Pushpaka Vimanam: ఆనంద్ దేవరకొండ ” పుష్పక విమానం” ట్రైలర్ రిలీజ్ చేసిన… అల్లు అర్జున్

Pushpaka Vimanam: టాలీవుడ్ రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ తమ్ముడిగా సినీ పరిశ్రమలోకి అడుగు పెట్టాడు ఆనంద్ దేవరకొండ. దొరసాని సినిమాతో తెలుగు తెరకు ఎంట్రీ ఇచ్చాడు ఈ యంగ్ హీరో. ఈ మూవీలో హీరోయిన్ గా హీరో రాజశేఖర్ కుమార్తె శివాని రాజశేఖర్ నటించారు. ఈ సినిమా ప్రేక్షకులను ఆశించిన స్థాయిలో అలరించలేకపోయింది. కానీ వీరి నటనతో మాత్రం ప్రేక్షకుల్లో మంచి మార్కులే పడ్డాయి. ఆ తర్వాత  మిడిల్ క్లాస్ మెలోడీస్ సినిమాతో మంచి విజయాన్ని […]

Written By: Sekhar Katiki, Updated On : October 30, 2021 8:34 pm
Follow us on

Pushpaka Vimanam: టాలీవుడ్ రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ తమ్ముడిగా సినీ పరిశ్రమలోకి అడుగు పెట్టాడు ఆనంద్ దేవరకొండ. దొరసాని సినిమాతో తెలుగు తెరకు ఎంట్రీ ఇచ్చాడు ఈ యంగ్ హీరో. ఈ మూవీలో హీరోయిన్ గా హీరో రాజశేఖర్ కుమార్తె శివాని రాజశేఖర్ నటించారు. ఈ సినిమా ప్రేక్షకులను ఆశించిన స్థాయిలో అలరించలేకపోయింది. కానీ వీరి నటనతో మాత్రం ప్రేక్షకుల్లో మంచి మార్కులే పడ్డాయి. ఆ తర్వాత  మిడిల్ క్లాస్ మెలోడీస్ సినిమాతో మంచి విజయాన్ని అందుకున్నాడు ఆనంద్. ప్రస్తుతం కొత్త దర్శకుడు దామోదర తెరకెక్కిస్తున్న ” పుష్పక విమానం ” అనే సినిమాలో నటిస్తున్నాడు ఆనంద్. ఈ సినిమాను కింగ్ అఫ్ ది హిల్ ఎంటర్టైన్మెంట్స్ మరియు టామ్ గా ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మించాయి. అయితే తాజాగా ఈ సినిమా నుంచి ఓ అదిరిపోయే అప్ డేట్ వచ్చింది.

ఈ సినిమా ట్రైలర్ ను ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తాజాగా విడుదల చేశారు. ఇప్పటికే రిలీజ్ అయిన ఫస్ట్ లుక్, టీజర్ లకు ప్రేక్షకుల్లో మంచి స్పందన లభించగా… ఈ ట్రైలర్ తో మూవీ పట్ల అంచనాలను పెంచేశారు అనే చెప్పాలి. పుష్పక విమానం సినిమాకు పాజిటివ్ బజ్ క్రియేట్ అయిన సంగతి తెలిసిందే. రిలీజ్ అయిన రెండు పాటలకు కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ నేపథ్యంలోనే అల్లు అర్జున్ చేతుల మీదుగా ఈ ట్రైలర్ విడుదల చేయడంతో సినిమా ఇప్పుడు మరో రేంజ్ కు వెళ్లిందని చెప్పాలి.

పెళ్లయిన తర్వాత భార్య వేరొకరితో వెళ్ళిపోతే ఆ యువకుడు పడే అవస్థలను ఈ సినిమాలో చూపించినట్లు తెలుస్తుంది. ఈ  ట్రైలర్ ను పరిశీలిస్తే  ఆనంద్ దేవరకొండ మరోసారి తన నటనతో మ్యాజిక్ చేసేలా ఉన్నట్లు కనబడుతుంది. విజువల్స్, మ్యూజిక్ ఈ సినిమాకు అదనపు ఆకర్షణ అని చెప్పాలి.