Southwest Monsoon: వాతావరణ శాఖ తీపి కబురు చెప్పింది. రుతుపవనాలు రానున్నాయని తెలిపింది. ఈ సారి కూడా ముందుగానే రుతుపవనాలు రానున్నాయి. మే 20నే కేరళ తీరం తాకినట్లు తెలుస్తోంది. ఈనేపథ్యంలో వాతావరణ శాఖ గుడ్ న్యూస్ చెప్పింది. వేసవి తాపంతో అల్లాడుతున్న ప్రజలకు ఇది నిజంగా తీపి కబురే. నైరుతి రుతుపవనాలు భారత ఉపఖండంలోకి ప్రవేశించాయి. ఇప్పటికే అండమాన్ తీరాన్ని తాకాయి.
జూన్ మొదటి వారంలో కేరళను తాకుతాయి. వారం రోజుల్లో జూన్ 3 నాటికి కేరళను తాకి దేశమంతటా విస్తరిస్తాయి. ఈ నేపథ్యంలో మే 20 నాటికి అండమాన్ తీరాన్ని తాకి ముందస్తుగానే విస్తరించనున్నట్లు చెబుతున్నారు. దీంతో గత ఏడాది మాదిరే ఈ సారి కూడా వర్షాలు కూడా బాగా పడే సూచనలు కనిపిస్తున్నాయని వాతావరణ శాఖ అధికారులు సూచిస్తున్నారు.
బంగాళాఖాతంలో వారం రోజుల పాటు మహాసేన్ తుపాన్ ఏర్పడే అవకాశం ఉంటుంది. నైరుతి రుతుపవనాలకు కాలం కలిసిరానుంది. ఈ సారి రుతుపవనాలు ముందస్తుగానే పలకరించనున్నాయి. జూన్ మొదటి వారంలోనే ప్రవేశించి రెండో వారంలో రాష్ట్రాన్ని విస్తరించనున్నాయి. దీంతో వర్షాలు బాగా పడితే పంటలు కూడా మంచిగా పండే అవకాశాలున్నాయి.
ప్రస్తుతం ఎండలు బెంబేలెత్తిస్తున్నాయి. చాలా ప్రాంతాల్లో 45-47 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. రుతుపవనాలపై వాతావరణ శాఖ సమాచారం ఇవ్వడంతో ప్రజల్లో హర్షం వ్యక్తమవుతోంది. రోహిణికార్తె ఆరంభం కావడంతో ఇక పగటి ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. వర్షాలు పలకరిస్తే కానీ ఈ వేడి దూరం కాదు. దీంతో ప్రజలు వర్షాల కోసం ఎదురు చూస్తున్నారు.