Photo Story : ప్రేమిస్తే’ హీరోయిన్ సంధ్యను ఇప్పుడు చూస్తే షాక్ అవ్వకుండా ఉండలేరు..

ఇటీవల ఆమెకు సంబంధించిన లేటేస్ట్ ఫొటోలు బయటకు వచ్చాయి. అవి వైరల్ కావడంతో సంధ్యను చూసిన వారు ఆశ్చర్యపోతున్నారు. పూర్తిగా గుర్తుపట్టలేనంతగా మారిపోవడంతో ఆమె గురించి రకరకాలుగా కామెంట్లు చేస్తున్నారు. ఒకప్పుడు ఎంతో అందంగా ఉన్న సంధ్య ఇప్పటికీ అంతే స్మార్ట్ నెస్ తో ఉన్నారని అంటున్నారు.

Written By: Chai Muchhata, Updated On : May 7, 2023 3:27 pm
Follow us on

Photo Story : కాలం మారుతున్న కొద్దీ ఎన్ని సినిమాలు వచ్చినా కొన్ని బ్లాక్ బస్టర్స్ మాత్రం ప్రేక్షకుల మదిలో అలాగే ఉండిపోతాయి. ఎన్ని కొత్త కథలతో సినిమాలు వచ్చిన ఆ పాత మధురాలు మరిచిపోకుండా ఉంటాయి. నాటి నుంచి నేటి వరకు ప్రేమను బేస్ చేసుకొని ఎన్నో సినిమాలు వచ్చాయి. యూత్ ను అట్రాక్ట్ చేసి బంపర్ హిట్టుకొట్టాయి. అలా 2004లో వచ్చిన ‘ప్రేమిస్తే’ బ్లాక్ బస్టర్ హిట్టు కొట్టింది. లవ్ చిత్రాల ప్రభంజనం సృష్టిస్తున్న తరుణంలో ఈ మూవీ సెన్సేషనల్ క్రియేట్ చేసింది.  తమిళ నుంచి డబ్ చేసిన మూవీ అయినా తెలుగు ప్రేక్షకులు విపరీతంగా ఆదరించారు. దీంతో ఈ సినిమాలో నటించిన వారికి ప్రత్యేక గుర్తింపు వచ్చింది. ముఖ్యంగా ఇందులో నటించిన హీరోయిన్ ను ఎవరూ మరిచిపోరు. మరి ఆ భామ ఇప్పుడెలా ఉందో తెలుసా?

బాలాజీ శక్తివేల్ రచించి తీసిన అద్భుతమైన ప్రేమ కావ్యం ‘ప్రేమిస్తే’. 2004 డిసెంబర్ 17న విడుదలయిన ఈ మూవీ ఆ తరువాత తెలుగు, కన్నడం, బెంగాలీ, మరాఠీ భాషల్లో డబ్ అయింది. తమిళంతో పాటు అన్ని భాషల్లోనూ ఈ మూవీ విజయం సాధించింది. కథ పరంగానే కాకుండా కమర్షియల్ గా ప్రేమిస్తే సినిమాకు గుర్తింపు వచ్చింది. ఈ సినిమాతో హీరోయిన్ సంధ్య ఫేమస్ అయింది. ఆ తరువాత ఈ భామకు బోలేడు అవకాశాలు వచ్చాయి.

ఇందులో భరత్, సంధ్యలు హీరో, హీరోయన్లుగా నటించారు. హీరోయిన్ గా సంధ్య పెద్దగా గ్లామర్ షో చేయకపోయినా నటనపరంగా ఆమెకు మంచి మార్కులే పడ్డాయి. అయితే ఆ తరువాత హీరోయిన్ గా కాకుండా సైడ్ పాత్రల్లో కనిపించి మెప్పించారు. తెలుగులో మరోసారి ఆమె పవన్ కల్యాణ్ ‘బంగారం’లో కనిపించారు. ఇందులో పల్లెటూరి అమ్మాయిలా కనిపించి ఆకట్టుకున్నారు. అయితే ఆ తరువాత మాత్రం సంధ్య మళ్లీ కనిపించ లేదు.

సినిమాల్లో అవకాశాలు తగ్గడంతో సంధ్య ఖాళీగానే ఉండిపోయింది. ఈ తరుణంలో ఆమె చెన్నైకి చెందిన ఓ సాప్ట్ వేర్ ఇంజనీర్ ను ప్రేమించారు. ఆ తరువాత వీరిద్దరు 2015లో పెళ్లి చేసుకున్నారు. అయితే ఇంట్లో వాళ్లకు నచ్చకపోవడంతో టెంపుల్ లో సాదాసీదాగా పెళ్లి చేసుకున్నారు. పెళ్లి తరువాత సంధ్య పూర్తిగా మారిపోయింది. అయితే సంధ్య సోషల్ మీడియాలో ఎక్కువగా యాక్టివ్ గా ఉండేది కాదు.

కానీ ఇటీవల ఆమెకు సంబంధించిన లేటేస్ట్ ఫొటోలు బయటకు వచ్చాయి. అవి వైరల్ కావడంతో సంధ్యను చూసిన వారు ఆశ్చర్యపోతున్నారు. పూర్తిగా గుర్తుపట్టలేనంతగా మారిపోవడంతో ఆమె గురించి రకరకాలుగా కామెంట్లు చేస్తున్నారు. ఒకప్పుడు ఎంతో అందంగా ఉన్న సంధ్య ఇప్పటికీ అంతే స్మార్ట్ నెస్ తో ఉన్నారని అంటున్నారు. ప్రస్తతం సంధ్య దంపతులకు ఓ పాప ఉంది. ఆమె మళ్లీ సినిమాల్లోకి వస్తుందా? అని కొందరు కామెంట్ పెడుతున్నారు.