https://oktelugu.com/

Nayantara : మరోసారి చిక్కులో పడ్డ నయనతార..5 కోట్లు డిమాండ్ చేస్తూ చంద్రముఖి నిర్మాత నోటీసులు జారీ..క్లారిటీ ఇచ్చిన నిర్మాత!

నయనతార, సతీష్ విగ్నేష్ వివాహ వేడుకకు సంబంధించి ఒక డాక్యుమెంటరీ వీడియో ని నెట్ ఫ్లిక్స్ లో విడుదల చేసిన సంగతి తెలిసిందే.

Written By:
  • Vicky
  • , Updated On : January 7, 2025 / 01:33 PM IST

    Nayantara

    Follow us on

    Nayantara : నయనతార, సతీష్ విగ్నేష్ వివాహ వేడుకకు సంబంధించి ఒక డాక్యుమెంటరీ వీడియో ని నెట్ ఫ్లిక్స్ లో విడుదల చేసిన సంగతి తెలిసిందే. దీనికి అభిమానులు నుండి మంచి రెస్పాన్స్ వచ్చింది. నయనతార తన లైఫ్ స్టైల్ మొత్తాన్ని ఈ డాక్యుమెంటరీ లో చూపిస్తే తానూ ఎన్ని కష్టాలు పడి ఈ స్థాయికి వచ్చిందో చెప్పుకొచ్చింది. అయితే నెట్ ఫ్లిక్స్ లో విడుదలకు ముందే హీరో ధనుష్ నయనతార కి తానూ నిర్మాతగా వ్యవహరించిన ‘నానుమ్ రౌడీ దాన్’ అనే చిత్రం షూటింగ్ సమయంలో వీడియో ని తన అనుమతి లేకుండా వాడుకున్నారని, దానికి ఆయన పది కోట్ల రూపాయిలు డిమాండ్ చేస్తూ కోర్టు ద్వారా ఉత్తర్వులు జారీ అయ్యేలా చేసాడు. ఇప్పుడు రీసెంట్ గా చంద్రముఖి నిర్మాతలు కూడా నయనతార కి తమ అనుమతి లేకుండా ఆమె చంద్రముఖి షూటింగ్ సెట్స్ లోని షాట్స్ ని వాడినందుకు 5 కోట్ల రూపాయిలు డిమాండ్ చేస్తున్నట్టు వార్తలు వినిపించాయి.

    సోషల్ మీడియా లో ఈ వార్త బాగా వైరల్ అవ్వడంతో చంద్రముఖి నిర్మాతలు వెంటనే స్పందించారు. దీనికి సంబంధించి ఒక లేఖని విడుదల చేస్తూ రౌడీ పిచర్స్ నుండి నయనతార కి చంద్రముఖి చిత్రం లోని షూటింగ్స్ లొకేషన్ షాట్స్ వాడుకునేందుకు అనుమతిని ఇచ్చాము. శివాజీ ప్రొడక్షన్స్ నుండి కూడా ఎలాంటి అభ్యంతరాలు లేవు. సోషల్ మీడియా లో ప్రచారం అవుతున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదు. దయచేసి అభిమానులు ఈ విషాయాన్ని గమనించగలరు’ అంటూ చెప్పుకొచ్చారు. శివాజీ ప్రొడక్షన్స్ కి అధినేత గా ప్రముఖ తమిళ హీరో ప్రభు ఉంటున్న సంగతి తెలిసిందే. తన తండ్రి శివాజీ గణేశన్ పేరిట స్థాపించిన ప్రొడక్షన్ హౌస్ లోనే చంద్రముఖి చిత్రాన్ని నిర్మించాడు. కేవలం చంద్రముఖి ఒక్కటే కాదు,ఎన్నో సూపర్ హిట్ చిత్రాలను ఆయన నిర్మించాడు.

    నయనతార ఆయన్ని తమ సినిమాలోని కంటెంట్ ని మా డాక్యుమెంటరీ కోసం ఉపయోగించుకోవచ్చా అని అడిగితే క్షణం కూడా ఆలోచించుకుండా అనుమతిని ఇచ్చాడట. దీనికి నయనతార అప్పట్లో ప్రత్యేకంగా కృతఙ్ఞతలు కూడా తెలిపింది. ఇకపోతే నయనతార చేతిలో ప్రస్తుతం 7 సినిమాలు ఉన్నాయి. గత ఏడాది ఈమె నుండి ఎలాంటి సినిమా విడుదల అవ్వలేదు. దీంతో అభిమానులు కాస్త నిరాశకు గురి అయ్యారు. ఈ ఏడాది ఆమె లేడీ ఓరియెంటెడ్ చిత్రాలతో పాటు, హీరోయిన్ గా కూడా పలు సినిమాల్లో నటించేందుకు ఒప్పుకుంది. అందులో కేజీఎఫ్ హీరో యాష్ నటిస్తున్న ‘టాక్సిక్’ చిత్రం కూడా ఉంది. అయితే తెలుగు లో ఈమె ఈమధ్య కాలం లో ఒక్క సినిమాలో కూడా నటించేందుకు అంగీకారం తెలుపలేదు. మొత్తం తమిళం, మలయాళం భాషల్లోనే ఆమె చేస్తుండడం విశేషం.చూడాలి మరి ఈ ఏడాది ఆమె అదృష్టం బాక్స్ ఆఫీస్ వద్ద ఏ రేంజ్ లో ఉంది అనేది.