https://oktelugu.com/

Vangaveeti Radhakrishna: కఠిన నిర్ణయం దిశగా ఆ యువనేత!

Vangaveeti Radhakrishna వాస్తవానికి వైయస్సార్ కాంగ్రెస్( YSR Congress ) పార్టీలో ఉండి ఉంటే ఇప్పటికే కీలక పదవులు అనుభవించేవారు రాధాకృష్ణ. 2019 ఎన్నికల్లో మచిలీపట్నం పార్లమెంట్ స్థానం నుంచి పోటీ చేయాలని జగన్మోహన్ రెడ్డి సూచించారు.

Written By: , Updated On : March 23, 2025 / 09:51 AM IST
Vangaveeti Radhakrishna

Vangaveeti Radhakrishna

Follow us on

Vangaveeti Radhakrishna: వంగవీటి రాధాకృష్ణ( vangaveeti Radha Krishna ) తీవ్ర నిర్ణయం దిశగా అడుగులు వేస్తున్నట్లు సమాచారం. తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేయబోతున్నట్లు ప్రచారం నడుస్తోంది. పార్టీలో కనీస గుర్తింపు దక్కకపోవడం పై ఆయన ఆవేదనతో ఉన్నట్లు సమాచారం. ఈ సార్వత్రిక ఎన్నికల్లో ఆయన టికెట్ ఆశించలేదు. కూటమికి మద్దతుగా ప్రచారం చేశారు. కూటమి అధికారంలోకి రావడంతో తప్పకుండా తనకు నామినేటెడ్ పదవి దక్కుతుందని భావించారు. ముఖ్యంగా ఎమ్మెల్సీ పదవిపై ఆశలు పెట్టుకున్నారు. కీలకమైన నామినేటెడ్ పోస్టుల భర్తీ పూర్తయింది. ఎమ్మెల్యేల కోటా కింద ఎమ్మెల్సీ పదవుల ఎంపిక కూడా జరిగిపోయింది. కానీ రాధాకృష్ణకు ఎటువంటి అవకాశం దొరకలేదు. దీంతో తీవ్ర ఆవేదనతో ఉన్నట్లు తెలుస్తోంది.

Also Read: బిజెపిని వ్యతిరేకించని జగన్

* కీలక పదవులు మిస్
వాస్తవానికి వైయస్సార్ కాంగ్రెస్( YSR Congress ) పార్టీలో ఉండి ఉంటే ఇప్పటికే కీలక పదవులు అనుభవించేవారు రాధాకృష్ణ. 2019 ఎన్నికల్లో మచిలీపట్నం పార్లమెంట్ స్థానం నుంచి పోటీ చేయాలని జగన్మోహన్ రెడ్డి సూచించారు. కానీ రాధాకృష్ణ తాను విజయవాడ నగరం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేస్తానని పట్టుబట్టారు. అయితే వివిధ సమీకరణల్లో భాగంగా రాధాకృష్ణను నచ్చజెప్పే ప్రయత్నం చేశారు జగన్మోహన్ రెడ్డి. కానీ ఆవేశంగా ఆయన నిర్ణయం తీసుకున్నారు. తెలుగుదేశం పార్టీలో చేరారు. ఆ పార్టీకి 2019 ఎన్నికల్లో మద్దతుగా ప్రచారం చేశారు. పార్టీ ఓడిపోవడంతో రాధాకృష్ణకు అవకాశం లేకుండా పోయింది. ఐదేళ్లపాటు టిడిపిలో కొనసాగాల్సి వచ్చింది.

* ఎన్నో రకాల ఒత్తిళ్లు ఎదురైనా
అయితే గత ఐదేళ్లలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో కొడాలి నాని( Kodali Nani ), వల్లభనేని వంశీ హవా నడిచింది. ఆ ఇద్దరికీ వంగవీటి రాధాకృష్ణ సన్నిహితుడు. తిరిగి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేర్చుకునేందుకు వారు ప్రయత్నించారు. చాలా రకాలుగా ఒత్తిడి చేశారు. జగన్మోహన్ రెడ్డి వద్ద సుపరిచిత స్థానం ఇప్పిస్తామని కూడా చెప్పుకొచ్చారు. కానీ రాధాకృష్ణ మాత్రం తెలుగుదేశం పార్టీలోనే కొనసాగారు. లోకేష్ నాయకత్వాన్ని సమర్థిస్తూ వచ్చారు. ఈ ఎన్నికల్లో కూటమి గెలుపు కోసం అహోరాత్రులు శ్రమించారు. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయనకు ఎటువంటి అవకాశం లేకుండా పోయింది.

* వేరే పార్టీలో చేరరు
అయితే వంగవీటి రాధాకృష్ణ తెలుగుదేశం పార్టీకి గుడ్ బై చెబితే.. ఇతర పార్టీల్లో చేరే అవకాశం లేదు. అయితే ఆయన ఇప్పటికిప్పుడు కఠిన నిర్ణయం తీసుకుంటారని ఎక్కువమంది భావించడం లేదు. గతంలో కూడా క్షణికావేశంతో తీసుకున్న నిర్ణయాలతో ఆయన మూల్యం చెల్లించుకున్నారు. 2004లో తొలిసారిగా ఎమ్మెల్యేగా ఎన్నికై అసెంబ్లీలో అడుగు పెట్టారు. గత 20 ఏళ్లుగా ఆయన పదవులకు దూరంగా ఉన్నారు. ఇప్పటికే రాధాకృష్ణకు చంద్రబాబుతో పాటు లోకేష్ హామీ ఇచ్చారు. తప్పకుండా రాధాకృష్ణకు ఎమ్మెల్సీ పదవి ఇస్తారని టిడిపి వర్గాల్లో ప్రచారం ఉంది. మరి వంగవీటి రాధాకృష్ణ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి.