https://oktelugu.com/

Tollywood: స్టార్ ఫ్యామిలీ నుంచి మరో హీరో.. ఇంతకీ ఎవరు? ఆయన బ్యాక్ గ్రౌండ్ ఏంటంటే?

మెగా ఫ్యామిలీ నుంచి ఎంతో మంది టాలీవుడ్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చారు. అలాగే ఇప్పుడు అల్లు ఫ్యామిలీకి చెందిన మరో వారసుడు ఇండస్ట్రీలోకి హీరోగా ఎంట్రీ ఇస్తున్నారు. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

Written By:
  • Neelambaram
  • , Updated On : December 26, 2023 / 12:45 PM IST
    Follow us on

    Tollywood: సినిమా ఇండస్ట్రీలో స్టార్లుగా ఎదిగారంటే.. వారి కుటుంబం కూడా ఇండస్ట్రీలో రాణిస్తుంది. ఈ విధంగా చూడాలంటే మెగా స్టార్ ఫ్యామిలీ, అల్లు ఫ్యామిలీ, నందమూరి ఫ్యామిలీ, మంచు ఫ్యామిలీ మొదటి లిస్ట్ లో ఉంటారు. ఇలా ఈ ఫ్యామిలీల నుంచి ఎంతో మంది హీరోలుగా ఎంట్రీ ఇచ్చారు. మెగా ఫ్యామిలీ నుంచి మరింత ఎక్కువ మంది హీరోలు ఇండస్ట్రీలోకి వచ్చి స్టార్లుగా ఎదిగారు. హీరోయిన్ లు, నిర్మాతలుగా కూడా రాణించిన వారు ఎందరో.. ఇప్పుడు మరో హీరో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. ఓ సారి ఆ వివరాలు మీకోసం..

    మెగా ఫ్యామిలీ నుంచి ఎంతో మంది టాలీవుడ్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చారు. అలాగే ఇప్పుడు అల్లు ఫ్యామిలీకి చెందిన మరో వారసుడు ఇండస్ట్రీలోకి హీరోగా ఎంట్రీ ఇస్తున్నారు. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈయన రేంజ్ ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా ఎదిగిపోయింది. అల్లు అర్జున్ కజిన్ విరాన్ ముత్తంశెట్టి హీరోగా ఇండస్ట్రీకి పరిచయం అవుతున్నారు. అయితే విరాన్ ముఖ్య గమనిక అనే సినిమా ద్వారా త్వరలోనే ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి తన లక్ ను పరిచయం చేసుకోబోతున్నారు.

    క్రిస్మస్ పండుగ సందర్భంగా ఈ సినిమా నుంచి ఫస్ట్ లిరికల్ సాంగ్ విడుదల చేశారు. ఇక ఈ సినిమాకు ప్రముఖ డైరెక్టర్ బాబి ముఖ్య అతిథిగా వచ్చారు. ఎన్నో విజయవంతమైన సినిమాలకు సినిమాటోగ్రాఫర్ గా చేసిన వేణు మురళిధర్ వి ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయమవుతున్నారు. ఈ సందర్భంగా బాబీ మాట్లాడుతూ.. అల్లు అర్జున్ ని కలవడానికి వెళితే అక్కడ మమ్మల్ని విరాన్ ప్రేమగా ఆహ్వానించేవారని తెలిపారు. కానీ అప్పుడు అల్లు అర్జున్ కజిన్ అని తెలియదట. అయినా ఇంత పెద్ద స్టార్ కు బంధువు అయినా కూడా వారి స్టేటస్ ను ఉపయోగించకుండా సొంతంగా ఎదగాలనుకుంటున్నాడని తెలిపాడు.