https://oktelugu.com/

Naresh- Ramya Raghupathi: నరేష్ కి షాక్ ఇచ్చిన మూడో భార్య… మళ్ళీ పెళ్లి విడుదల అవుతుందా?

రమ్య రఘుపతి పిటిషన్ పై తీర్పు రావాల్సి ఉంది. మే 26న మళ్ళీ పెళ్లి విడుదల తేదీగా ప్రకటించారు. మళ్ళీ పెళ్లి బయోపిక్ కాదు. చాలా మంది పెళ్లిళ్లు చేసుకొని ఇష్టం లేకపోయినా సమస్యల మధ్య బ్రతుకీడుస్తున్నారు

Written By:
  • Shiva
  • , Updated On : May 25, 2023 / 04:05 PM IST

    Naresh- Ramya Raghupathi

    Follow us on

    Naresh- Ramya Raghupathi: మళ్ళీ పెళ్లి చిత్ర టీజర్ చూసిన వెంటనే అందరి మదిలో మెదిలిన ప్రశ్న ఒకటే… ఇది కాంట్రవర్సీకి దారి తీయవచ్చని. నరేష్ మూడో భార్య మళ్ళీ పెళ్లి చిత్రంపై అభ్యంతరం చెప్పడం ఖాయమని భావిస్తుండగా అదే జరిగింది. విడుదలకు ఒక్కరోజు ముందు ఆమె రంగంలోకి దిగారు. మళ్ళీ పెళ్లి చిత్ర విడుదల ఆపేయాలని నాంపల్లి ఫ్యామిలీ కోర్టులో పిటీషన్ వేసింది. ఈ చిత్రం తన గౌరవానికి భంగం కలిగించేదిగా ఉందని మూవీ విడుదల కాకుండా చర్యలు తీసుకోవాలి కోరింది.

    రమ్య రఘుపతి పిటిషన్ పై తీర్పు రావాల్సి ఉంది. మే 26న మళ్ళీ పెళ్లి విడుదల తేదీగా ప్రకటించారు. మళ్ళీ పెళ్లి బయోపిక్ కాదు. చాలా మంది పెళ్లిళ్లు చేసుకొని ఇష్టం లేకపోయినా సమస్యల మధ్య బ్రతుకీడుస్తున్నారు. వాళ్ళ కోసమే ఈ చిత్రం అని నరేష్ అన్నారు. టీజర్, ట్రైలర్ చూస్తే మాత్రం ఇది నరేష్-పవిత్ర లోకేష్-రమ్య రఘుపతి జీవితాల్లో జరిగిన సంఘటనల ఆధారంగా తెరకెక్కించారని అర్థం అవుతుంది. నరేష్-పవిత్ర లోకేష్ తమ పాత్రలు తామే చేస్తున్నారు. రమ్య రఘుపతి పాత్రను వనిత విజయ్ కుమార్ చేస్తున్నారు.

    ఈ చిత్రంలో కృష్ణ, విజయనిర్మల రిఫెరెన్సులు కూడా ఉన్నాయి. ఆ పాత్రల్లో శరత్ బాబు, జయసుధ నటించారు. రమ్య రఘుపతిపై రివేంజ్ తీర్చుకునేందుకే మళ్ళీ పెళ్లి చిత్రం అనే వాదన కూడా ఉంది. ఈ వాదనను నరేష్ ఖండించారు. రివేంజ్ తీర్చుకోవడానికి సినిమా తీయాల్సిన అవసరం లేదన్నారు. మళ్ళీ పెళ్లి చిత్రానికి ఎమ్ ఎస్ రాజు దర్శకుడు. నరేష్ స్వయంగా నిర్మించారు. రమ్య రఘుపతి పిటిషన్ తో విడుదల సందిగ్ధంలో పడింది.

    రమ్య రఘుపతి నరేష్ మూడో భార్య. ఈమెతో ఆయనకు విబేధాలు తలెత్తి విడిపోయారు. చాలా కాలంగా విడివిగా ఉంటున్నారు. నరేష్ విడాకులు కోరుతూ పిటిషన్ వేశారు. రమ్య రఘుపతి మాత్రం విడాకులు ఇవ్వనంటున్నారు. కొడుకు భవిష్యత్ కోసం నరేష్ కావాలని ఆమె అంటున్నారు. రమ్య రఘుపతికి దూరమయ్యాక నరేష్ పవిత్ర లోకేష్ తో సహజీవనం చేస్తున్నారు. గత నాలుగేళ్లుగా వీరు కలిసి ఉంటున్నారని సమాచారం.