Naveen Polishetty: కెరీర్ ప్రారంభం నుండి ఇప్పటి వరకు నూటికి నూరు శాతం సక్సెస్ రేట్ తో ఇండస్ట్రీ లో తనకంటూ ఒక బ్రాండ్ ఇమేజ్ ని ఏర్పాటు చేసుకున్న హీరో నవీన్ పోలిశెట్టి. ‘ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ’, ‘జాతి రత్నాలు’, ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’, ‘అనగనగా ఒక రాజు’ ఇలా ప్రతీ సినిమా కూడా ఒక దానిని మించి ఒకటి హిట్ అయ్యాయి. రీసెంట్ గా సంక్రాంతి కానుకగా విడుదలైన ‘అనగనగా ఒక రాజు’ చిత్రం ఈ ఏడాది అత్యధిక లాభాలను రాబట్టిన అతి తక్కువ సినిమాల్లో ఒకటిగా నిల్చి సెన్సేషన్ క్రియేట్ చేసింది. అయితే ఈ సినిమా తర్వాత నవీన్ ఎలాంటి సినిమా చేయబోతున్నారు?, ఈసారైనా వేగంగా సినిమాలు చేస్తారా ?, లేదా సంవత్సరాల గ్యాప్ తీసుకుంటారా అనే అనుమానం ఆయన అభిమానుల్లో , ప్రేక్షకుల్లో ఉంది.
అయితే లేటెస్ట్ గా అందుతున్న సమాచారం ఏంటంటే , ఆయన ఒక తమిళ డైరెక్టర్ తో కలిసి పని చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తోంది. ఆ డైరెక్టర్ పేరు ఆంటోని భాగ్యరాజ్. గతం లో ఈయన ‘సైరన్’ అనే చిత్రానికి దర్శకత్వం వహించారు. జయం రవి , కీర్తి సురేష్ , అనుపమ పరమేశ్వరన్ వంటి వారు ఈ చిత్రం లో నటించారు . సినిమా బాగానే ఉంటుంది కానీ , కమర్షియల్ గా ఎందుకో పెద్దగా ఆడలేదు. కానీ ఈ చిత్రాన్ని చూసిన ప్రతీ ఒక్కరికి కలిగిన ఫీలింగ్ ఏంటంటే డైరెక్టర్ లో మంచి టాలెంట్ ఉంది , కచ్చితంగా మంచి అవకాశం ఇస్తే పెద్ద రేంజ్ కి వెళ్తాడు అని. నవీన్ పోలిశెట్టి తో సినిమా అంటే , హిట్ కొట్టేసినట్టే. ఎందుకంటే స్టోరీ మొత్తం నవీన్ చూసుకుంటారు , డైరెక్షన్ తనకు ఎలా కావాలో అలా అడిగి చేయించుకుంటారు.
ఇప్పటి వరకు ఆయన చేసిన ప్రతీ సినిమాకు ఇదే తరహాలో వ్యవహరించారు. అన్ని కమర్షియల్ గా వర్కౌట్ అయ్యాయి కాబట్టి , ఈ సినిమా కూడా అవుతుందనే నమ్మకం ట్రేడ్ లో ఉంది. కానీ తమిళ డైరెక్టర్స్ తో పని చేసిన ఏ టాలీవుడ్ స్టార్ హీరో కూడా ఈమధ్య కాలం లో సక్సెస్ అందుకోలేదు. మరి నవీన్ పోలిశెట్టి ఆ సెంటిమెంట్ కి బ్రేక్ వేస్తారా లేదా అనేది చూడాలి. త్వరలోనే షూటింగ్ కార్యక్రమాలను మొదలు పెట్టుకోనున్న ఈ చిత్రం , వచ్చే ఏడాది సమ్మర్ కానుకగా విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయి.
