Naga Vamsi: టాలీవుడ్ ఇండస్ట్రీలో ప్రస్తుతం ఉన్న స్టార్ హీరోలలో జూనియర్ ఎన్టీఆర్ కూడా ఒకరు. ఈయనకు ఉన్న క్రేజ్ గురించి, ఫాలోయింగ్ గురించి అందరికీ తెలిసిందే. ఎన్టీఆర్ ఇప్పటివరకు తన కెరీర్ లో ఎన్నో బ్లాక్ బస్టర్ హిట్ సినిమాలను ప్రేక్షకులకు అందించారు. నిన్ను చూడాలని సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీకి హీరోగా పరిచయమైన ఎన్టీఆర్ ఆ తర్వాత స్టూడెంట్ నెంబర్ వన్ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ ను అందుకున్నారు. రాజమౌళి దర్శకత్వం వహించిన స్టూడెంట్ నెంబర్ వన్ సినిమాలో ఎన్టీఆర్ నటనకు ప్రేక్షకుల నుంచి భారీ స్థాయిలో రెస్పాన్స్ వచ్చింది. ఇక అప్పటినుంచి ఇప్పటివరకు ఎన్నో సూపర్ హిట్ సినిమాలను ఎన్టీఆర్ నటించిన. అయితే ఆయన సినిమాలలో ఉన్న స్పెషల్స్ సినిమాలలో జై లవకుశ సినిమా కూడా ఒకటి. దర్శకుడు బాబి సర్దార్ గబ్బర్ ఫ్లాప్ తర్వాత ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్లో ఎన్టీఆర్ తో సినిమా చేసి హిట్టు అందుకున్నారు. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా 130 కోట్లు కలెక్షన్లు సాధించింది. తాజాగా దర్శకుడు బాబి నందమూరి బాలకృష్ణ హోస్ట్ గా వ్యవహరిస్తున్న అన్ స్టాపబుల్ షోలో పాల్గొన్నారు. ఇక ఈ షోలో బాబీ దర్శకత్వం వహించిన ప్రతి సినిమా గురించి ప్రస్తావన తీసుకొచ్చిన బాలకృష్ణ, ఎన్టీఆర్ నటించిన జై లవకుశ సినిమా గురించి మాత్రం ఎందుకు అడగలేదు అని ఎన్టీఆర్ అభిమానులు అభిప్రాయపడుతున్నారు. బాబాయ్ మరిచిన బాబి అయినా చెప్పి ఉండాల్సింది కదా అంటూ అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. దర్శకుడు బాబి రీసెంట్ గా ఒక ఇంటర్వ్యూలో కూడా ఒక సినిమా గురించి చెప్పారు. ఒక సినిమాకి తాను చాలా అడ్జస్ట్ అవుతూ వర్క్ చేయాల్సి వచ్చిందని, సదరునిర్మాణ సంస్థ సరైన బడ్జెట్ ఇచ్చి ఉంటే ఇంకా బ్రహ్మాండంగా తెరకెక్కించేవాడిని అంటూ బాబి అన్నారు.
అయితే ఆ సినిమా జై లవకుశ, ఆ నిర్మాణ సంస్థ ఎన్టీఆర్ ఆర్ట్స్ అని చాలామంది ఊహించారు. బాబి కొట్టిపారేశారు. ఇదిలా ఉంటే నందమూరి బాలకృష్ణను, ఎన్టీఆర్ ను ఒకే వేదిక మీద చూడడానికి అభిమానులు ఎప్పటినుంచో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అలాగే నందమూరి బాలకృష్ణ హోస్ట్ చేస్తున్న అన్ స్టాపబుల్ టాక్ షోలో ఎన్టీఆర్ కూడా వస్తే బాగుంటుందని ఆయన అభిమానులు కళ్ళు కాయలు కాచేలా ఎదురుచూస్తున్నారు. ఈ షోకు ఎన్టీఆర్ గెస్ట్ గా రాకపోవడం అటు నుంచి ఆయన గురించి లేదా ఆయన సినిమాల గురించి కూడా ప్రస్తావన తీసుకొని రాకపోవడం ఎంతవరకు కరెక్ట్ అంటూ ఎన్టీఆర్ అభిమానులు సోషల్ మీడియాలో తమ బాధను వ్యక్తం చేస్తున్నారు.
అందుకే సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వస్తున్న నందమూరి బాలకృష్ణ నటించిన డాకుమహారాజు సినిమాలో మేము చూడము అంటూ అభిమానులు అంటున్నారు. దీనిపై పరోక్షంగా స్పందించిన ఈ సినిమా నిర్మాత నాగ వంశీ స్పందిస్తూ… ఇది మన అందరి సినిమా. నాకు మీ అందరి సపోర్ట్ చాలా అవసరం. అందరం ప్రశాంతంగా ఉండి మన సినిమా అతిపెద్ద బ్లాక్ బస్టర్ అయ్యేలా ప్రయత్నిద్దాం అంటూ ఎక్స్ లో పోస్ట్ చేయడం జరిగింది. అయితే ఇప్పటికే డాకుమహారాజు ట్రైలర్ రిలీజ్ అయ్యి ప్రేక్షకులలో భారీ అంచనాలను పెంచుతుంది.