Director Harish Shankar: గబ్బర్ సింగ్ డైరెక్టర్ కి కాలితే ఇలానే ఉంటుంది… ఓ రేంజ్ లో ఇచ్చిపడేశాడు!

రామబాణం మూవీ ప్రమోషన్స్ లో హీరోయిన్ డింపుల్ హయాతీని మీరు వల్గర్ గా ఉన్నారు అనేశారు. అసలు వల్గర్ అనేది ఎంత పెద్ద పదమో తెలియకుండానే ప్రెస్ మీట్లో ఆయన వాడేశారు. డింపుల్ హయాతీతో పాటు యూనిట్ షాక్ అయ్యారు వల్గర్ గా ఎక్కడ కనిపిస్తున్నాను.

Written By: Shiva, Updated On : May 25, 2023 3:59 pm

Director Harish Shankar

Follow us on

Director Harish Shankar: జర్నలిజం పేరుతో పైత్యం ప్రదర్శించడం సరికాదు. ప్రెస్ మీట్ కి రావాలంటే సెలెబ్రిటీలు భయపడే పరిస్థితి విలేకరులు కల్పిస్తున్నారు. సందర్భాన్ని పక్కన పెట్టి వ్యక్తిగత విషయాల గురించి అడగటం చేస్తున్నారు. ఆ వేదిక మీద కూర్చునే హీరో, హీరోయిన్, దర్శకుడు, నిర్మాత అంటే మీడియాకు కొంత అలుసు. మేము ఏదడిగినా చెప్పాలన్న భావనలో ఉంటారు. సంతోషం మ్యాగజైన్ అధినేత సురేష్ కొండేటి ఈ మధ్య హద్దులు దాటేస్తున్నారు. తన ప్రశ్నలతో ఇబ్బంది పెట్టేస్తున్నారు.

రామబాణం మూవీ ప్రమోషన్స్ లో హీరోయిన్ డింపుల్ హయాతీని మీరు వల్గర్ గా ఉన్నారు అనేశారు. అసలు వల్గర్ అనేది ఎంత పెద్ద పదమో తెలియకుండానే ప్రెస్ మీట్లో ఆయన వాడేశారు. డింపుల్ హయాతీతో పాటు యూనిట్ షాక్ అయ్యారు వల్గర్ గా ఎక్కడ కనిపిస్తున్నాను. నేను శుభ్రంగా బట్టలు వేసుకుంటే… నాలో వల్గర్ ఎక్కడ కనిపించిందని ఆమె అడిగితే ఆయన దగ్గర సమాధానం లేదు. దర్శకుడు శ్రీవాస్ ఆయనకు పదాలు దొరక్క అది వాడాడు. రామబాణం పక్కా ఫ్యామిలీ మూవీ అని చెప్పి ఫుల్ స్టాప్ పెట్టారు.

తాజాగా ‘2018’ అనే మలయాళ డబ్బింగ్ మూవీ ప్రొమోషనల్ ఈవెంట్ కి చిత్ర యూనిట్ తో పాటు తెలుగులో విడుదల చేస్తున్న బన్నీ వాసు వచ్చారు. హరీష్ శంకర్ గెస్ట్ గా హాజరయ్యాడు. మన తెలుగు హీరోలు ఇలాంటి సినిమాలు ఎందుకు చేయడం లేదని సురేష్ కొండేటి అడిగారు?. ఈ ప్రశ్నకు హరీష్ శంకర్ రియాక్ట్ అయ్యారు. తెలుగు, హిందీ, మలయాళ సినిమా అనేది లేదు. ఇప్పుడు కేవలం సినిమా అనేది మాత్రమే ఉంది. ఆర్ ఆర్ ఆర్, కెజిఎఫ్, బాహుబలి చిత్రాలను డబ్బింగ్ మూవీస్ అంటారా?

మీరు ఈ మధ్య ప్రతి ప్రెస్ మీట్లో ఎవరూ అడగని ఓ కాంట్రవర్సియల్ ప్రశ్న అడిగి యూట్యూబ్ లో వైరల్ అవ్వాలని చూస్తున్నారు. ఏదో సామెత ఉంది. ‘అడిగే వాడు సురేష్ అయితే చెప్పేవాడు హరీష్ అంట’. తెలుగు సినిమా దేశం మొత్తం ఆదరణ దక్కించుకుంటుంది. మనం గొప్ప సాంకేతికతతో సినిమాలు చేస్తున్నాము. ఇంకా మీరు తెలుగు సినిమాను కించపరిచేలా మాట్లాడకండి. మీ అభిప్రాయం జనరల్ గా చెప్పొద్దు, అని మండిపడ్డాడు. బన్నీ వాసు కలుగజేసుకొని వివాదానికి ఫుల్ స్టాప్ పెట్టాడు.