Homeబిజినెస్Vivo V70 FE: ఈ మొబైల్ Display గురించి తెలిస్తే కొనకుండా ఉండలేరు.. ధర ఎంతో...

Vivo V70 FE: ఈ మొబైల్ Display గురించి తెలిస్తే కొనకుండా ఉండలేరు.. ధర ఎంతో తెలుసా?

Vivo V70 FE: ప్రస్తుత కాలంలో మొబైల్ కొనుగోలు చేసేటప్పుడు డిస్ప్లే గురించి ఎక్కువగా ఆరా తీస్తున్నారు. ఎందుకంటే ప్రస్తుతం మొబైల్ లోనే మూవీస్ చూసేందుకు చాలామంది ఇష్టపడుతున్నారు. అంతేకాకుండా గేమింగ్ కోరుకునేవారు డిస్ప్లే బాగుండాలని అనుకుంటున్నారు ఇలాంటి వారి కోసం Vivo కంపెనీ అద్భుతమైన డిస్ప్లే తో కొత్త ఫోన్ ను మార్కెట్లోకి తీసుకువచ్చింది. ఈ మొబైల్ లో డిస్ప్లే మాత్రమే కాకుండా నాణ్యమైన కెమెరా, మెరుగైన సామర్థ్యం కలిగిన బ్యాటరీని కూడా ఉంచారు. ఇంతకీ ఇది ఏ ఫోనో తెలుసుకోవాలని అనుకుంటున్నారా..?

Also Read: అమాయకంగా ఉండే సంజు శాంసన్.. ఇంతటి కోటీశ్వరుడా? ఎన్ని కోట్లకు అధిపతో తెలుసా?

చైనా కంపెనీ Vivo ఇప్పటికే భారత్లో అనేక ఆకట్టుకునే మొబైల్స్ ను ప్రవేశపెట్టింది. అయితే ఇటీవల మార్చి 9వ తేదీన కొత్త మొబైల్ ను రిలీజ్ చేసింది. Vivo V70 FE అనే ఈ మొబైల్ కొనుగోలు చేసేందుకు అందుబాటులో ఉండడంతో చాలామంది దీనిపై ఆసక్తి చూపుతున్నారు. ఈ మొబైల్లో ప్రధానంగా చెప్పుకోవాల్సింది డిస్ప్లే. ఇందులో 6.83 అంగుళాల AMOLED డిస్ప్లేను అమర్చారు. ఇది 1.5 k resolution తో పనిచేస్తుంది.120 Hz రిఫ్రెష్ రేట్ కలిగిన ఇందులో 1,900 nits బ్రైట్నెస్ ఉండడంతో ఎలాంటి వాతావరణం లోనైనా ఈ డిస్ప్లే అనుగుణంగా ఉంటుంది. ముఖ్యంగా మూవీస్ చూసేవారికి పగలు, రాత్రి అనే తేడా లేకుండా అద్భుతమైన కాంతితో గొప్ప అనుభవం కలుగుతుంది.

ఈ మొబైల్లో లేటెస్ట్ టెక్నాలజీ తో కూడిన సాఫ్ట్వేర్ను అమర్చారు. ఇందులో 7360 చిప్ సెట్ ఉండగా.. 12gb రామ్, 512 gb స్టోరేజ్ ను అమర్చారు. దీంతో ఫోటోలు, వీడియోలతో పాటు కావాల్సిన ఫైల్స్ ను స్టోరేజ్ చేసుకోవచ్చు. ప్రస్తుత మొబైల్స్ ఎక్కువగా హై రేంజ్ కెమెరాతో మార్కెట్లోకి వస్తున్నాయి. Vivo V70 FE మొబైల్ లో 200 MP మెయిన్ కెమెరాను అమర్చారు. అలాగే 32 MP ఫ్రంట్ కెమెరా ఉండడంతో సెల్ఫీతోపాటు వీడియో కాలింగ్ కు ఇది అనుగుణంగా ఉంటుంది. ప్రొఫెషనల్ ఫోటోగ్రఫీ కోరుకునే వారికి ఈ కెమెరా అద్భుతంగా పనిచేస్తుంది.

ఈ మొబైల్లో బ్యాటరీ మెరుగ్గా ఉన్నట్లు తెలుస్తోంది ఇందులో 7000 mAh బ్యాటరీ ఉండగా ఇది 90 W ఫాస్టెస్ట్ చార్జింగ్తో సపోర్ట్ చేస్తుంది. మల్టీ టాస్కింగ్ కోసం యూజ్ చేసే వారికి ఈ బ్యాటరీ బాగా ఉపయోగపడుతుంది. ఇవే కాకుండా బ్లూటూత్ 5.4, యు ఎస్ బి టైప్ సి, GPS వంటి ఫీచర్లు కూడా నేటి తరం వారికి ఉపయోగకరంగా ఉన్నాయి. ఇన్ని ఫీచర్లు కలిగిన ఈ మొబైల్ మిడ్ రేంజ్ పీపుల్స్ కు అనుగుణంగా ఉంటుంది. ఎందుకంటే దీని ధర రూ.35,000 ప్రారంభం నుంచి రూ.73,900 వరకు విక్రయిస్తున్నారు. ప్రీమియం ఫీచర్లు కలిగిన మొబైల్ బడ్జెట్లో కొనాలనుకుంటే ఇదే బెస్ట్ ఆప్షన్ అని అంటున్నారు.

S. Vas Chaimuchata
S. Vas Chaimuchatahttps://oktelugu.com/
Srinivas is a Senior content writer who has good knoeledge in the field of Auto mobile, General, Business and lifestyle news. He covers all kind of general news content in our website.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version