https://oktelugu.com/

Chiranjeevi and Prabhas: అయోధ్య ప్రారంభోత్సవం… చిరు, ప్రభాస్ లకు ఊహించని అరుదైన గౌరవం

దీన్ని అరుదైన గౌరవంగా చెప్పవచ్చు. టాలీవుడ్ నుండి ఇద్దరు హీరోలకు అయోధ్య మందిర ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఆహ్వానం దక్కింది. వారిలో ఒకరు మెగాస్టార్ చిరంజీవి కాగా, మరొకరు ప్రభాస్.

Written By:
  • Neelambaram
  • , Updated On : December 26, 2023 / 12:56 PM IST
    Follow us on

    Chiranjeevi and Prabhas: బీజేపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన అయోధ్య మందిర నిర్మాణం పూర్తి అయ్యింది. జనవరి 22న శ్రీరాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం జరగనుంది. ఈ వేడుకను అత్యంత ఘనంగా నిర్వహిస్తున్నారు. దేశ ప్రధాని నరేంద్ర మోడీతో పాటు వివిధ పరిశ్రమలకు చెందిన ప్రముఖులు హాజరుకానున్నారు. భిన్న రంగాల్లో రాణిస్తున్న 2000 లకు పైగా ప్రముఖులను ప్రత్యేకంగా ఆహ్వానిస్తున్నారు. అయోధ్య మందిరం ఆలయ ట్రస్ట్ బోర్డు సభ్యులు కొందరిని ఎంపిక చేశారు.

    దీన్ని అరుదైన గౌరవంగా చెప్పవచ్చు. టాలీవుడ్ నుండి ఇద్దరు హీరోలకు అయోధ్య మందిర ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఆహ్వానం దక్కింది. వారిలో ఒకరు మెగాస్టార్ చిరంజీవి కాగా, మరొకరు ప్రభాస్. చిరంజీవికి దేశవ్యాప్తంగా గుర్తింపు ఉంది. దశాబ్దాలుగా చిత్ర పరిశ్రమకు సేవలు చేస్తున్నారు. సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహించారు. అందుకే చిరంజీవిని ప్రత్యేకంగా ఆహ్వానించారు.

    ఇక ప్రభాస్ బీజేపీ పార్టీ సానుభూతిపరుడు. ప్రభాస్ పెదనాన్న దివంగత నటుడు కృష్ణంరాజు బీజేపీ పార్టీలో పనిచేశారు. ఇటీవల ఆదిపురుష్ మూవీలో ప్రభాస్ రాముడు పాత్ర చేశాడు. కరోనా సమయంలో కేంద్ర ప్రభుత్వానికి ప్రభాస్ భారీగా విరాళం ఇచ్చారు. బీజేపీ పార్టీలో ప్రభాస్ కి సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. దీంతో ఆయనకు ఆహ్వానం లభించింది.

    కాగా ఎన్టీఆర్, నితిన్, నిఖిల్ వంటి హీరోలు కూడా బీజేపీ ప్రభుత్వంతో సన్నిహిత సంబంధాలు కలిగి ఉన్నారు. ఇక పవన్ కళ్యాణ్ బీజేపీ పార్టీతో పొత్తులో ఉన్నారు. వీరికి ఆహ్వానం ఉందా లేదా అనేది తెలియదు. చిరంజీవి, ప్రభాస్ లకు ఆహ్వానం లభించినట్లు స్పష్టమైన సమాచారం ఉంది.