయన్ అందరికీ పండుగ శుభాకాంక్షలు తెలిపారు.

    లేడీ సూపర్ స్టార్ గా పేరుగాంచిన నయనతార అసలు పేరు డయానా మరియం కురియన్. ఆమె ప్రతి సంవత్సరం ఎంతో ఘనంగా క్రిస్మస్ పండుగను జరుపుకుంటారన్న సంగతి తెలిసిందే. అయితే విఘ్నేశ్ శివన్, నయన్ 2022 జూన్ లో ప్రేమించి పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. తరువాత సరోగసీ పద్ధతిలో వీరు కవలలకు తల్లిదండ్రులు అయ్యారు. వీరికి ఉయిర్ రుద్రోనిల్ ఎన్ శివన్, ఉలగ్ దీవిక్ ఎన్ శివన్ అనే పేర్లు పెట్టినట్లు నయన్ వెల్లడించారు.

    సినీ పరిశ్రమలో లేడి ఓరియెంటెడ్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్ గా మారారు నయన్. ఆమె నటనతో లేడీ సూపర్ స్టార్ గా ప్రేక్షకుల మదిలో చెరగని ముద్ర వేసుకున్నారు. ఒకానొక సమయంలో కమర్షియల్ సినిమాల్లో కథనాయకగా కనిపించిన నయనతార ప్రస్తుతం స్టార్ హీరోయిన్ గా రాణిస్తున్నారు. ఇటీవల నయన్ బాలీవుడ్ బాద్ షా షారూఖ్ ఖాన్ తో నటించిన చిత్రం బాక్సాఫీస్ వద్ద సంచలన విజయాన్ని అందించిన సంగతి తెలిసిందే. అట్లీ డైరెక్షన్ లో వచ్చిన జవాన్ సినిమా ప్రపంచ వ్యాప్తంగా రూ.1000 కోట్ల గ్రాస్ ను దాటిన సంగతి తెలిసిందే. అలాగే డైరెక్టర్ విఘ్నేష్ శివన్ ‘లవ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్’ ప్రాజెక్టులో బిజీగా ఉన్నారు.