https://oktelugu.com/

Anchor Vishnu priya: “పుష్ప” లోని సమంత పాటకు స్టెప్పులు ఇరగదీసిన… యాంకర్ విష్ణు ప్రియ

Anchor Vishnu priya: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప చిత్రం థియేటర్స్ లో సందడి షురూ చేసింది. పుష్ప రాజ్ గా అల్లు అర్జున్ అదరగొట్టాడు అంటూ ప్రశంసలు దక్కుతున్నాయి. పుష్ప చిత్రంలో సమంత ఐటమ్ సాంగ్ ప్రేక్షకులని ఆకర్షిస్తోంది. థియేటర్స్ లో కూడా సమంత ఐటమ్ సాంగ్ కి అదిరిపోయే రెస్పాన్స్ వస్తోంది. యూట్యూబ్ లో రికార్డు స్థాయిలో వ్యూస్ తో ఈ సాంగ్ దూసుకుపోతున్న విషయం తెలిసిందే. సమంత తొలిసారి స్టెప్పులేసిన […]

Written By: , Updated On : December 17, 2021 / 06:36 PM IST
Follow us on

Anchor Vishnu priya: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప చిత్రం థియేటర్స్ లో సందడి షురూ చేసింది. పుష్ప రాజ్ గా అల్లు అర్జున్ అదరగొట్టాడు అంటూ ప్రశంసలు దక్కుతున్నాయి. పుష్ప చిత్రంలో సమంత ఐటమ్ సాంగ్ ప్రేక్షకులని ఆకర్షిస్తోంది. థియేటర్స్ లో కూడా సమంత ఐటమ్ సాంగ్ కి అదిరిపోయే రెస్పాన్స్ వస్తోంది. యూట్యూబ్ లో రికార్డు స్థాయిలో వ్యూస్ తో ఈ సాంగ్ దూసుకుపోతున్న విషయం తెలిసిందే. సమంత తొలిసారి స్టెప్పులేసిన ఐటెం సాంగ్ కావడంతో ఈ పాటపై విపరీతమైన హైప్ నెలకొంది. అందుకు తగ్గట్లుగానే దేవిశ్రీ మంచి బీట్ తో కంపోజ్ చేశారు. మంగ్లీ సోదరి ఇంద్రావతి మత్తెక్కించే వాయిస్ తో అందరినీ ఫిదా చేసింది.

Anchor Vishnu priya

anchor vishnu priya dance for allu arjun pushpa item song

Also Read: ఇండియన్ బాక్స్ ఆఫీస్ పై సత్తా చాటుతున్న… స్పైడర్ మ్యాన్

ఊ అంటావా మావ ఊ ఊ అంటావా అంటూ సాగే ఈ పాట సోషల్ మీడియాని షేక్ చేస్తోంది అని చెప్పాలి. ఇప్పుడు తాజాగా యాంకర్ విష్ణు ప్రియ ఈ ఐటమ్ సాంగ్ కి అదిరిపోయే స్టెప్పులు వేసింది. ఈ సాంగ్ కి తాను డాన్స్ చేసిన వీడియోని విష్ణు ప్రియా సోషల్ మీడియాలో షేర్ చేసింది. విష్ణు ప్రియ తన నడుము అందాలు ఆరబోస్తూ మత్తెక్కించే చూపులతో చేసిన ఈ డ్యాన్స్ వీడియో ఇంటర్నెట్ లో వైరల్ గా మారింది. ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటున్న విష్ణు ప్రియ… తరచుగా తన హాట్ ఫోటోస్, డ్యాన్స్ వీడియోల్ని నెటిజన్లతో పంచుకుంటూ ఫాలోయింగ్ ని పెంచుకుంటుంది. తరచుగా బెల్లీ డ్యాన్స్ చేస్తూ విష్ణు ప్రియా కుర్రాళ్ళని హీటెక్కిస్తూ ఉంటుంది. ఈసారి ఈ డాన్స్ వీడియోతో కుర్రకారుకు నిద్ర పట్టకుండా చేస్తుంది.

Anchor Vishnu priya Dancing for Pushpa Item Song ... #Pushpa #Actress_Samantha #Ooantavamavasong

Also Read: బాలకృష్ణ – గోపిచంద్ సినిమాలో ముఖ్య పాత్ర చేయనున్న… వరలక్ష్మి శరత్ కుమార్