https://oktelugu.com/

Navadeep : ఆ హీరోయిన్ చనిపోయింది నా వల్ల కాదు అంటూ హీరో  నవదీప్ ఎమోషనల్ కామెంట్స్

ఆయన మాట్లాడుతూ '2005 వ సంవత్సరం లో ఒక హీరోయిన్ ఆత్మహత్య చేసుకొని చనిపోవడం తో ఒక మీడియా వర్గం దానిని నాకు అంటగట్టాలని చూసారు, కానీ ఆ అమ్మాయికి నాకు ఎలాంటి సంబంధం లేదు, అలాగే నేను ఒక గే అని కూడా ప్రచారం చేసారు. అది నిజం కాదు అని ఇప్పుడు మీ ముందు నేను ప్రూవ్ చెయ్యలేను

Written By:
  • Vicky
  • , Updated On : May 7, 2023 / 03:47 PM IST
    Follow us on

    Navadeep : టాలీవుడ్ లో మంచి టాలెంట్ ఉన్న హీరోలలో ఒకడు నవదీప్.ప్రముఖ దర్శకుడు తేజ తెరకెక్కించిన ‘జై’ అనే సినిమా ద్వారా ఇండస్ట్రీ కి పరిచయమైనా నవదీప్ ఆ తర్వాత పలు సూపర్ హిట్ సినిమాల్లో హీరో గా నటించాడు.కానీ మధ్యలో కొన్ని ఫ్లాప్స్ పడేసరికి ఆయన ఇతర హీరోల సినిమాల్లో క్యారక్టర్ ఆర్టిస్టు రోల్స్ మరియు నెగటివ్ రోల్స్ లో కనిపించాడు. అయితే ఆయన చాలా కాలం తర్వాత మెయిన్ హీరో గా నటించిన వెబ్ సిరీస్ ‘న్యూ సెన్స్’ .

    ఈ సిరీస్ 12 వ తేదీ నుండి ఆహా మీడియా లో స్ట్రీమింగ్ కాబోతుంది.ఇది ఇలా ఉండగా నవదీప్ గురించి సోషల్ మీడియా లో మరియు ఇండస్ట్రీ సర్కిల్స్ ఎప్పటి నుండో కొన్ని రూమర్స్ ప్రచారం అవుతూ ఉండేవి.అదేమిటి అంటే ఆయన ఒక ‘గే’ అని, అప్పట్లో ఈయన వల్ల ఒక ప్రముఖ స్టార్ హీరోయిన్ ఆత్మహత్య చేసుకొని చనిపోయిందని కొన్ని రూమర్స్ ప్రచారం అయ్యాయి.

    వీటిపై నవదీప్ ఇన్ని రోజులు రెస్పాండ్ అవ్వలేదు కానీ, నిన్న జరిగిన న్యూసెన్స్ విలేఖరుల సమావేశం లో స్పందించాడు.ఆయన మాట్లాడుతూ ‘2005 వ సంవత్సరం లో ఒక హీరోయిన్ ఆత్మహత్య చేసుకొని చనిపోవడం తో ఒక మీడియా వర్గం దానిని నాకు అంటగట్టాలని చూసారు, కానీ ఆ అమ్మాయికి నాకు ఎలాంటి సంబంధం లేదు, అలాగే నేను ఒక గే అని కూడా ప్రచారం చేసారు. అది నిజం కాదు అని ఇప్పుడు మీ ముందు నేను ప్రూవ్ చెయ్యలేను, అలాగే అప్పట్లో మా ఇంట్లో రేవ్ పార్టీ జరిగింది అంటూ రూమర్స్ వచ్చాయి, అందులో కూడా ఎలాంటి నిజం లేదు, ఆరోజు నేను ఫామ్ హౌస్ లో మా అమ్మతో డిన్నర్ చేస్తున్నాను. ఆమె నాతో పాటుగా ఉండడం వల్ల ఆమె పై కూడా తప్పుగా రాసారు.తప్పుడు వార్తల వల్ల మా ఇంట్లో కూడా నన్ను అనుమానించడం ప్రారంభించారు’ అంటూ చెప్పుకొచ్చాడు.