Natural Star Nani: నాచురల్ స్టార్ నాని తనదైన సహజ నటనతో అభిమానుల మనసులలో చెరగని ముద్ర వేసుకుంటున్నాడు. విభిన్న పాత్రలు, విభిన్న కధాంశాలతో ప్రేక్షకులను అలరిస్తూ ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు అని చెప్పాలి. అయితే ఇటీవల కాలంలో నానికి సరైన విజయం దక్కలేదనే చెప్పాలి. ఆయన నటించిన వీ, టక్ జగదీష్ సినిమాలు ఓటీటీలో విడుదల అయ్యి… సక్సెస్ సాధించకపోవడం ఆందోళన కలిగిస్తోంది. అయితే ప్రస్తుతం నాని యాక్ట్ చేస్తున్న ” శ్యామ్ సింగ రాయ్ ” సినిమా నుంచి అదిరిపోయే అప్డేట్ ను మూవీ యూనిట్ ప్రకటించింది.
అయితే తాజాగా శ్యామ్ సింగరాయ్ మూవీ యూనిట్ మ్యూజికల్ ప్రమోషన్స్ ప్రారంభించింది. ” రైజ్ ఆఫ్ శ్యామ్” అంటూ విడుదల చేయనున్న ఈ లిరికల్ వీడియో ప్రోమో అందరినీ ఆకట్టుకుంటుంది. నవంబర్ 6న ఈ సినిమా నుంచి ఫస్ట్ సింగిల్ రాబోతోందని మూవీ మేకర్స్ ప్రకటించారు. ఈ మేరకు ఓ పోస్టర్ ను కూడా విడుదల చేశారు. ఈ పోస్టర్ లో నాని కుర్చీలో కూర్చుని… చేతిలో సిగరెట్ పట్టుకుని, సీరియస్ లుక్ తో కనిపిస్తున్నారు.
RISING In to National Trends📈#ShyamSinghaRoy 🔱 TRENDING on Twitter INDIA💥
First Lyrical #RISEOFSHYAM 🎵on 6th NOV⌛
Natural 🌟@NameisNani @MickeyJMeyer @Sai_Pallavi92 @IamKrithiShetty @Rahul_Sankrityn @MickeyJMeyer @vboyanapalli @NiharikaEnt @saregamasouth #SSRonDEC24th pic.twitter.com/AobgNx5zpp
— Niharika Entertainment (@NiharikaEnt) October 30, 2021
ఈ సినిమాకు టాక్సీవాల ఫేమ్ రాహుల్ సాంకృత్యన్ దర్శకత్వం వహించనున్నాడు. పిరియాడికల్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో సాయి పల్లవి, మడోనా సెబాస్టియన్ తో పాటు కృతిశెట్టి హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇప్పటికే ఆ చిత్రం నుంచి విడుదలైన ఫస్ట్ లుక్, పోస్టర్లకు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమా మీద మీద పాజిటివ్ వైబ్స్ ఏర్పడ్డాయి. ఈ సినిమాను క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 24 నా విడుదల చేయనున్నట్లు ప్రకటించారు.