Hero
Hero : భారత టూ వీలర్ మార్కెట్లో టాప్ పొజిషన్లో ఉన్న కంపెనీ హీరో. కస్టమర్ల అభిరుచులకు అనుగుణంగా ఎప్పటికప్పుడు కొత్త బైక్స్ అందిస్తుంటుంది. ఈ క్రమంలోనే హోండా నుంచి మరో రెండు కొత్త బైక్స్ రిలీజ్ అయ్యాయి. 200సీసీ కంటే ఎక్కువ పవర్ ఫుల్ ఇంజిన్‌తో కూడిన బైక్‌ను కొనాలనుకుంటున్నారా.. హీరో మోటోకార్ప్ ఇటీవల విడుదల చేసిన XPlulse 210, Xtreme 250R లపై ఓ లుక్ వేయవచ్చు. ఈ రెండు బైక్‌లను EICMA 2024లో ప్రదర్శించారు. భారత్ మొబిలిటీ ఆటో ఎక్స్‌పోలో రిలీజ్ చేశారు. ఇప్పుడు కంపెనీ వాటి బుకింగ్స్ కూడా ప్రారంభించింది. కాబట్టి హీరో XPlulse 210, Xtreme 250R మధ్య ఉన్న తేడాలను తెలుసుకుందాం.
Also Read : రూ. 11 లక్షల లోపు బెస్ట్ సెడాన్ కార్లు ఇవే
హీరో మోటోకార్ప్ XPlulse 210.. 2 వేరియంట్‌లను విక్రయిస్తోంది. ఇందులో బేస్ వేరియంట్ ధర రూ.1.75 లక్షల నుంచి ప్రారంభమవుతుంది. అయితే దీని ప్రో వేరియంట్ రూ.1.86 లక్షల ఎక్స్-షోరూమ్ ధరతో లభిస్తుంది. దీనికి విరుద్ధంగా హీరో Xtreme 250R ఒకే వేరియంట్ ఇప్పటివరకు మార్కెట్‌లోకి వచ్చింది. దీని ప్రారంభ ధర రూ. 1.80 లక్షలు.
XPlulse 210లో మీకు 210సీసీ లిక్విడ్ కూల్డ్ ఇంజన్ లభిస్తుంది. ఇది 6-స్పీడ్ గేర్‌బాక్స్‌తో వస్తుంది. అలాగే ఇందులో స్లిప్పర్ క్లచ్ కూడా ఉంది. దీని ఇంజన్ 24.6 bhpపవర్, 20.7 Nm పీక్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. మరోవైపు Xtreme 250Rలో మీకు 250సీసీ లిక్విడ్ కూల్డ్ సింగిల్ సిలిండర్ ఇంజన్ లభిస్తుంది. ఈ ఇంజన్ 29.58 bhp పవర్, 25 Nm పీక్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.
హీరో ఎక్స్‌పల్స్ 210 బైక్ మైలేజ్ గురించి కంపెనీ లీటరుకు 40 కిమీల మైలేజ్‌ను అందిస్తుంది. అయితే ఎక్స్‌ట్రీమ్ 250R క్లెయిమ్డ్ మైలేజ్ లీటరుకు 37 కిమీలు ఇస్తుంది.. కాబట్టి ఈ రెండు బైక్‌ల ఆన్-రోడ్ మైలేజ్ దాదాపు సమానంగా ఉండే అవకాశం ఉంది.
Xtreme 250Rలో LED లైటింగ్ సిస్టమ్ లభిస్తుంది. కాబట్టి ఇందులో హజార్డ్ లైట్ , ఆటోమేటిక్ హెడ్‌ల్యాంప్ ఉంటాయి. అలాగే ఇందులో డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, రియల్ టైమ్ ఫ్యూయల్ కన్సప్షన్ మీటర్, మ్యూజిక్ కంట్రోల్‌తో బ్లూటూత్ కనెక్టివిటీ మరియు ఛార్జింగ్ పాయింట్ లభిస్తాయి.
XPulse 210లో LED లైట్లు, టెయిల్ ర్యాక్, USB మొబైల్ ఛార్జింగ్ పాయింట్, TFT ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, బ్లూటూత్ కనెక్టివిటీ వంటి ప్రాథమిక ఫీచర్లు లభిస్తాయి. ఈ విధంగా Xtreme 250Rతో పోలిస్తే ఇందులో ఫీచర్లు తక్కువగా ఉన్నాయి. రెండింటి ధరలో పెద్దగా వ్యత్యాసం లేదు.
హీరో మోటోకార్ప్ దేశంలోనే అతిపెద్ద 2-వీలర్ కంపెనీ. Hero Splendor మోడల్ ఇప్పటికీ దేశంలో అత్యధికంగా అమ్ముడవుతున్న 2-వీలర్. ప్రతి నెలా దాదాపు 2 లక్షల యూనిట్ల స్ప్లెండర్ ఒక్కటే దేశంలో అమ్ముడవుతోంది.
Also Read : ‘నాయక్’ రీ రిలీజ్ కి డిజాస్టర్ రెస్పాన్స్..ఎంత గ్రాస్ వచ్చిందంటే!